వీధి బాలలు
- T. V. L. Gayathri 
- 5 days ago
- 1 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #వీధిబాలలు, #ఎక్కడుందిన్యాయం

గాయత్రి గారి కవితలు పార్ట్ 42
Veedhi Balalu - Gayathri Gari Kavithalu Part 42 - New Telugu Poems Written By
T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 26/10/2025
వీధి బాలలు - గాయత్రి గారి కవితలు పార్ట్ 42 - తెలుగు కవితలు
రచన: T. V. L. గాయత్రి
వీధి బాలలు
(వచనకవిత)
***********************
వీధి బాలలు పాపము బెంగపడుచు నుండిరి.
బాధ తోడ నలిగి బిక్కుబిక్కు మను చుండిరి.
ఆకలితో దిగులుగా పనులు చేసుకొను చుండిరి.
పాకులాడుచు బ్రతుకు కొఱకు భయపడుచూ నుండిరి.
జీవనమున పలురకాల చింతలతో మునుగుచు నుండిరి.
దేవులాడుచూ నిత్యము దేబిరించి కుములుచు నుండిరి.
వారికి చదువునేర్పు వారెవ్వరు? సాకెడి వారెవ్వరో?
ఊరకనే సానుభూతి చూపించు ఉపన్యాసా లెందులకో?
జనులారా వినరండి!చిన్న పిల్లల ఆక్రందనల నొకసారి!
ధనము కొంత ఖర్చు పెట్టి దాదృత్వమును చూపండి!
పేద బాలలకై మీరలు నిలబడి పెద్ద మనసు చూపండి!
సాదరముగ వారికింత చదువు సంధ్యలను నేర్పండి!//
************************************

ఎక్కడుంది న్యాయం?
(వచనకవిత)
************************************
ఎక్కడుంది న్యాయమీ దేశంలో ఎక్కడుంది ధర్మం? చూపండి!
హింసాత్మక ధోరణి ఈ ప్రజలలో రోజు రోజుకూ పెరుగుతోంది.
మాదకద్రవ్యాల మత్తులోన యువత మంచిని మరచి పోతోంది
కాదంటే కత్తి దూసి కలియ బడతూ తెగ బడతా నంటోంది.
కులమతాల విద్వేషం జాతి లోని ఐకమత్యాన్ని కూల్చి వేస్తోంది.
స్త్రీజాతికి సతతము రక్షణ కరువై భీతిఅనే భూతం తరుముతోంది.
సహనమనే మాట వినిపించలేదు ఈ సంఘంలో తగాదాలు పుట్టాయి.
ధర్మం దారి తప్పి జీవనమున శాంతి మృగ్యమై పోయింది.
సాధుసంతు లెవరైనా కలిసి రండి! జాతికై నిలబడండి!
ఈ రుగ్మతలను బాగు చేసి మీరైనా లోకాన్ని ఉద్దరించండి!//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:



Comments