top of page

వీణాధరి

#ChavaliBalakrishnaveni, #చావలిబాలకృష్ణవేణి, #Veenadhari, #వీణాధరి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


Veenadhari - New Telugu Poem Written By  - Chavali Balakrishnaveni

Published in manatelugukathalu.com on 29/05/2025 

వీణాధరి - తెలుగు కవిత

రచన: చావలి బాలకృష్ణవేణి


సీసము...1


సంగీత సాహిత్య సామ్రాజ్ని శారద

సంబరమ్ములనిచ్చు జనని తానె

దొడ్డవారినిగెల్వ తోఁడుగా నిల్చును

దేవతా మూర్తుల దిశను జూఁపు

నమ్మిన వారికి నాకమ్ము చవిచూపు

గానప్రియ కనుక కరుణ నొలుకు

పదబంధముల గూర్చు పలుకబఁడుల నిచ్చు 

కావ్యరచనకు తా కరము కల్పు 


తేటగీతి ..

తేనె లొలికెడి గానముఁ తీపి గొనును

సంపదలనిచ్చు పూజింప సాధు మూర్తి

బ్రహ్మ దేవుని యిల్లాలు రాత మార్చు

కోరి కొల్వరె జనులార! గుండె నిండ ! 


సీసము ..2


చక్కనై నట్టివౌ చదువరుల హితమౌ

లోకసం రక్షణలోన గలుపు

బుద్దివికాసము పూర్తిగా సమకూర్చు 

చదువులిచ్చెడి తల్లి జాహ్నవిగను

జన్మసంస్కారము జ్ఞానమబ్బగ జేయు 

వేదవేదాంగ సంస్కృత నిలయిగ

శాస్త్రవిషయముల సహృదయ సహకారి

పూజింప మెచ్చి సంపూర్తి నిడును!


తేటగీతి..

ద్యుతి గానిల్చు నుభువిపై ధృతి నీయ

భారతియననింటింటను  బల్కు చుండు

నాకృతినియిచ్చు దేవేరి యైన బాణ!

సంస్కృతికి పట్టుకొమ్మగ సంగ మించు ! 


సీసము ..3


దేవతలునుకోరు  దివ్య వరాంగన

వీణాధరియగుచు , వేదచరిత! 

శ్రీపంచమికితాను జిలుగుల లొలుకంగ

దేవళమ్ములజేరు దేవదేవి !

ఆదిమధ్యాంతర యాకృతిధవళాంగి!

ముగురమ్మలలయందు మూల మంద్రు ! 

బ్రహ్మ లోకమున నివసము గా వాక్కాంత

వేద నివాసిని కృతుల మెరయు ! 


తేటగీతి ..

పండితసభలలో నందరిఁ బలుకరించు

దేవి నవరాత్రు లనుగూఁడి దివ్య ముగను

దర్శనమునొసగు జేజమ్మ తరలి వచ్చు 

రండి కొలువండి , తనివితీరగను జనమ ! 


చావలి బాలకృష్ణవేణి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: చావలి(బులుసు) బాలకృష్ణవేణి


జననము.. రాజమహేంద్రవరము

చదువు ::BA, Hindi pandit,

అభిరుచులు..శ్రీ . నన్నయ కవీశ్వరుడు తిరుగాడిన గోదావరీ తీరప్రాంత బాల్యము వలన కలిగిన తెనుఁగు భాషామతల్లికి ఇతోధిక సేవ చేయుట యందు అమితమైన ఆసక్తి

తద్వారా పద్యవిద్య గ్రహించుట..

సాహిత్య ప్రవేశము....


మద్గురువులు శ్రీ అనంతఛందము స్థాపకులు బ్రహ్మశ్రీ తోపెల్ల బాలసుబ్రమణ్య శర్మ గురువుగారి వద్ద పద్య విద్యలో మెళుకువ లు గ్రహించి..

వారి వద్ద సుమారు 100పైన వివిధ సంకలనములలో వృత్తములు వ్రాయుట.

శ్రీ తోబాసు గురువుగారు వ్రాయించిన శ్రీమద్రామాయణ తేటగీతి ఆంధ్రీకరణలో భాగముగా 3సర్గ ల 2000 వరకూ పద్యములు..

శ్రీ తోబాసు గురువుగారి ప్రోద్బలముతో వివిధ ఛందములలోఅనంత శతసహస్రఛందస్సౌరభము. అనే ఉద్గ్రంధములో 100 వృత్తములు, 100 ప్రముఖుల కవీశ్వరులతో వ్రాయుట వివిధ అనేక ముఖపుస్తక కూటమిలో అనేక కవితా ప్రక్రియలో ఏక్తార.. నానీలు. కవితలు. కధానికలు గజల్స్. అన్నియు వ్రాసి. బహుమతులు పొందుట.. మరికొన్ని అంతర్జాతీయ సంస్థలకు కవితలు కధలు... పద్యములు.. శీర్షికలు వ్రాయుట.. బహుమతులందుకొనుట


స్వయముగా. *శివస్తుతి త్రిశతి*పుస్తకరూపమేర్పడినది.


శ్రీ.. వీరభద్రోదాహరణకావ్యము కూడా.. ప్రచురితమైనది..

బాలకృష్ణబాలలీలలు

శతకము

శ్రీ మార్కండేయోదాహరణము కావ్యము

దేవీ అంతముగా వందల ఛందములలో అనేక వృత్త సంచయములు వ్రాయుట జరిగినది. ఇవన్నియు అముద్రితములు

అనంతఛందమునకు నానీస్ మహతీ ఛానల్

మొదలగు అనేక సంస్థల ద్వారా ప్రముఖులగు అనేక అవధాన వర్యులకు ప్రాశ్నికురాలిగా చేయుట జరిగినది... 🌹🌺☘️ మంచిపుస్తకాలు చదివి నా మనోవికాసాన్ని,  నా విశ్లేషణాశక్తిని మెరుగుపరుచుకోవాలని నా ఆకాంక్ష.

Comments


bottom of page