top of page

వేసవి


'Vesavi' - New Telugu Story Written By Bhagavathula Bharathi

'వేసవి' తెలుగు కథ

రచన: భాగవతుల భారతి

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

తులసితీర్థం మెుదటి చెంచా పోస్తుండగా యశ్వంత్ కి నెలరోజులనుండీ, తనకూ తోడబుట్టిన వాళ్ళమధ్య జరిగిన సంభాషణ, నాన్న మీద తను రాసుకున్న తేటగీతి పద్యమూ గుర్తుకువచ్చి, కళ్ళు చెమర్చాయి.


తేటగీతి.. నాన్న ప్రేమము పరిపూర్ణ మెన్నదగునె? నాన్న! ప్రియమైన కులదేవునాత్మ యతడు నాన్న దాక్షిణ్యమవధి లేనైనదయ్యె యెన్నలేనట్టి ఏకైక పున్నెమతడు.


తర్వాత ఒకరితర్వాత ఒకరుగా తులసితీర్థం ఆయన నోట్లోపోస్తూ, సంభాషణనంతా గుర్తుచేసుకుంటూ, కన్నీళ్ళు తుడుచుకుంటున్నారు.


అయిపోయింది. ఓ మానవదేహం, భూమిమీదికి వచ్చిన కారణాన్ని పూర్తి చేసుకుని, పరలోకానికి పయనమైంది. ఆస్తులు, అంతస్థులూ లేకపోయినా, చదువునూ, సంస్కారాన్నీ, సమానంగా పంచి ఇచ్చిన, తలపండిన ఓపండు, సంసారవృక్షం నుండి రాలిపోతోంది.

కానీ అందరికీ నెలరోజులనుండీ జరిగిన ఫోన్ల కలకలం కలగాపులగంగా, మదిలో మెదులుతోంది.


$$$$$$$$$$$$$


"అయ్యో! ఇప్పుడెలా? అన్నయ్యకి ఫోన్ చేస్తా!"


"వాళ్ళకీ తెలిసే ఉంటుందివిషయం"

కానీ ఇప్పుడు పెద్దోడికి టెంత్ ఎగ్జామ్స్ ఇంకా నాలుగున్నాయి. అవి అవుతేనే గానీ చిన్నోడికి ఐదవ తరగతి పరీక్షలు అవ్వాలి."

"పోన్లే.. ఇంకా చిన్న తరగతులేగా! "

ఈ స్కూల్ లో ఐదువరకే ఉంది. వేరేస్కూల్ లో చేర్చాలంటే ఈ మార్కులలిస్ట్, టి. సి అవసరమేగా! "


"అక్కకి ఫోన్ చేద్దాముండు. హలో! అక్కా.. విషయం తెలిసిందా? నాన్నకి సీరియస్ గా ఉందిట. "


"అవునులేరా! మూడేళ్ళనుండీ, కాన్సర్ తో నానా అవస్థ పడుతున్నారు. ఫోర్థ్ స్టేజ్ అని అప్పుడే చెప్పారుగా డాక్టర్ లు. మన అదృష్టం బాగుంది. ఇన్నాళ్ళూ మన కళ్ళముందే తిరిగారు"


"ఇప్పుడేం చేద్దాం ?"


“చేయటానికేం ఉంది? నాలుగురోజుల్లో వేసవి సెలవులేగా! నువ్వూ, నేనూ, భాస్వంత్ పల్లెటూరి కి వెళ్ళిపోదాం. ఇంతకాలం ట్రీట్మెంట్ పేరుతో డాక్టర్ లతో అందరం ఆయన్ని, చాలా ఇబ్బంది పెట్టేసాం. ఇప్పటికైనా, ఆయనను మన ఊరికిచేర్చి, పిల్లలతో సహా, అక్కడే ఉండి, నాన్న చుట్టూ పిల్లలున్నారనే ప్రశాంతత కల్పించుదాం. వేసవి సెలవుల్లో అందరం ఓచోటకలిసి ఎన్నాళ్ళయిందో! పిల్లల చదువుల పేరుతో, ఎవరిదారి వాళ్ళదయిందిగా "


"సరే! ఎగ్జామ్స్ అయిపోగానే బయలుదేరతాం"


యశ్వంత్ ఫోన్ పెట్టేసి, సారికవైపు చూసాడు. సమ్మతమే నన్నట్లు చూసింది సారిక.

భట్లపెనుమఱ్ఱులో వాలారు పిల్లలతో సహా అందరూ...


"ఈపల్లెటూరు ఏం మారలేదురా!" అనుకున్నారంతా.


"అవును! ఎలామారుతుందీ? రెక్కలొచ్చి ఎగిరి పోయిన పక్షులకు, వెనుదిరిగి వచ్చి గూడు బాగు చేయాలనే కోరిక ఏదీ?" నిట్టూర్చింది మాణిక్యమ్మగారు.


"వైద్యంపేరుతో, హైదరాబాదు లోనే ఉండిపోయాం ఇన్నాళ్ళూ, ఈవేసవికి మాకు మోక్షం వచ్చి, నా ఊరు చేరగలిగాను. సెలవుల పుణ్యమా అని మీరందరూ తరలివచ్చారు నాకింకేం కావాలిరా? "


టీచర్ జాబ్ చేసి రిటైరై వచ్చిన కొద్దో, గొప్పో పిల్లలకు, ఇద్దామనుకున్నా, "నాన్నా, మీ సంపాదన మీయిష్టం.. మాకు చదువులు చెప్పించి, సమాజంలో పెద్దహోదాలో నిలబెట్టారు.. అదిచాలు.. మీ ఆశీస్సులు చాలు... ఈ వయసులో చాలా ఖర్చులుంటాయి మీకు! " అని తన సంపాదనలో పైసాకూడా ఆశించని తన పిల్లలు, ఎంత సంస్కారవంతులూ, అనుకుంటూ..


"మీలాంటి పిల్లలను ఇచ్చిన భగవంతునికి నమస్కరిస్తూ, ఇదే ఆఖరివీడ్కోలు "


నరసింహారావు గారు గాద్గదికంగా అన్న మాటలకు పిల్లలు చలించిపోయారు.

"కాశ్యాస్తుమరణాన్ ముక్తి: అన్నారు. కడుపున పుట్టిన పిల్లలసమక్షంలో అంతకన్నా గొప్ప ముక్తిరా!" నీరసంగా కళ్ళుమూసుకున్నారు నరసింహారావుగారు.

భాస్వంత్, సారిక, యశ్వంత్ ముఖముఖాలు చూసుకున్నారు.


తాటిముంజెలు, కొబ్బరి బోండాలూ, కొబ్బరిఆకులతో బూరలు ఊదటాలూ, తెలిసీతెలియని వయసులో, తాము ఆడిన ఆటలే పిల్లలూ ఆడుతూఉంటే, చూస్తూ మురిసిపోతున్నారు మాణిక్యమ్మ గారు, నరసింహారావు గారు.


పిల్లల సందడికోలాహలం తోనే, నరసింహారావు గారు కొంచెం కొంచెం కోలుకున్నట్లు కనిపించినా, వారం తర్వాత హఠాత్తుగా నేలకు ఒరిగిపోయారు. ఆయన్ని తీసుకుపోయి, మధ్యగదిలో మంచంవేసి, పరుపువేసి పడుకోబెట్టారు.

"మంచం మీద ప్రాణం పోగూడదురా! దింపి వరండాలో... " మాణిక్యమ్మ మాట పూర్తికాకముందే "అమ్మా! ఇంతకష్టపడి కట్టిన తాతలనాటి ఇల్లు.. ముత్తాతగారు, తాతగారు, ఇందులోనే కాలంచేసారు. పనికిిరాక ఎక్కడికిపోయిందీ? వేసవిశెలవులలో, పిల్లలూ, కోడళ్ళూ, అల్లుడూ మనుమలూ, మనుమరాళ్ళందరూ, దగ్గర ఉండగా, తనువు చాలించటం పూర్వజన్మ సుకృతం. మధ్యలో ఈ మూఢనమ్మకాలేంటమ్మా?! "


ఆయన్ని మంచంమీదే, ఆ పరుపువేసి, చక్కని తెల్లని పంచెపరిచి పడుకోబెట్టి, తులసినీళ్ళు పోయటానికి చుట్టూచేరిన పిల్లలను చూస్తుంటే, చూసేవాళ్ళకి అది అంతిమయాత్రలా లేదు. ‘శివుడు అభిషేకాన్ని అందుకోటానికి, కైలాసంనుండి దిగివచ్చి, అలసిపోయి పడుకున్నాడా?’ అన్నట్లుంది ఆ దృశ్యం.


ఊరుఊరంతా కదిలివచ్చారు. తులసితీర్థం అందరూ పోయటం ముగించగానే తలవాల్చేసిన నరసింహారావు, ఎవరూ మూటగట్టుకుని పోలేని, ఏ కలహాలూ లేని సుఖసంతోషాల లోగిలిలో తనువు చాలించటం కలియుగంలోనే కోట్లు పోసినా దొరకని పెన్నిధి, సన్నిధి... అని చెప్పుకుంటుంటే...


"నాన్నా! మాకు ఉద్యోగాల్లో, సెలవులు పెట్టే కష్టంకూడా కలగకుండా, ఈ వేసవి సెలవుల్లో... మేం అందరం కుటుంబాలతో అంతా కలిసిన, మధుర ఙ్ఞాపకాన్ని ఇచ్చి, నరసింహారావు గారి కుటుంబం గొప్పది, పిల్లలూ బంగారాలూ... అనే మాటకూడా మాకే దక్కించావా నాన్నా! ఈరోజుని పెద్దవాళ్ళ మరణం ఓ పండుగ అనేటట్లుగా పెద్ద ఉత్సవంలా జరుపుతాం " అని కళ్ళు తుడుచుకున్నారంతా.


@@@@@@@@@@@@

భాగవతుల భారతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

Podcast Link:

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం

ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.

ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో

బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.


56 views0 comments
bottom of page