top of page

విజయపథం


'Vijayapatham' New Telugu Story

Written By Lakshmi Nageswara Rao Velpuri

'విజయపథం' తెలుగు కథ

రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి"భారతదేశ రాజధాని ఢిల్లీ "

నగరంలో అతి ముఖ్యమైన రద్దీ గల ప్రాంతం, నిత్యం వ్యాపార లావాదేవీలు, ఆఫీసులు ఉండడంతో, అది కూడా ఢిల్లీ మహానగరానికి నడిబొడ్డున ఉన్న ప్రాంతం Connaught place కనుక, ఎక్కువగా విదేశీయులు, పర్యాటకులు వేల మంది వస్తూ పోతూ ఉంటారు, అందులోనూ ఒక విశాలమైన 'అండర్ గ్రౌండ్ ఎ సి మార్కెట్ సెంటర్ దాని పేరు 'పాలిక బజార్ ',

ఒక 300 షాపులతో నిత్యం కళకళలాడుతూ అనేక వేల మందిని ఆకర్షిస్తుంది. ఆ బజారు పేరు "పాలికా బజార్"ఆ మార్కెట్ పైన ఎంతో సువిశాలమైన మైదానం చక్కని పార్కులతో నిండి ఉంటుంది. అది ఢిల్లీకి ప్రత్యేక ఆకర్షణ.

ఒక్కసారిగా అనేకమంది పత్రికా విలేకరులు, ఫోటోగ్రాఫర్లు తేనెటీగల్లాగా ఆ స్థలంలోకి వచ్చారు, ఎందుకంటే సరిగ్గా ఆ పార్కు మధ్యలోనే 10 మంది స్కూలు పిల్లలు తమ తమ స్కూల్ బ్యాగులతో అక్కడికక్కడే నిలబడిపోయారు. అన్ని వైపుల నుంచి పోలీసులు సైరాన్లతో, మైకులతో ఆ పిల్లల వైపు మాట్లాడుతూ' ఉండండి! కదలకండి !ఎక్కడ వారు అక్కడే నిలబడి పొండి, ఆ ప్రాంతంలో ఒక పెద్ద 'బాంబు 'పెట్టబడి ఉందని ఇంటిలిజెన్స్ రిపోర్టు వచ్చింది, అందుకే ఆర్మీ ఆఫీసర్లు అందరూ వచ్చారు, ముఖ్యంగా చిన్నపిల్లలు ఎటు వెళ్లలేక వణికి పోతూ, భయం భయంగా అమ్మా, నాన్న అని అరుస్తూ ఏడుస్తూ అక్కడే నిలబడి పోయారు.

ఈ వార్త క్షణాలలో ఢిల్లీ నగరమంతా పాకింది, ఇసుక వేస్తే రాలినంత జనం పోగవుతున్నారు, పోలీసులు అతి కష్టo మీద జనాలను కంట్రోల్ చేస్తు అంబులెన్స్లకు, మెడికల్ టీమ్ వాహనాలకు మార్గం చేస్తున్నారు. అదే తరుణంలో' హోమ్ డిపార్ట్మెంట్' నుంచి 'బాంబు స్క్వాడ్ 'వచ్చింది.


సమాచారం తెలిసిన పిల్లల తల్లిదండ్రులు, బంధువులు వచ్చి మైక్ లో పిల్లలకు ధైర్యం చెబుతున్నారు. ఈ వార్తలు బ్రేకింగ్ న్యూస్ లో దేశంలోని అన్ని ప్రాంతాలకు పాకింది. ఈ వార్తలన్నీ చూస్తున్న ప్రజానీకం" ఓరి దేవుడా! ఆ పసిపిల్లల ప్రాణాలు కాపాడు నాయనా", అంటూ ఆలయాలలోనూ, మసీదులలోను, చర్చిలోనూ ప్రార్థనలు చేయసాగారు. టీవీలో క్షణం క్షణం వస్తున్న వార్తలతో భయబ్రాంతులైన ప్రజలు భోజనాలు కూడా చేయకుండా, ఆ పసిపిల్లల ముఖాలలో అమాయకత్వం, భయం చూసి తల్లడిల్లిపోతున్నారు.


"శ్రీ ప్రధానమంత్రి, హోం మినిస్టర్ గార్ల" ప్రసంగాలు వినబడుతున్నాయి. ప్రజలారా!! మీరు

అధైర్య పడకండి, మన భారతదేశ చరిత్రలోనే ఇలాంటిది జరగడం ప్ర ప్రధమం, మన మన' బాంబ్ డిస్పోసల్ స్క్వాడ్ 'లో ఎంతోమంది నిపుణులు ఉన్నారు, వారు సత్వరమే యాక్షన్ లోకి దిగి బాంబుని నిర్వీర్యం చేసి, ఆ పసిపిల్లల ప్రాణాలు కాపాడుతారు, అలాగే తీవ్రవాదుల పన్నాగాలను క్షణం క్షణం గమనిస్తున్న 'ఇంటిలిజెన్స్ 'వారు కూడా అప్రమత్తంగా ఉండి, ముందస్తు సమాచారం రాగానే యాక్షన్ లోకి దిగారు. ఆ దేవదేవుడు మన భారతదేశాన్ని తీవ్రవాదులనుండి అనుక్షణం కాపాడుతాడు. దేశంలోని శాంతిభద్రతలు అనుక్షణం కాపాడుట కోసం పోలీసు వ్యవస్థ నిర్గరామంగా కృషి చేస్తుంది. జైహింద్. అన్న ప్రసంగాలు భారత ప్రజానీకానికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి.


అందరిలోకి సీనియర్ ఆఫీసర్' శ్రీకాంత్ గారు' బాంబు స్క్వాడ్ లో చాలా పేరున్న వ్యక్తి, ఎన్నో మార్లు మన దేశ సరిహద్దులలో' పాకిస్తానీ తీవ్రవాదులు' అమర్చిన ఎన్నో రకాల బాంబులను నిర్వీర్యం చేసి, అత్యున్నత పదవులో ఉన్నారు, ఆయన కూడా 'హోమ్ మినిస్టర్ ఆఫీస్ 'నుంచి ఫోన్ రాగానే తన అసిస్టెంట్ శ్రీధర్ నీ తీసుకుని, హుటాహుటిన సంఘటనా స్థలానికి బయలుదేరారు. శ్రీకాంత్, శ్రీధర్లు ఎన్నోసార్లు మన మిత్రు దేశాలన్నిటి లోనూ బాంబ్ స్క్వాడ్ వారికి ట్రైనింగ్ ఇస్తూ, ఏ రకమైన బాంబులు ఎలా నిర్వీర్యం చేయాలో? వారందరికీ నేర్పిస్తూ దేశ విదేశాలలో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.

సంఘటనా స్థలానికి 200 మీటర్ల దూరంలో జీపులో వచ్చిన, శ్రీకాంత్, శ్రీధర్ లకు ఫేస్ మాస్క్, గ్యాస్ సప్లై ఉన్న ట్యాంకులు, యూనిఫామ్ కి అతికించి ఉన్న చిన్న లెదర్ బ్యాగు, దానిలో బాంబు నిర్వీర్యం చేయడానికి కావలసిన పరికరాలు, ఎమర్జెన్సీ అయిడ్, సామాగ్రియంత నలుగురు అసిస్టెంట్లు ఆ ఇద్దరికీ అమర్చారు. ఒకవేళ బాంబు పేలితే, ఆ ఇద్దరికీ అపాయం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు, 'బాంబు స్క్వాడ్' 'అందరికీ బై చెప్తూ వారిద్దరూ బరువుగా ఉన్న తమ పరికరాలతో, ఒక్కొక్క అడుగు వేసుకుంటూ బాంబు కనిపెట్టడానికి ఆ స్థలానికి బయలుదేరారు.


బాంబు ని కనుక్కొనే యంత్రాలతో, అన్ని వైపుల నుంచి వెతుక్కుంటూ, సరిగ్గా ఆ పసి పిల్లలు ఉన్న స్థలానికి 50 మీటర్ల దూరంలో 'బీప్ సౌండ్లు' వినబడసాగాయి, l వెంటనే శ్రీకాంత్ గారు తన అసిస్టెంట్ శ్రీధర్ కు సైగలు చేస్తూ, ఆగమని చెప్పారు.


ఆ ఇన్ఫర్మేషన్ బాంబు కనుగొన్న సంగతులు 500 మీటర్ల దూరంలో ఉన్న 'మొబైల్ కంట్రోల్ రూమ్ కి' తెలియజేశారు శ్రీకాంత్ గారు, సార్! మేము సరిగ్గా పసిపిల్లలు ఉన్న స్థలానికి 50 మీటర్ల దూరంలో చాలా శక్తివంతమైన బాంబులు ఉన్నట్టు, మన యంత్రాలు తెలిపాయి, కావున నేను ఒక్కడినే ప్రొసీడ్ అవుతున్నాను, శ్రీధర్ అన్ని వైపుల నుండి ఆ స్కూలు పిల్లలను బాంబుకు దూరంగా తీసుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాను. మీరు 'లౌడ్ స్పీకర్లు' లో ఆ పిల్లలకు ధైర్యం చెప్పండి !ఉంటాను. అంటూ చెప్పేసరికి 'మొబైల్ బాంబ్స్క్వాడ్ వ్యాన్ ' ఎలర్ట్ అయింది.

'సీనియర్ బాంబ్స్క్వాడ్ ఆఫీసర్ శ్రీకాంత్ గారు 'తన మొక్కవోని ధైర్యంతో, అతి జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఆ బాంబులు కప్పబడి ఉన్న ప్రదేశానికి వచ్చి, ముందుగా భగవంతుని తలుచుకుని సరిగ్గా అక్కడ కప్పబడి ఉన్న ఇసుకను పైకి తీస్తూ, మూడు వైర్లు మూడు రకాల రంగులలోఉన్న స్థలాన్ని గుర్తించారు.


ఇంకొంచెం మట్టి తవ్వగా, ఒక 'డిజిటల్ మీటర్ రెడ్ లైట్ 'వెలుగుతూ అతి వేగంగా కౌంట్ డౌన్ చేస్తున్నాయి, శ్రీకాంత్ గారికి చెమటలు పట్టసాగాయి, అతి మెల్లగా ఇసుకను తవ్వి, ఒక స్టీల్ పెద్ద బేసిన్ సైజులో ఉన్న, శక్తివంతమైన బాంబులను ఎంతో జాగ్రత్తగా వైర్లు కదలకుండా, డిజిటల్ నెంబర్లు మారకుండా, అతి జాగ్రత్తగా పైన పెట్టారు.


ఎన్నో బాంబులను నిర్వీర్యం చేసిన శ్రీకాంత్ గారికి ఇది కొంచెం కొత్తగా కనిపించింది, అసిస్టెంట్ శ్రీధర్ వెంటనే అప్పుడే పిల్లల దగ్గరికి చేరుకొని, వారికి ధైర్యం చెబుతూ 'కదలకండి, కదలకండి !!ఇదిగో మీకోసం మంచి ప్రోటీన్, విటమిన్లు కలిగిన బిస్కెట్స్, చాక్లెట్స్ అన్ని తెచ్చాను, ఇవన్నీ తింటూ ఉండండి, మేము మిమ్మల్ని సురక్షితంగా మీ అమ్మానాన్నల దగ్గరికి తీసుకువెళ్తాము! అంటూ పిల్లల్ని ఓదారుస్తూ వారిచే తినిపిస్తున్నారు శ్రీధర్. ఇంతలో దూరంగా రమ్మని సైగ చేస్తున్న శ్రీకాంత్ గారిని చూసి పిల్లలకి ఇప్పుడే వస్తాను! అని చెప్పి వడివడిగా శ్రీకాంత్ గారి దగ్గరికి వచ్చాడు శ్రీధర్.

'బాంబు స్పెసిఫికేషన్స్' వాటి సైజు, డిజిటల్ మీటర్లు 10 నిమిషాల టైం చూపిస్తుండగా, ఆ విషయాన్ని కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి వివరాలు తెలిపారు శ్రీకాంత్ గారు. బాంబు స్క్వాడ్ వాన్ లో ఉన్న బాంబు నిపుణులు వాటిని కంప్యూటర్లో విశ్లేషణ చేస్తూ, " శ్రీకాంత్ గారు. ! ఈ బాంబు చాలా శక్తివంతమైనది, ఎంతో తెలివితేటలతో మన శత్రుదేశం అయిన పాకిస్తాన్, చైనా నుంచి దిగుమతి చేసుకున్నది. కనుక మీరు మీ అనుభవం ఉపయోగించి, వాటికున్న వైర్లను ఒక్కొక్కటిగా కట్ చేస్తూ ఉండండి. మేము ఢిల్లీ కి ఫోన్ చేసి హోమ్ డిపార్ట్మెంట్ తో మాట్లాడుతున్నాము. " అని చెప్పగానే వచ్చిన శ్రీధర్ను ఒక్కొక్క పరికరం బ్యాగులోంచి అందివ్వమని అడిగారు శ్రీకాంత్ గారు.


భారతదేశమంతా ఆ దృశ్యాలని 'లైవ్ టెలికాస్ట్' చేస్తుండగా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎలాగైనా ఆ బాంబు పేలకుండా ఉండాలని, ఆ పసి పిల్లలను కాపాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నారు.

శ్రీకాంత్ గారు ఫోన్లో మాట్లాడుతూ, సార్ !ఒకవేళ ఈ బాంబు పేలితే, కనీసం ఒక కిలోమీటర్ వరకు విధ్వంసం జరుగుతుంది, సో మీరు ప్రజలను అప్రమత్తం చేసి, అక్కడ ఉన్న ఆఫీసు బిల్డింగ్ లో స్టాఫ్ ని, మార్కెట్లను మూసివేసి బయటకు పంపించండి, ఇది నా చివరి ప్రార్థన. అని అనగానే పోలీస్ యంత్రాంగం మొత్తం 'ఢిల్లీ కన్నాట్ ప్లేసులో ఉన్న ఆఫీసులు, షాపులు ఒక కిలోమీటర్ వరకు అత్యంత వేగంగా ఖాళీ చేయించారు. ఇది భారతదేశంలోని అందులోనూ రాజధాని ఢిల్లీలో జరగటం వలన 'BBC, CNN, TV news live:' ప్రసారం చేస్తు, అన్ని దేశాలకు తెలియజేస్తున్నాయి.

తీవ్రవాదం నుంచి ఎలా బయటపడాలి? అన్న విశ్లేషణలతో, టీవీలు మారు మోగిపోతున్నాయి.

'బాంబ్ స్క్వాడ్ స్పెషలిస్ట్ శ్రీకాంత్ గారు' తన అనుభవాన్ని ఉపయోగించి, ఉన్న మూడు వైర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తే, అందులో ఆయనకు తెలియని విషయాలు బయట ఉన్న కంట్రోల్ రూమ్ కి తెలియజేస్తూ, సార్! ఈ బాంబు చాలా శక్తివంతమైనది ఇందులోని డిజిటల్ క్లాక్ కి మూడు వైర్లు బాంబు పెట్టిన బేసిన్ కి attach చేయబడ్డాయి. , మీతో మాట్లాడుతుండగానే డిజిటల్ క్లాక్ ఏడు నిమిషాలు చూపిస్తున్నది, , సత్వరమే ' ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగులో ఉన్న వైర్లలో ఏది కట్ చేస్తే ఏ ప్రమాదం వస్తుందో? ఎనలైజ్ చేయడానికి నాకు సమయం సరిపోదు, మీ విలువైన సలహాల కోసం ఎదురుచూస్తున్నాను, అని చెప్పగానే కంట్రోల్ రూమ్ అలెర్ట్ అయి దేశ విదేశాలలో ఉన్న అందరూ నిపుణులను 'హాట్ లైన్ లో' సంప్రదిస్తున్నారు.

అసలు ఈ బాంబు తయారీ' చైనాలో 'అవ్వగా ఇది అన్ని దేశాలకు పంపించడంతో, తీవ్రవాదుల చేతిలో పడింది, ముఖ్యంగా 'పాకిస్తాన్ ఏ ఘోరాలు చేయాలన్న ఈ బాంబులను వాడుతూ, , మనదేశంలో అనేకసార్లు విధ్వంసం సృష్టించింది.

ఎందుకంటే ప్రత్యేకమైన రీతిలో "అమోనియం నైట్రేట్, ' ఫ్యూయల్ ఆయిల్స్ మిక్స్రర్, " చేసిన తర్వాత ఎంతో శక్తివంతమైన బాంబుగా రూపొందుతుంది, దీనివల్ల పేలుడు పదార్థాలతో పాటు, విష వాయువులు కూడా గాలిలోకి వ్యాపించి, విధ్వంసం తీవ్రతరం చేస్తూ, అనేక వందల మంది నీ బలిగొంటుంది, ఈ బాంబు తీవ్రత అన్ని విధాల పరిశీలన చేస్తూ, ఉన్న కంట్రోల్ రూమ్ నుంచి, మిస్టర్ శ్రీకాంత్ !!డోంట్ వేస్ట్ టైం, మొదట శ్రీధర్ను పిల్లల దగ్గరికి వెళ్ళమని చెప్పండి, , ఆ తర్వాత మీ ఉద్దేశంలో, మీ అను భవం తో ఆకుపచ్చ వైరు నీ. కట్ చేయండి. అప్పుడు కూడా డిజిటల్ క్లాక్ రన్ అవుతూ, బాంబు పేలకుండా ఉంటే, మీ అసిస్టెంట్ శ్రీధర్ ని పిల్లల్ని తీసుకుని గ్రౌండ్ బయటకు వచ్చేయమనండి, అన్న మెసేజ్ రాగానే విపరీతంగా చెమటలు పడుతున్న శ్రీకాంత్ గారు శ్రీధర్ ను పిల్లల దగ్గరికి పంపించి, మొదట గ్రీన్ వైర్ కట్ చేశారు, దేవుడి దయవల్ల బాంబు అలాగే ఉంది, క్లాక్ మాత్రం నాలుగు నిమిషాలకు వచ్చేసింది.


వెంటనే శ్రీధర్ పిల్లల్ని తీసుకుని గ్రౌండ్ బయట ఉన్న 'పోలీస్ అంబులెన్స్ ''లోకి తీసుకువెళ్లి కూర్చోబెట్టి, వారికి బై చెప్పి తను శ్రీకాంత్ గారు ఉన్న చోటికి బయలుదేరాడు.


పిల్లలను సురక్షితంగా అంబులెన్స్ లోకి ఎక్కించి, పిల్లలు భయంతో బిగుసుకుపోయి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి, పిచ్చిపిచ్చిగా ఏడుస్తూ ఉండడంతో, వారు వెంటనే దగ్గరగానే ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకువెళ్లి "ప్రధమ చికిత్స చేయించారు.


వారు సురక్షితంగానే ఉన్నారు అన్న సమాచారం అన్ని టీవీ ఛానల్స్ దేశమంతా ప్రసారం చేయసాగాయి, , ప్రజలు కూడా ఎంతో సంతోషం ప్రకటిస్తూ, "బాంబు డిస్పోజల్ స్క్వాడ్ లోని శ్రీకాంత్ శ్రీధర్లు' కూడా సురక్షితంగా బయటికి రావాలని ప్రార్తిస్తున్నారు.

అసలు ఈ బాంబు 'పాకిస్తాన్లో అసెంబల్ చేశారు, అది కూడా చైనా వారి సాంకేతిక పరిజ్ఞానంతో' అన్నది నిపుణులు నిర్ధారించి, శ్రీకాంత్ గారికి తగిన సలహాలు నిర్వహిస్తూ, మిస్టర్ శ్రీకాంత్! మీరు ఒక వైర్ కట్ చేశారు, కానీ ఏమాత్రం ప్రమాదం జరగలేదు, కనుక పిల్లలు కూడా సురక్షితంగా ఉన్నారు, మీరు దేనికి కంగారు పడకుండా, మీ పనిలో నిమగ్నమై ఉండండి, శ్రీధర్ కూడా మీ దగ్గరికి వస్తున్నాడు, ఇద్దరు అతి జాగ్రత్తగా రెండవ వైర్ 'పసుపు రంగుని 'కట్ చేయండి! అన్న ఆర్డర్ రాగానే, శ్రీకాంత్ గారికి గుండెల్లో వణుకు ప్రారంభ మైంది, పోనీలే! పిల్లలు క్షేమంగా వారి తల్లిదండ్రుల దగ్గరకు చేరారు, అన్న ధైర్యంతో శ్రీకాంత్ గారు ఆ బాంబు ఉన్న ప్రదేశాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి, 'మిస్టర్ శ్రీధర్, !మీరు జాగ్రత్త, మీకు ఎంతో భవిష్యత్తు ఉంది, నాకు 20 ఏళ్ల సర్వీస్ కూడా అయిపోయింది, కనుక ఒకవేళ ఈ పసుపు రంగు వైర్ కట్ చేస్తున్నప్పుడు, బాంబు విస్పోటం జరిగితే నాతో పాటు మీరు కూడా మరణిస్తారు, కనుక 20 సెకండ్లలో మీరు 50 అడుగుల దూరంలో నిలబడండి, అందువల్ల ప్రమాద తీవ్రత తగ్గి మీరు బతికి పోతారు! అని అనగానే శ్రీధర్ కంగారుపడుతూ, అదేంటి సార్!!" విజయమో వీర స్వర్గమో" ఇద్దరం కలిసి అనుభవిద్దాం, ఒకవేళ విజయం చేకూరితే, 'భారత ప్రభుత్వం 'మనల్ని సన్మానిస్తుంది, లేదా మన' స్మారక చిహ్నాలు' 'ఇండియా గేట్ 'దగ్గర గర్వంగా నిలబడతాయి, అంటూ అక్కడే ఉండిపోయాడు శ్రీధర్.

'సీనియర్ బాంబు స్పెషలిస్ట్ శ్రీకాంత్ గారు 'ఒకే ఒక్క సంతానం రాఘవరావు, జానకమ్మ గారికి, ఎంతో ఉన్నత స్థాయిలో రిటైర్ అయి కన్న కొడుకు పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారు, కానీ శ్రీకాంత్ నాలుగేళ్లుగా తన కాలేజీలోనే పరిచయమైన' శశి' అనే అమ్మాయితో ప్రేమ కొనసాగిస్తూ, రెండు నెలల ముందే తన తల్లిదండ్రులను ఒప్పించి, శశి తల్లిదండ్రులను కూడా ఒప్పించి, ఇంకొక నెలలో వివాహం ఉందనగా, ఈ ఉపద్రవం ఏర్పడింది, శ్రీకాంత్ తన ఆలోచనలలో 'శశి నిండైన ముఖారవిందాన్ని, వారిద్దరూ కలిసిన ఎన్నో మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ, దేవుడి దయవల్ల ఈ ఉపద్రవం అదే ఈ బాంబు నిర్వీర్యం చేస్తే! ఎంతో ఘనంగా మేమిద్దరము కళ్యాణ వేదిక మీదకి రావచ్చు !అని తన మనసులోనే అనుకుంటూ చివరిసారిగా తన పర్స్ లో ఉన్న తల్లిదండ్రుల ఫోటోలను, తన కాబోయే భార్య శశి ఫోటోను ఒకసారి చూసుకుని ముద్దులు పెట్టుకుంటూ, తన పనిలో ఏకాగ్రత పెంపొందించుకున్నాడు శ్రీకాంత్.


శ్రీకాంత్ ఒక్క క్షణం తన' భారత దేశ పతాకాన్ని' గుర్తుచేసుకొని, " జైహింద్ !జైహింద్ "అంటూ అరుస్తూ, గుండె నిండా ధైర్యం నింపుకొని ఒక్కసారిగా చేతులు వణుకుతుండగా, రెండవ పసుపు వైర్ కట్ చేశాడు, అంతే ఒక్కసారిగా వెనక్కి ఇలా పడిపోయాడు, ఎంతో తెలియని నిస్సత్తువా, నీరసం వచ్చేసింది శ్రీకాంత్ గారికి, ఒళ్లంతా చెమటలు పట్టింది, రెండు నిమిషాల తర్వాత శ్రీధర్ కుదుపుతూ లేపే సరికి కళ్ళు తెరిచి చూసి, శ్రీధర్ ని కౌగిలించుకొని మనం బతికిపోయాము! ఇక మూడవ వైర్ కట్ చేయడానికి మనకి రెండు నిమిషములు టైం ఉంది !ఈ సమాచారం వెంటనే కంట్రోల్ రూమ్ కి తెలియజేయండి! అంటూ బ్యాగులో ఉన్న మంచి నీరు బాటిల్ తీసి గడగడా తాగి, మళ్లీ తన 'ఆర్మీ బాంబ్స్క్వాడ్ యూనిఫామ్' సర్దుకుని, తన చేతిని ఊపుతూ కంట్రోల్ రూమ్ కి సిగ్నల్ ఇచ్చాడు శ్రీకాంత్.


వెనువెంటనే 'ఆర్మీ కంట్రోల్ రూమ్ వారు "ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్ గార్లు"కలిసి ఉన్న ఆఫీస్ కి కాల్ చేసి, సార్! మన బాంబు స్క్వాడ్ శ్రీకాంత్ గారు రెండు వైర్లను కట్ చేశారు, ఏమీ కాలేదు, మూడవ వైర్ కట్ చేయడానికి మీ అనుమతి కోరుతున్నారు, దీనికి మీ పర్మిషన్ ఒక్క నిమిషంలో కావాలి. భారతదేశ భద్రతలు మీ చేతుల్లో ఉన్నాయి.


అని అనగానే ప్రధాని మంత్రి గారు, హాట్ లైన్ లో మాట్లాడుతూ''" all permissions are given, please proceed, and save the nation "'! అని అనగానే, కంట్రోల్ రూమ్ ఆదుర్దాగా 'మిస్టర్ శ్రీకాంత్! ప్లీజ్ ప్రొసీడ్, అండ్ సేవ్ ది నేషన్! అన్న మెసేజ్ స్వయంగా ప్రధానమంత్రి గారే ఇచ్చారు. మీ మొక్కవోని ధైర్యానికి భారతదేశ యావత్తు మీకు తోడు ఉంటుంది. అన్న జవాబు రాగానే, మరొకసారి డిజిటల్ క్లాక్ చూశాడు శ్రీకాంత్. ఇంకా 90 సెకండ్లు మాత్రమే ఉన్నది, శ్రీధర్ అన్నట్టు 'విజయమో వీర స్వర్గమో !'ఇప్పుడు తేలిపోతుంది. అని తనలోనే అనుకుంటూ ఒళ్లంతా కంపించిపోతుండగా, తన కటింగ్ ప్లేయర్ని' ఎర్ర వైర్ మీద ఆనించి' శ్రీధర్ కి బై చెప్తూ, డిజిటల్ క్లాకు సమయం, దగ్గర పడి పది సెకండ్ల లోపటికి వచ్చేసింది, 9, 8, 7, 6, 5, 4, 3, 2, ఈ కౌంట్ డౌన్ చేసుకుంటూ, ఒక్కసారి వైర్ కట్ చేసి వెల్లకిలా పడిపోయాడు శ్రీకాంత్ గారు.


బాంబు స్పెషలిస్ట్ శ్రీకాంత్ గారు, శ్రీధర్ గారు ఒక్కసారిగా తమ శరీరాలను భూమి కానించి, అచేతనంగా పడిపోయారు. ఆ క్షణంలో భారతదేశం అంతా' లైవ్ టెలికాస్ట్ 'చూస్తున్న సమయంలో అదృష్టవశాత్తు బాంబు పేలకొండ, డిజిటల్ క్లాక్ జీరో కొచ్చి ఆగిపోయింది. ఒక్కసారి తలెత్తి చూసిన శ్రీకాంత్, శ్రీధర్లు తమ ప్రాణాలు ఉన్నాయా? పోయాయా! అన్న సందిగ్ధంలో తలెత్తి చూశారు.


భారతదేశమంతా టీవీలోని ప్రతి సన్నివేశం నిశితంగా చూస్తూ, జై హింద్! జై హింద్! అరుస్తూ ఒక్కసారిగా ఆనందంతో గెంతులు వేస్తూ,

"భారత్ మాతాకీ జై భారత్ మాతాకీ జై "అంటూ ఒక్కసారిగా రోడ్ల మీదకు వచ్చి కరతాళ్ల ధ్వనులతో

తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.


వెనువెంటనే శ్రీధర్ లేచి పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీకాంత్ గారిని లేపబోయాడు, విపరీతమైన టెన్షన్తో దేశాన్ని కాపాడాలన్న సదుద్దేశంతో ఎంతో చాకచక్యంగా, తీవ్రవాదులు పెట్టిన బాంబు ని నిర్వీర్యం చేయడంలో'' 'హైపర్ టెన్షన్ కి 'గురై ఎంత పిలిచినా లేవలేక పోతుండడం చూసి, వెనువెంటనే కంట్రోల్ రూమ్ కి కాల్ చేసి, సార్ !శ్రీకాంత్ గారు స్పృహ తప్పి పడిపోయారు, వెంటనే రండి అంబులెన్స్ తీసుకుని, అన్న సమాచారం అందగానే మొత్తం పోలీస్ ఫోర్సు, అంబులెన్స్లు సైరన్ లు మోగుకుంటూ వచ్చి, అచేతనంగా పడి ఉన్న శ్రీకాంత్ గారిని సత్వరమే "ఆలిండియా మెడికల్ సైన్స్ (AIIMS) Safdarjung hospital "కి తీసుకువెళ్లి చికిత్స ప్రారంభించారు.


భారతదేశాన్ని ముష్కరుల బారి నుంచి, అతి శక్తివంతమైన బాంబు ని, నిర్వీర్యం చేయడంలో పదిమంది పసిపిల్లల ప్రాణాలు, ఒకవేళ పేలితే కొన్ని వందల మంది ప్రాణాలు కూడా గాలిలో కలవకుండా కాపాడిన శ్రీకాంత్ గారిని, శ్రీధర్ ని 'ప్రధానమంత్రి ' గారు ప్రశంసిస్తూ, శ్రీకాంత్ గారికి ఎంతో మెరుగైన వైద్యం, తక్షణం అందించాలని ఆదేశించారు.


కానీ ఎంతో పేరు పొందిన డాక్టర్లు కూడా అనేక విధాల పరీక్షలు చేసిన, శ్రీకాంత్ గారి శరీరం

స్పందించకపోవడం తో విదేశాల డాక్టర్లను కూడా సంప్రదించి చూశారు.

వారందరూ ఒకటే తేల్చారు. 'హైపర్ టెన్షన్ తో' బ్రెయిన్ డెడ్ అయి, కోమాలోకి వెళ్ళిపోయారు, శ్రీకాంత్ గారు, ఆయన కు ఎన్నో యంత్రాలు పెట్టి కోమాలోంచి బయటకు తీసుకు రావడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.


ఈ విషయం తెలిసిన 'యావత్ భారత దేశ ప్రజలు' కూడా, ఎంతో త్యాగం చేసిన శ్రీకాంత్ గారికి ఆయురారోగ్యాలు కలగాలని కనిపించిన ప్రతి దేవుడికి మొక్కుకుంటున్నారు.

శ్రీకాంత్ గారు కోమాలో ఉన్న, ఎప్పటికప్పుడు 'ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేస్తూ, అనుక్షణం డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. శ్రీకాంత్ గారు ఎంతో ప్రేమించిన తల్లిదండ్రులు, కాబోయే శ్రీమతి శశి కూడా ఆయన పక్కనే ఉండి సపర్యయాలు చేస్తున్నా, ఈ లోకంలోకి రాలేకపోతున్నారు శ్రీకాంత్ గారు. అలా 15 రోజులు పాటు ఆయన ప్రేమించిన ప్రియురాలు శశి అతని బెడ్ దగ్గరే కూర్చుని, నిశ్చలంగా పడి ఉన్న ప్రియుడు శ్రీకాంత్ గారి చేతిని రాస్తూ, వారిద్దరూ కలుసుకున్న క్షణాలు, చూసిన ప్రదేశాలు, వైవాహిక జీవితం ఎలా గడపాలి? అన్న ప్రణాళికలు అన్ని శశి ఆయన దగ్గర కూర్చొని శ్రీకాంత్ గారి చెవిలో చెబుతూనే ఉంది.


అనుకోకుండా శశి కన్నీరుమున్నీరవుతూ, అదేపనిగా శ్రీకాంత్ గారి గుండె మీద పడుకుని, ఆయన చేతులు రాస్తూ తమ ప్రేమ కథలు చెబుతూ ఉండగా, ఆ రోజు శ్రీకాంత్ గారి శరీరంలో చిన్న కదలిక కనిపించిన క్షణం ఆశ్చర్యానికి లోనైంది శశి. , వెంటనే ఆ సమాచారం డాక్టర్ల కు చెప్పగానే పరుగు పరుగున వచ్చి శశిని ప్రోత్సహిస్తూ, శ్రీకాంత్ గారి చెవిలో మాట్లాడమని చెప్పారు, శశి కూడా కన్నీళ్లు తుడుచుకుంటూ 'శ్రీకాంత్ శ్రీకాంత్'! అంటూ పది సార్లు పిలిచే సరికి, ఒక్కసారిగా శశి పట్టుకున్న చేయి బిగుసుకుంటూ కనిపించేసరికి, డాక్టర్లు కూడా ఆనందంతో కావలసిన ఇంజక్షన్లు మందులు సత్వరమే శ్రీకాంత్ గారి శరీరంలోకి పంపించారు. మరొకగా అరగంట లో భగవంతుడు ఇచ్చిన శక్తితో, మెల్లిగా కళ్ళు తెరిచారు శ్రీకాంత్ గారు.


తన దగ్గరే ఉన్న శశిని చూస్తూ, ఎంతో మెల్లిగా. శశి నువ్వు ఇక్కడ ?అని అడిగారు ఏం చేస్తున్నావు, ?నేనెక్కడ ఉన్నాను, అదేంటి అమ్మా, నాన్న !కూడా వచ్చారు అంటూ అందరినీ పలకరిస్తూ నవ్వుతూ, తన చుట్టూ ఉన్న పదిమంది డాక్టర్లకు నమస్కరిస్తూ, 'సార్ నాకు ఏమైంది! ఆ బాంబు పేల లేదు కదా!, ఆ పసి పిల్లలు వారి తల్లిదండ్రులకు చేరారా చెప్పండి ప్లీజ్, !! నా పక్కనే ఉన్న శ్రీధర్ ఏడి ?అన్న వరస ప్రశ్నలతో అక్కడే ఉన్న అందరిని ఆత్రుతగా అడిగారు శ్రీకాంత్ గారు.

శ్రీకాంత్ కోమాలోంచి బయటపడ్డారని, ఆరోగ్యంగా ఉన్నారన్న వార్త, ' ప్రధానమంత్రి 'గారి ఆఫీసుకు చేరి, అందరినీ ఆశ్చర్యపరిచింది.


'ప్రధానమంత్రి గారు 'హాట్ లైన్లో శ్రీకాంత్తో మాట్లాడుతూ, మిస్టర్ శ్రీకాంత్!, నిన్ను చూసి భారతదేశం మొత్తం గర్వపడుతుంది, నువ్వు చేసిన సాహసం వల్ల, ఎంతోమంది ప్రాణాలు దక్కించుకున్నారు, నువ్వు తీవ్రవాదులకు 'సింహస్వప్నమై 'ఎల్లప్పుడు భారతదేశాన్ని కాపాడుతావని ఆశిస్తున్నాను. అంటూ ప్రధానమంత్రి గారు మాట్లాడేసరికి, బెడ్ మీద లేచి కూర్చుని, ఆయనకు సగౌరవంగా సెల్యూట్ చేస్తూ ఉన్న దృశ్యాన్ని, టీవీ మాధ్యమాలు దేశ విదేశాలలో ప్రసారం చేశాయి.


ఆ మరుసటి నెల 'రిపబ్లిక్ డే :సందర్భంగా ఎంతో సాహసోపేతమైన, వీరోచితమైన సాహస కృత్యాలు చేసి, దేశాన్ని, ప్రజల్ని కాపాడిన శ్రీకాంత్ గారిని, శ్రీధర్ ని సగౌరవంగా సన్మానించి, పదవి ఉన్నతులు ఇచ్చి, శ్రీకాంత్ గారికి భారతదేశంలో ప్రతిష్టాకరమైన "gallantry award" 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా'. బహుకరించినప్పుడు, శ్రీకాంత్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, ఎంతో గర్వంగా తన తల్లిదండ్రులను పరిచయం చేసి, వివాహం చేసుకోబోయే శశిని కూడా స్టేజి మీద కి రప్పించి మాట్లాడుతూ,


నాకు ఇంత ఉన్నత స్థాయి అవార్డును ఇచ్చినందుకు, మన "భారత దేశ రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి" సర్వదా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ', పసిపిల్లల ప్రాణాల కోసం అహర్నిశలు దేవుని ప్రార్థించిన 'భారత దేశ ప్రజానీకానికి 'నేను నా కుటుంబం ఎంతో రుణపడి ఉన్నాము. మీ అందరికీ కృతజ్ఞతలు అంటూ నమస్కారం చేస్తూ నిలబడ్డ శ్రీకాంత్, శ్రీధర్ల కుటుంబాలని, టీవీ లైవ్ లో చూస్తున్న ప్రజానీకం కరతాళధ్వనులతో తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.

వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసంమాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.రచయిత పరిచయం :

నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

70 views0 comments

Comments


bottom of page