top of page
Original.png

విలువైన వాక్కులు

 #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #ViluvainaVakkulu, #విలువైనవాక్కులు, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 156

Viluvaina Vakkulu - Somanna Gari Kavithalu Part 156 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 22/12/2025

విలువైన వాక్కులు - సోమన్న గారి కవితలు పార్ట్ 156 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


విలువైన వాక్కులు

----------------------------

విలువ తెలిసిన వారితో

స్నేహాన్ని పెంచుకొనుము

ప్రేమలొలుకు మనసుతో

పేదలకు సాయపడుము


జ్ఞానమిచ్చు గురువులతో

మన జన్మ దాతలతో

మర్యాదగా నడుచుకొనుము

వయసులోన పెద్దలతో


శ్రేష్టమైన చేతలతో

స్వచ్ఛమైన తలపులతో

హుందాగా జీవించుము

ఘనులైన మిత్రులతో


పవిత్రమైన బుద్ధితో

చదువులోన శ్రద్ధతో

గొప్పగా రాణించుము

గగనమంత వృద్ధితో

ree







మనసు మాటల ముత్యాలు

-----------------------------

ఆత్మ విమర్శ చేసుకో

బ్రతుకులు సరిదిద్దుకో

ఉండొద్దు అధముల్లా

మారాలి ఉత్తముల్లా


మనసు కడిగివేసుకో

ముత్యములా మార్చుకో

దైవానికి అనువైన

మందిరంగా మలసుకో


శ్రమ తత్వము నమ్ముకో

విజయాలను అందుకో

దైనందిన జీవితాన

ఉండిపో శిఖరాగ్రాన


మంచితనం పెంచుకో

మమకారం పంచుకో

ఆకాశం సాక్షిగా

ఆదర్శం నింపుకో

ree
















తృప్తిలోనే స్వర్గము

----------------------------------------

పేదవాడికి సైతము

తృప్తి ఆనందము

తప్పక పంచుతుంది

అక్షరాల సత్యము


తృప్తి లేని జీవితము

పరికింప నరకము

కల్గియుంటే మాత్రము

స్వర్గంతో సమానము


ఉన్న దాంట్లో తృప్తి

పెంచును ఆహ్లాదము

సమకూర్చును బ్రతుకున

మిక్కిలి ఆరోగ్యము


తృప్తిగా బ్రతకాలి

మంచినే చేయాలి

పనికిరానివి వదిలి

గొప్పగా ఎదగాలి

ree







ముఖ్యమైనవి జీవితాన

-----------------------------------------

బ్రతుకులోన ఎదిగేందుకు

ఓపిక చాలా ముఖ్యము

గౌరవాన్ని పొందేందుకు

కారణమే సంస్కారము


చేటు చేటు వెటకారము

తెచ్చునోయి అవమానము

మేలు మేలు మానితే

జన క్షేమము కోరితే


చేయరాదు అపహాస్యము

ఆప్తులకు అన్యాయము

చూపాలి మానవత్వము

అందుంది దైవత్వము


మూఢ విశ్వాసాలకు

భువిని అపనమ్మకాలకు

అవకాశమివ్వరాదు

ఇల చాందస భావాలకు

ree








ఆత్మవిశ్వాసం అవసరం

-------------------------------------------

ఆత్మవిశ్వాసముంటే

ఏదైనా సాధ్యమే

చరిత్ర నెలకొల్పుడము

ఖచ్చితంగా సులభమే


గుండెనిండా ధైర్యమే

చేసేస్తే సాహసమే

గెలుపు పాదాక్రాంతమే

మనషి జన్మ సుఖాంతమే


ఆత్మస్థైర్యం కోల్పోకు

తాలిమిని వీడబోకు

ఫలితాలు వచ్చేవరకు

ఏ మాత్రం ఆగబోకు


మనసులోని పిరికితనము

విజయానికి అవరోధము

ఆరంభాన త్రుంచితే

ఎంతైనా క్షేమకరము

ree

గద్వాల సోమన్న







Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page