top of page
Original.png

విలువైన విషయాలు

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #విలువైనవిషయాలు, #ViluvainaVishayalu, #తెలుగుపచ్చడులు

గాయత్రి గారి కవితలు పార్ట్ 18

Viluvaina Vishayalu - Gayathri Gari Kavithalu Part 18 - New Telugu Poems Written By 

T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 08/05/2025

విలువైన విషయాలు - గాయత్రి గారి కవితలు పార్ట్ 18 - తెలుగు కవితలు

రచన: T. V. L. గాయత్రి


విలువైన విషయాలు

(కవిత)


******************************

కాలుష్యరహితమౌ కాలమే వస్తుంది

వీలుగా మనకింత పెన్నిధిని తెస్తుంది


మన్నులో పుట్టాము మన్నులో పెరిగాము

మన్నులో నుందిలే మాహాత్మ్యమన్నాము 


వసుధ మనకిడును సౌభాగ్యసిరిసంపదలు

మిసిమితో వెలుగొందు మేదినీ దీపికలు


కన్నభూమి పదములు కైమోడ్చి మ్రొక్కెదము

దన్నుగా నిలుచుండి దాస్యమును చేసెదము


తెలిసికొను జనులెల్ల తెలివితో మెలిగారు

విలువైన విషయాలు విశదీకరించారు


ప్రాత పద్ధతులెపుడు ప్రగతి నందించులే

జాతినే నడిపించి జ్ఞానంబు నొసగులే


అవ్వతాతల బాట యాదర్శ మౌతుంది

ఆ దూరదృష్టి మనకాలంబనౌతుంది


నేర్చుకుందాములే నేర్పుతో చదువులను

తీర్చుకుందాములే ధిషణతో కోరికలు.//


************************************

తెలుగు పచ్చడులు

(తేటగీతి పద్యములు)














భాష లందున మనమాతృ భాష ఘనము 

ఫలము లందున మామిడి ఫలము లెస్స 

మంచి మాగాయ పచ్చడిన్ మహిళ లెల్ల

పెట్టుచుందురు వేసవి వేళలందు.


ఆవకాయ, మాగాయల నాదరించు

తెలుగు వారి కీర్తి చెలగి దిశల వెలిగె

కమ్మ నైనట్టి రుచులతో కలిమినొంది

నాంధ్రదేశము వర్థిల్లె నవని యందు.


ముక్క కొట్టించి మురియుచు ముదిత లెల్ల

పచ్చడులన్ జేసి తృప్తిగా బంచుకొనుచు

ప్రాత పద్ధతుల్ విడువక జాతియందు

నిలుపు కొనుచుండ్రి ఖ్యాతిని నేటివరకు.


పసిడి నగలన్ జీరలన్ బచ్చడులను

పొలుపు మీరగ ప్రేమించి పొంగిపోయి

గడుపు చుందురీ తెలుగింటి కాంతలెపుడు

వారి శ్రద్ధకు లోకంబు భళిభళియను.


సంప్రదాయపు రుచులను సమధికముగ

వండి వడ్డించి కాంతలు వైభవముగ

తరతరంబులు నిల్పుచు చరితకెక్క

వారి శ్రమ కీయవలయును వందనములు.//


*******************************

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page