విరబోత
- Penumaka Vasantha
- Jan 18
- 2 min read
#పెనుమాకవసంత, #PenumakaVasantha, #Virabotha, #విరబోత, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Virabotha - New Telugu Story Written By - Penumaka Vasantha
Published In manatelugukathalu.com On 18/01/2025
విరబోత - తెలుగు కథ
రచన, కథా పఠనం: పెనుమాక వసంత
ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన రమేష్ భార్య నాగినిని చూసి "యేంటే అలా జుట్టు విరబోసుకున్నావు" అన్నాడు.
"చూడపోతే తంతా సీరియలులో నా హీరోయిన్ తన పగ చల్లారే దాకా జుట్టు కట్టుకోనని.. విరబోసుకుంటానని శపధం చేసింది. తనకు సపోర్టుగా నేను ఇవాళ్టి నుండి జుట్టు ముడి పెట్టను. నేనే కాదు, మన వీధిలోని ఆడవాళ్ళమందరం ఇదే చేస్తున్నాము" అంది నాగిని.
“అసలు, ఈ టివినీ బయట పారేస్తే పోతుంది. దానిలోని, మంచివి ఏ భక్తి టివి కాసేపు చూడాలి, లేదా సినిమాలు చూడాలి కాలక్షేపానికి. అంతేకానీ, ఇలా సీరియల్స్ చూసి ప్రతిజ్ఞలు చేయకూడదు నాగు”.
“ఏంటి, టివి బయట పడేస్తారా.. ! పడేయండి, చూద్దాము, నేను మీరు తాగొస్తే ఏనాడైనా.. గొడవ చేసానా? సరే మీరు తాగుడు, మానండి. నేను సీరియల్స్ మానుతాను” అంది నాగిని తన తెలివితేటలకు మురుసుకుంటూ.
“నేను ఎపుడో వారానికి ఒకసారి తాగేదానికి, గొడవ చేయకు నాగు”.
తనమాట వినకుండా సీరియల్ లో మునిగి ఉన్న భార్యను చూస్తూ.. “అదికాదు నాగు.. అమ్మాయికి
జడలు వేయకుండా పంపావు స్కూలుకు. వాళ్ళు డైరీలో ‘రేపు జడలు వేయకపోతే.. పనిష్మెంట్ వుంటుం’దని రాసారు.
“అమ్మా! జడ వేయి. ఇవాళ క్లాస్ టీచర్ వేసారు. రేపు వేయకపోతే పనిష్మెంట్” అన్న కూతురిని “నేను జుట్టు ముట్టుకోను బంగారు.. నాన్న వేస్తారు లె” అంది.
'వామ్మో చచ్చాను. దీనికి ఎలాగోలా నచ్చచెప్పాలి’ అనుకుని రమేష్ "నాగు.. చాగంటి గారు ఏమి చెప్పారు? జుట్టు విరబోసుకుంటే దరిద్రం అన్నారు. అపుడు సీత, ద్రౌపది లు జుట్టు విరబోసుకుని ఉంటే ఎంత అరిష్టం జరిగింది చెప్పారు కదా. అలాంటివి మంచివి ఏవి చూడవు. హీరోయిన్స్, సీరియల్లోనే జుట్టు విరబోసుకునేది. ఇంటి దగ్గర క్లిప్పులు పెడతారు. అసలే నీది పెద్ద జుట్టు, ఇల్లంతా జుట్టు రాలితే నేను బుట్ట పట్టుకుని వెంట్రుకలు ఏరాలి. మన వీధిలో వాళ్ళకు నీకున్నంత జుట్టు లేదే? నీ జుట్టు చూసే నిన్ను పెళ్ళిచేసుకున్నాను.
ఇప్పటికే నీ జుట్టు రాలుకు- ఎంటికలకు ప్లాస్టిక్ సామాను ఇస్తాననే అమ్మాయి ఎపుడూ మన ఇంటి చుట్టూనే తిరుగుతుంది. ఇంకోపక్క సవరాలు కట్టె అబ్బాయి నీ జుట్టు చూస్తూ సవరాలు కడతామని
తిరుగుతున్నాడు. ఇపుడు నీ శపథం సంగతి తెలిస్తే.. వాళ్ళు పండగ చేసుకుంటారు.
అయినా ఇంకా నీ సీరియల్ ఒక పదేళ్ళు నడుస్తుంది. అప్పటి దాకా జుట్టు విరబోసుకునే ఉంటావా. నువ్వు ఇలా విరబోసుకుంటే.. అసలు బాగాలేవు. పూలు తెచ్చాను, జడేసుకుని, తల్లో పెట్టుకో.. !
ఇంకా నయం నీ హీరోయిన్ పగ చల్లారే వరకు చీర కట్టనని శపధం చేయలా? నువ్వు ఆమెకు సపోర్టుగా చీర కట్టనంటే.. ! మన వీధిలో కర్ఫ్యూ పెట్టాల్సి వచ్చేది. బతికాను" నవ్వుతూ అన్నాడు రమేష్.
రేపటి భాగంలో హీరోయిన్, పగ క్లైమాక్ కొస్తుంది. విరబోసుకుని వుండేది, లేనిది తెలుస్తుంది రేపు. అపుడు చెప్తాను, నేను జుట్టు ఉంచేది, లేనిది.. ! అప్పటివరకు, సశేషం, " పూలు, పక్క పిన్ తో గుచ్చి తల్లో పెట్టుకోబోతు అంది నాగిని.
"ఆ కంపలో పూలు ఎందుకు? అయితే, ఇటివ్వు.. ! వాటిని దేవుళ్ళకైనా వేస్తా”నని కోపంగా
పూలదండ లాక్కున్నాడు జుట్టు చర్చలు ఫలించనందుకు రమేష్ కోపంగా.
సమాప్తం
పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పెనుమాక వసంత గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.
Dr Indira Priyadarsini A
•6 hours ago
Bhale vundi vasantha garu😂
విరబోత: పి. వసంత
టి.వి. సీరియల్స్ (ధారావాహికలు) మరియు అడ్వర్టైజ్మెంట్ లను చూసి ... చాల మంది అమాయకంగా నమ్మెస్తారు.
ఇది కేవలం కల్పితం, వినోదం కొరకు మాత్రమే అని చూపించాలి.
అవును, బార్బీ డాల్ బాపెడ్ జుట్టు తో ప్రపంచమంతా పాపులర్ - ప్రజాదరణ పొందింది కదా??? పి.వి.పద్మావతి మధు నివ్రితి