విశ్రాంత జీవితం
- Chilakamarri Satyanarayana
- 3 days ago
- 1 min read
#ChilakamarriSatyanarayana, #చిలకమర్రిసత్యనారాయణ, #విశ్రాంతజీవితం, #VisranthaJeevitham, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Visrantha Jeevitham - New Telugu Poem Written By Chilakamarri Satyanarayana
Published In manatelugukathalu.com On 05/07/2025
విశ్రాంత జీవితం - తెలుగు కవిత
రచన: చిలకమర్రి సత్యనారాయణ
విశ్రాంత జీవితం
ప్రశాంతంగా గడపడం!
భద్రంగా సురక్షితంగా
వృధ్ధాప్యాన్ని వెళ్ళబుచ్చడం!
మేము వయోవృద్ధులం !
మధుమేహ బాధితులం!
పింఛనే మాకు ఆధారం!
రక్తపోటు మాకు సహజం!
గతకాలపు వైభవాలను
పునశ్చరణ చేస్తాం!
వర్తమానపు పోకడలను
ఎండగడుతూనే ఉంటాం!
హోదాలను మరిచిపోము
మాజీలమైనా!
బంధాలను తెంచుకోమ్
వెలివేసినా!
దగ్గులో వినిపిస్తుంది
తగ్గిన మా గుండెచప్పుడు!
నడకలో కనిపిస్తుంది
మందగించిన మా అడుగు!
ఎవరి మాట వినం
ఎవరినీ ఏపనీ చేయనివ్వం!
ప్రతిపనిలో వంకపెడతాం
చేసేవాడిని నిందిస్తూనే ఉంటాం!
మేము వయోవృద్ధులం !
తరాల మధ్య వారధులం!
చిలకమర్రి సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: చిలకమర్రి సత్యనారాయణ
తెలుగు భాష అంటె ఎంతొ మక్కువ..ఆదిలొ నాకవితలు వ్యాసాలు అంధ్రజ్యొతి అంధ్ర పత్రిక ప్రచురించి ఎంతగానొ ప్రొత్సహించాయి. ఉద్యొగరీత్య సిండికేటుబ్యాంక్ లో అధికారిగ పదవి, అనెక ప్రదేశాలను వ్యక్తులను పరిచయంచెసింది. ప్రస్తుతం న్యాయవాది వృత్తిలో ఉంటూ భిన్న సమస్యలతొ సతమతమయ్యె వ్యక్తులకు సహయం చెయ్యాలని ఆకాంక్ష.
వర్తమానంలో జరిగే సంఘటనలకు స్పందించడం అలవాటు.చాలా సందేహాలకు భగవద్గీత సమాధానమని నా నమ్మకం.
చిన్నారి మనవడు అరుష్ తొ కాలక్షేపం. కుటుంబం ప్రశాంతంగా ఉంటే జీవితం ఆనందంగా ఉంటుందని నమ్ముతాను.
తిరిగి నేను రచయితగా మారడానికి అన్నయ్య కృష్ణమాచార్యులు ప్రొత్సహం అయితె తెలుగుకథలు మాధ్యమం కావడం నా అదృష్టం.
Declaration బాగుంది