top of page

వ్యాసభగవానుడు

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #వ్యాసభగవానుడు, #Vyasabhagavanudu

ree

Vyasabhagavanudu- New Telugu Poems Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 11/07/2025

వ్యాసభగవానుడు - తెలుగు కవితలు

రచన: T. V. L. గాయత్రి


వ్యాసభగవానుడు

(ఇష్టపది)

**********************************


వశిష్టుని వంశజుడు పరమాత్మ రూపుండు 

భాసురంబుగ నాడు వసుధపై జనియించె


వేదములఁ శ్రద్ధతో విభజించి వివరించె

వేదార్థ సంహితలఁ విబుధుడై రచియించె


పారమార్థిక తత్త్వఫలము లందించగా

సారతగల పురాణ జ్ఞానమును బోధించె


భారతంబను కౌరవాన్వయచరితమునే

సారమతిగా నుడివి జాతికై నందించె


గురువుగా శిష్యులకు గూఢమగు యోగములఁ

నిరవుగా నేర్పించి నీ భువిని చరియించె


కృష్ణద్వైపాయనుని కీర్తి శాశ్వతముగా

విష్ణుపథమును దాటి వినువీధిఁ దీపించె


ఆ వ్యాసభగవాను డత్యంత మేధావి

దివ్యాత్ము డై నిల్వ దేశంబు తరియించె


గురువ్యాసునిని తల్చి గుణశీలులై జనులు

వరలగా దైవంబు వరములను గుప్పించు.//


ree

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page