top of page

వాట్ ఏ వండర్

#SudhavishwamAkondi, #WhatAWonder, #వాట్ఏవండర్, #సుధావిశ్వంఆకొండి, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు, #కొసమెరుపు

ree

What A Wonder - New Telugu Story Written By Sudhavishwam Akondi

Published In manatelugukathalu.com On 16/05/2025 

వాట్ ఏ వండర్ - తెలుగు కథ

రచన: సుధావిశ్వం ఆకొండి


మెసెంజర్ లో ఒక ఇద్దరి ఆడవాళ్ళ సంభాషణ:


"హలో సరళ గారూ! 

వంటా-తంటా గ్రూప్ లో మీరు చాలా వెరైటీ పోస్టులు పెడుతుంటారు. చేసేటప్పుడు ఎలా తంటాలు పడతామో భలే చెప్తారు. ఐ లైక్ ఇట్." 


"థాంక్యూ.. మీరూ అంతేగా తార గారూ! మీ పోస్టులు కూడా బావుంటాయి. కొత్త ప్రయోగాలతో చిత్ర విచిత్రమైన వంటలు పెడతారు. వాట్ ఎ వండర్."


"మీరు ప్రతిదానికి వాట్ ఎ వండర్ అంటుంటారు మా ఫ్రెండ్ ఒకమ్మాయి లా. ఇంతకీ మీరెక్కడ చదివారు?


" వనిత కాలేజీ అండి. మీరూ? ఇంతకీ మీ ఫ్రెండ్ పేరు ఏంటి?"


" నేనూ అదే కాలేజీ. 2005 బ్యాచ్. మా ఫ్రెండ్ పేరు కుమారి అండి"


" వావ్.. వాట్ ఎ వండర్.అయితే నేనే ఆ సరళ కుమారి ని. అయితే మీ పేరు తార? ఆ పేరు తో ఫ్రెండ్స్ ఎవరున్నారబ్బా?


" నేను సితార. పెళ్లయ్యాక ఆయన తారా అనే పిలుస్తుంటే అదే ఫిక్స్ అయిపోయా.. ఎంతో ఆనందంగా ఉంది ఇప్పుడు. నిజంగా విచిత్రంగా ఉంది కదా మనం కాలేజీ ఫ్రెండ్స్ మి ఇలా కలవడం. ఇంతకూ మీరు ఎక్కుడుంటున్నారు?


" వావ్... వాట్ ఎ వండర్. నువ్వు సితార వా? నాక్కూడా చాలా హ్యాపీగా ఉంది. మనం ఒకసారి కలుద్దాం. మేము హైదరాబాద్ లో ఉంటున్నాం."


" ఓ గుడ్. మేమూ అక్కడే. ఏ ఏరియాలో మీరుండేది"


" వావ్.. వాట్ ఎ వండర్! 

జూబ్లీహిల్స్ లో. మీరూ?"


" మేము కూడా అక్కడే. ఎక్కడ ల్యాండ్ మార్క్ చెప్పు"


"వావ్.. వాట్ ఎ వండర్! అదే స్టేట్ బ్యాంక్ ఎటిఎం పక్కన 'ఆదిత్య హిల్స్' అపార్ట్ మెంట్."


"వావ్.. వాట్ ఎ వండర్! 

మాది కూడా అదే అపార్ట్మెంట్. ఫ్లాట్ నెంబర్ ఎంత?"


"అవునా! ఫ్లాట్ నెంబర్ 401 నే"


" వాట్ ఎ వండర్! మాది మీ పక్క ఫ్లాట్ నే అయితే 402"


అప్పుడు తలుపులు తెరిచి ఒకళ్లను ఒకళ్ళు కలుసుకున్నారు.


  నేటి పరిస్థితి అలా ఉంది ఒకరిని 

ఒకరు పట్టించుకోకుండా టీవీ, ఇంటర్నెట్ వల్ల సెల్ ఫోన్ వినియోగం ఎక్కువ అయిపోయి అనుబంధాలు, ఆప్యాయతలు తరిగిపోయి మనుషుల మధ్య దూరాలు పెరిగిపోతున్నాయి. ప్రకృతి రమణీయత ఆస్వాదన లేకుండా పోయింది. 


  అందుకే ఏది ఎంతవరకు వినియోగించుకోవాలో అంతే వినియోగించుకోవాలి. తగుమాత్రం వినియోగం ఉంటేనే ఉపయోగం, లేదంటే అపకారమే మరి.


సుధావిశ్వం


మీరేమంటారు?


ఈ కథ చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయగలరని ఆశిస్తాను.



ree

-సుధావిశ్వం





Comments


bottom of page