top of page
Original_edited.jpg

ఈ హృదయం సాక్షిగా..

  • Writer: Gorrepati Sreenu
    Gorrepati Sreenu
  • Aug 31
  • 2 min read

#YeeHrudayamSakshiga, #ఈహృదయంసాక్షిగా, #GorrepatiSreenu, #గొర్రెపాటిశ్రీను, #TeluguKavithalu, #TeluguPoems

ree

Yee Hrudayam Sakshiga - New Telugu Poem Written By - Gorrepati Sreenu

Published In manatelugukathalu.com On 31/08/2025

ఈ హృదయం సాక్షిగా..తెలుగు కవిత

రచన: గొర్రెపాటి శ్రీను


ఒంటరినై

మేడపై నిల్చుని

ఆకాశం వైపు చూస్తున్నాను !

మురిపెంగా చిరునవ్వులు చిందిస్తూ

ఆనందంగా సువిశాల గగన సీమలో విహరిస్తున్న

జాబిలమ్మ లో నీ చిద్విలాసాన్ని గమనిస్తున్నాను !

చుట్టూ పరచుకున్న మల్లెల పందిరిపై నుండి వీస్తున్న

పరిమళలెన్నో నన్ను అల్లేస్తూ అల్లరి చేస్తుంటే

నీతో గడిపిన సుమధుర జ్ఞాపకాలు

హృదయాన్ని సుతారంగా తాకుతుంటే

తన్మయంగా నా నెచ్చిలివైన నీ సౌందర్యాన్ని

మల్లెలతో రూపుదిద్దుకున్న చోట సంబరంగా వీక్షిస్తున్నాను !

పగలంతా పనిలో ఉంటే అలసట ఎరుగనివ్వని అనుబంధం నువ్వు !

అనురాగం గా అభిమానం గా పలకరించే ఆత్మీయం నువ్వు !

ఏనాడైనా ఓటమి ఎదురై చిన్నబుచ్చుకుంటున్నవేళ.. 

రేపటి విజేత అవుతావు అంటూ ప్రేరణ అందించే సన్మార్గగామి నువ్వు! 

ఆనందాలు అతిశయాలు

అచ్చెరుపొందే సమ్మోహనం సుమనోహరం నీ రూపం.. ! 

చీకట్ల జాడలు మాయం చేసే

వెన్నెల వెలుగుల చిరుదరహాసాల అభి నాయిక నువ్వు !

నువ్వు తోడై ఉన్న జీవితం సదా స్ఫూర్తివంతం.. 

నువ్వు తోడై ఉన్న బతుకు పయనం అర్థవంతం !


***

గొర్రెపాటి శ్రీను గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

ree

రచయిత పరిచయం:

 గొర్రెపాటి శ్రీను కలం పేరుతో రచనలు చేస్తున్న నా పూర్తి పేరు నాగ మోహన్ కుమార్ శర్మ .

తల్లిదండ్రులు : శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు

ఉద్యోగం : ప్రైవేటు కంపెనీలో మేనేజర్.

చదువు : డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్)

వెలువరించిన పుస్తకాలు:

"వెన్నెల కిరణాలు" కవితా సంపుటి(2019),

"ప్రియ సమీరాలు"కథాసంపుటి(2023),

"ప్రణయ దృశ్య కావ్యం" కథాసంపుటి(2025).

ప్రస్తుత నివాసం: హైదరాబాద్.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page