top of page

యోగా ప్రయోజనాలు

#YogaPrayojanalu, #యోగాప్రయోజనాలు, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #TeluguArticleOnYoga

21 జూన్, అంతర్జాతీయ యోగా దినోత్సవం


Yoga Prayojanalu - New Telugu Article Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 22/06/2025

యోగా ప్రయోజనాలు - తెలుగు వ్యాసం

రచన: కందర్ప మూర్తి


ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం 21 జూన్ 2015 భారతదేశంలో ప్రధాని నరేంద్రమోదీ న్యూఢిల్లీలోని రాజ్ పథ్ లో 84 దేశాల నుంచి వచ్చిన నేతలు, ప్రజాప్రతినిధులతో పాటు మొత్తం 35, 985 మంది హాజరై యోగాసనాలు వేసి గిన్నీస్ రికార్డులు నెలకొల్పారు. 

అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జూన్ 21 భారతదేశంలోని నగరాలు, ప్రపంచ నగరాల్లో యోగా కార్యక్రమాలు అభ్యాసం చేస్తున్నారు. 


యోగ అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని, శ్వాస వ్యాయామాలతో కూడుకుని, మనుషులలో ఉన్నటువంటి ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి, వారిని నిరాశ, నిస్పృహల నుండి బయటకు తీసుకురావడానికి ఉపయోగపడుతుందనీ యోగాగురువులు చెబుతున్నారు. యోగాసనాలు శరీరానికి ధృడత్వాన్ని, శక్తిని ఇస్తాయని అంటున్నారు. అందుకే పెద్దవారైనా, చిన్నవారైనా, ధృడంగా ఉన్నవారైనా, లేనివారైనా ఆసనాలు వేయడానికి ఇష్టపడతారు. సాధనచేస్తున్న కొద్ది ఆసనాల వెనకాల ఉన్న అంతరార్ధం బాగా అవగాహనకు వస్తుందని వారు అంటున్నారు. 


యోగా ఒక వ్యాయామం. నడక, ఈత కొట్టడం, పరుగు ఇవన్నీ వ్యాయామం కిందకే వస్తాయి. యోగాసనాలకు ఆద్యుడు పతంజలి. యోగాసనాలు సూర్యనమస్కారాల వంటివి అనేకం. రామ్ దేవ్ బాబా వంటి అనేకమంది యోగా గురువులు వాటిని ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. యోగాసనాలు గురువుల ఆధ్వర్యంలో నేర్చుకుని అభ్యాసం చెయ్యాలి. 


 పాత తరంలో మనుషులు దినమంతా ఏదో ఒక పనితో శరీరక శ్రమ ఎక్కువగా చేసేవారు. అటువంటి వారికి ప్రత్యేకంగా ఎటువంటి వ్యాయామాలు అవసరం లేదు. 


ఆధునిక యుగంలో మనుషులు చేసే పనులను యంత్రాలు చేస్తున్నాయి. టెక్నాలజీ పెరిగి మనిషికి శరీర శ్రమ తగ్గడమే కాకుండా ఆహారపు అలవాట్లలో మార్పులు, మానసిక వత్తిడి వల్ల తరచు అనారోగ్యాలకు గురవుతున్నారు. 


శరీర వ్యాయామం లేనందున, సమయపాలన లేని భోజనం, జీర్ణ వ్యవస్థలో లోపాల కారణంగా చిన్న వయసులోనే ఊబకాయం సమస్యలతో సతమతమవుతున్నారు. 


యోగా ప్రయోజనాలు:


శారీరక ఆరోగ్యంతో సహా మానసిక ఆరోగ్యానికి యోగా అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గించడంలో, నిద్రను మెరుగుపరచడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుంది. 

యోగా మీ శారీరక నొప్పిని తగ్గించడంలో, మొత్తం చలనశీలతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 

 యోగా రక్త ప్రసరణను మెరుగుపరచడం, అలసటను తగ్గించడం ద్వారా శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. 


యోగా కేలరీలను బర్న్ చేస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఆందోళన, నిరాశ, ఒత్తిడిని తగ్గించడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో యోగా సహాయపడుతుంది.


యోగా కండరాలను బలోపేతం చేయడంలో సహాయ పడుతుంది. కోర్ కండరాలతో సహా, ఇది శరీర భంగిమ, సమతుల్యతను మెరుగుపరుస్తుంది. మనస్సు, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచడం ద్వారా ఒత్తిడిని తగ్గించడంలో యోగా సహాయపడుతుంది. యోగా వల్ల శరీరం, మనస్సు ప్రశాంతంగా ఉండి సుఖ నిద్ర వస్తుంది. 


సమాప్తం


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


Comentarios


bottom of page