top of page

యుగానికి ఆది యుగాది


'Uganiki Adi Ugadi' New Telugu article

Written By Ayyala Somayajula Subrahmanyam

'యుగానికి ఆది యుగాది'

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)


కాలమనేది మహా సాగరం.దాని పొడవు, వెడల్పు, లోతుల కొలతలు తెలుసుకోవ

డానికి వీలుగాని అనంతసాగరం.ప్రతీ వ్యక్తి కాలప్రవాహంలో తేలుతున్నా అది

ఎప్పుడు ఆరంభమైనది అనేది ఎవరికీ అందని విషయం.ప్రవాహ సదృశంగా సాగి

పోయే అనంత కాలం యొక్క పరిమితిని తెలుసుకోవడానికి యుగాలు,మనవంత

రాలు, ఋతువులు , సంవత్సరాలు , పక్షాలు,దినాలు, గంటలు, నిమిషాలు.......

వున్నాయి. అందుకేనేమో విష్ణుసహస్ర నామావళి లో భగవంతుణ్ణి 'యుగానికృత్‌'

అని సంభోదించారు.అంటే కాల విశేషమునకు కర్త లేదా యుగాలను ఆరంభించే

వాడు అని అర్థం.


ఉగాది ఎలా వచ్చింది?

ఆ యుగాది నుండి వచ్చినదే ఉగాది.అసలు యుగమనే పదాన్ని కాలానికి కొల

మానం గానే గాక ద్వయం లేక జంట అనే అర్థం లో కూడా వాడతారు.ఉత్తరా

యణం , దక్షిణాయణం అనే రెండు ఆయనాలతో కూడిన సంవత్సరం యుగం.

ఆ యుగాన్ని ప్రారంభించే రోజు కనక ఇది ఉగాది.


" ఉగస్య ఆదిః ఉగాది" - అయ్యిందంటారు.

పౌరాణిక గాధల్లో ఉగాది.


చతుర్వర్గ చింతామణి అనే వ్రతఖండంలో ఉగాదికి సంబంధించిన బ్రహ్మ

వృత్తాతంలో ఈ విధమగా చెప్పబడింది.శుద్దపాడ్యమి నాటి అరుణోదయ వేళ బ్రహ్మ ఈ జగత్తును సృష్టించాడు.సృష్టి ప్రారంభం కాబట్టి యుగపండుగకు సంబం

ధించినదిగా ఉగాది అని పిలుస్తున్నారు.

తెలుగువారి పండుగ యుగానికి తెలుగురూపం ఉగాది. ఇది మన తెలుగు వారికి ముఖ్యమైన పండుగ.

సంప్రదాయ సారంగా శకసంవత్సరానికి ప్రామాణికంగా తీసుకుని చాంద్రమానాన్ని

అనుసరించి జరుగుతుంది. ఈ విధంగా చైత్రమాస ఆరంభాన్ని తెలుగు సంవత్స

రాదిగా జరుపుకుంటున్నాము.


ఉగాది రోజున ప్రతీఇంటికి మామిడితోరణాలు కట్టాలని , ద్వజారోహణం చెయ్యాలని

వేపపువ్వు తినాలని , పంచాంగశ్రవణం చేయాలని ఉగాది నుండి శ్రీరామనవమి

వరకు జరిగే వసంత(శ్రీరామ) నవరాత్రులు శ్రీరామనవమి వరకు ప్రారంభించాలని

చెబుతారు.

పులకరించిన ప్రకృతి శోభ

ఆ ఋతువు పేరే వసంతఋతువు.ఈ వసంతఋతువులో మోడుబారిన చెట్లన్నీ

పచ్చదనపు చిగుళ్ళతో ఎన్నో రకాల పూల సందళ్ళతో ఘుమఘుమలతో , మొగ్గలతో

పిందెలతో, మధురమైన పళ్ళరుచులతో , పరిమళభరితమైన మల్లెపూలతో కోయిల

కుహుకుహూరాగాలతో,పక్షుల కిలకిలరావాలతో వసంతఋుతువు కనువిందు

చేస్తుంది.

ఉగాది పండుగ రోజున ఆనందంగా గడిపితే ఆ సంవత్సరం కాలమంతా సుఖ

సంతోషాలతో గడపగలమని ప్రజల నమ్మకం.

ఉగాది పచ్చడి ప్రాముఖ్యత

నిజానికి ఉగాది పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది వేపపువ్వుపచ్చడి.షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని భగవంతునికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని ఇంటిలోని వారంతా స్వీకరిస్తారు. ఈ ప్రసాదం వేపపువ్వు, కొత్తబెల్లం, కొత్తచింతపండు, మామిడి కాయముక్కలు, మిరియాలు, చెఱుకు ముక్కలు వేసి చేస్తారు.


ఉగాది పచ్చడి తినడంలో కూడా ఎన్నో అర్దలు ఇమిడి ఉన్నాయి.కొత్తసంవత్సరంలో

అనుభవించబోయే శీతోష్ణ సుఖదుఃఖాలను తెలియజేస్తుంది.


శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో చెప్పినట్లు " సుఖదుఃఖే సమేకృత్వాలాభా

లాభౌః తుల్యా నిందా స్తుతార్మౌని....." ఈ పచ్చడిని సంకేతంగా అభివర్ణిస్తారు.

వీటిని సమదృష్టితో చూడాలని చెప్పడమే.


అంతేగాక ఆ యా ఋతువులలో వచ్చే ఊష్ణం, శీతలం ...అనుభవించబోయే

వాటిని ఉగాది పచ్చడి రూపంలో స్వీకరించి చవి చూడమని అర్థం.ఈ ఉగాది పచ్చడికి ఔషదగుణాలు కూడా కలవు.దీనిని సేవించడము వలన అనేక దీర్ఘకాలిక వ్యాదులు శాంతిస్తాయని మనిషికి అన్నివిధాల ఆరోగ్యాన్నిస్తాయి.


వేపపువ్వు క్రిమి సంహారిణి, శరీరానికి , ఆరోగ్యానికి దోహదకారి.బెల్లం జీర్ణశక్తిని పెంపొందించి శరీరీనికి చల్లదనాన్ని కలగజేస్తుంది.బెల్లం లో ఐరన్‌, మెగ్నీషియం, కాల్షియం లు కూడా కలవు.

ఆధునిక వైద్యశాస్త్రం కూడా విటమిన్లు, ఖనిజాలు, లవణాల్లాంచి పోషకాల తూకాన్ని బట్టి ఆహారద్రవ్యాల పోషకవిలువలను లెక్కగడుతుంది.ఈ ఆరు రుచుల సిద్దాంతాన్ని అనుసరించి ఆయుర్వేదం ( భైషజ్యరత్నావళి) తీపి, పులుపు, వగరు, చేదు, కారం, ఉప్పు .ఈ ఆరు రుచులు ఉంటేనే అది పోషకఆహారమవుతుందని చెబుతుంది.


మనం భోజనంలో ఈ ఆరు రుచులు ఉండేలా చూసుకుంటే అది షడ్రషోప్తమైన భోజనం.' పులిహోర నే తీసుకోండి. అందులో కేవలం పులుపు, ఉప్పు, కారం మాత్రమే కలిపితే అది ఆరేగ్యానికి చేటు చేస్తుంది. వగరు, చేదు రుచుల కోసం కొద్దిగా ఆవపిండిని, మెంతిపిండిని కలిపితే రుచి పెరగడమే కాకుండా ఆరోగ్యానిచ్చేదిగా ఉంటుంది. బెల్లము కూడా కొంచెం కలుపుకుంటే మంచిది. భోజనములో ఆరురుచులు కలిపి తీసుకుంటేనే శరీరానికి కావలసిన విటమిన్లు, లవణాలు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయని మనకు ' ఉగాదిపచ్చడి' భోదిస్తుంది. ఆరు రుచుల మిశ్రమము కలిసినట్లే మన జీవిత సోపానపు మెట్లు వుంటాయి.


పంచాంగశ్రవణం.

తిథి, వారము, నక్షత్రము,యోగం, కరణము .ఈ ఐదింటిని కలిపి పంచాంగం అంటారు.భవిష్యత్‌ కాలమాన పరిస్థితులు, ఎదురయ్యేశుభాలు,కష్టనష్టాలు,మంచిచెడులు, పండితులు పంచాంగ శ్రవణం ద్వారా మనకు వివరిస్తారు. పాలనాపరమైన విషయాలు, ధరలలోని మార్పులు, ఏ వ్యక్తికి సంవత్సరమున ఎట్టి లాభనష్టములు సంభవిస్తాయో అనే వివరాలు, వర్షాలు, ఎండలు వాతావరణ విశేషాలు , రాజకీయాలలోని మార్పులు మొదలైన విశయాలను దేశకాలానుకులంగా తెలుసుకుంటారు.


ఈ "శోభకృత్‌" వికారాలు, కటికచీకటి లాంటి ఆయు విపత్తులను తొలగించి అందరికీ సద్గుణాలను, మంచి ఆయురారోగ్యాలని ప్రసాదించాలని కాలరూప భగవానుణ్ణి ప్రార్దిద్దాం.

-----------------------------శుభంభూయాత్‌----------------------------

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.





71 views1 comment
bottom of page