top of page
Original.png

అందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు


80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతదేశ సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వం, ప్రకృతి మరియు ఆధునిక అభివృద్ధిని ప్రతిబింబించే త్రివర్ణ పతాక దృశ్యం

Andhariki Enabaiava Swathanthrya Dinosthava Subhakanshalu - New Telugu Article Written By Sudhavishwam Akondi

అందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు - తెలుగు వ్యాసం

రచన: సుధావిశ్వం ఆకొండి

Published in manatelugukathalu.com on 15/08/2026


భారతదేశంలో జన్మించడం ఒక గొప్ప అదృష్టమని, ఈ పుణ్యభూమి ఆధ్యాత్మికత, సంస్కృతి, జ్ఞానం, మహనీయుల త్యాగాలకు నిలయమని సుధావిశ్వం తన 80వ స్వాతంత్ర్య దినోత్సవ సందేశంలో గుర్తుచేస్తున్నారు. ఎన్నో యుగాలుగా యోగులు, మహర్షులు, మహాత్ములు, సిద్ధ పురుషులు నడయాడిన భారతభూమి వారసులుగా మన బాధ్యత మరింత గొప్పదని ఆయన పేర్కొంటున్నారు.


స్వాతంత్ర్యం అంటే కేవలం ఒక చారిత్రక విజయాన్ని గుర్తుచేసుకోవడం మాత్రమే కాదు; మన దేశ సంస్కృతి, విలువలు, ప్రకృతి, సామాజిక ఐక్యతను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు మరింత గొప్ప భారతదేశాన్ని అందించడం కూడా. శాస్త్రీయ అభివృద్ధిని స్వాగతిస్తూ, పరస్పరం ద్వేషం, ఉద్రిక్తతలకు దూరంగా విలువలతో కూడిన క్రమబద్ధమైన జీవితం గడపాలని ఈ సందేశం పిలుపునిస్తోంది.

“సర్వేజనా సుఖినోభవంతు” అనే భారతీయ ఆలోచనతో అందరి సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ, దేశభక్తి, సంస్కృతి, ప్రకృతి పరిరక్షణ, మానవీయ విలువలను సమన్వయం చేసుకుని ముందుకు సాగుదామని ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సుధావిశ్వం సందేశం అందిస్తోంది.



Message: Wish you all 80th Happy Independence day 💐💐💐💐

Feeling great and proud being an Indian. Blessed to be born in India. Be an Indian in India or anywhere in the world..


అందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 💐💐💐💐💐..

ఈ భరతదేశంలో పుట్టడం పూర్వజన్మ సుకృతం. ఎంతోమంది యోగులు, మహాత్ములు, గొప్ప భాగవతోత్తములు, మహర్షులు, సిద్ధ పురుషులు జన్మించిన పుణ్యభూమి. వారు నడయాడిన ఈ గడ్డపైన జన్మించడం, ఇక్కడే జీవించడం గొప్ప అదృష్టం!


సాక్షాత్తుగా ఆ పరబ్రహ్మ, పరమాత్మ, ఆ మాధవుడు అవతరించి ఈ భూమండలాన్ని రక్షించింది, భరతభూమిని పావనం చేసిన ఈ ప్రాంతంలోనే మనం ఉండడం జన్మ చరితార్థం చేసుకోవడానికి లభించిన గొప్ప అవకాశం!


ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని ఈ మొత్తం భూమండలాన్ని పరిపాలించిన షట్చక్రవర్తులను కన్నతల్లి మన భరతమాత! కలిపురుషుని భయపెట్టిన నలచక్రవర్తి పాలించింది ఇక్కడే!


ఇంకా ఇలా చెబుతూ పోతే ఎన్నో ఎన్నెన్నో... ఈ గొప్ప సంస్కృతికి వారసులమైన మనం ఈ విషయాలు గుర్తుపెట్టుకుని వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా ముందుకు వేసుకుంటూ, శాస్త్రీయ అభివృద్ధిని భగవంతుడు ప్రసాదించిన వరంగా భావిస్తూ,

ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉద్రిక్తతను సృష్టించకుండా, విలువలతో కూడిన క్రమబద్ధమైన జీవితాన్ని గడిపితే అప్పుడు మన ఈ భరతమాత సంతోషిస్తుంది.


ప్రకృతిమాత కరుణిస్తుంది. మళ్లీ పూర్వ వైభవం వస్తుంది...


సర్వేజనా సుఖినోభవంతు! జై భారత్! శ్రీకృష్ణ శరణం మమ 🙏🙏🙏🙏🙏




సుధావిశ్వం ఆకొండి

-సుధావిశ్వం






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page