top of page

అభిమానులు - రాజకీయం

#AAnnapurna, #అన్నపూర్ణవ్యాసాలు, #AbhimanuluRajakeeyam, #అభిమానులురాజకీయం,

ree

అభిమానులను రాజకీయాలకు వాడుకుంటున్న నటులు!

Abhimanulu Rajakeeyam - New Telugu Article Written By A. Annapurna

Published in manatelugukathalu.com on 03/10/2025

అభిమానులు - రాజకీయం - తెలుగు వ్యాసం

రచన: ఏ. అన్నపూర్ణ

(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)


సినీ క్రీడా రంగాలలో హీరోలు రిటైర్ అయ్యాక రాజకీయ వ్యాపారం చేస్తూ, అభిమానుల బలహీనతను, వారి స్వార్ధానికి వాడుకుంటున్నారు. ఈ అభిమానులు ఎవరు? నిరుద్యోగులు, విద్యార్థులు, హైస్కూల్ డ్రాప్ అవుట్ అయినవారు. 


ఒకప్పుడు ప్రజలకు సినిమాలు ఒక్కటే వినోదం పంచె సాధనం. రానురాను టెక్నాలజి పెరిగింది. టీవీలు స్మార్ట్ ఫోనులు వీడియొ గేమ్స్ మ్యూజిక్ షోలు, రకరకాల ఆకర్షణలు యువతకు అందుబాటులోకి వచ్చాయి. 


సినీహీరోలు స్పోర్ట్స్ హీరోలు కొంతకాలమే వెలుగుతారు. ఆ తర్వాత స్వంత వ్యాపారాలు నడుపుకోవడం, రాజకీయాల్లో ప్రవేశించడం జరుగుతోంది. రాజకీయ పార్టీ పెట్టి, అభిమానులను కూడగట్టుకుంటారు. 


రోడ్డు షోలు ఎదో వంకతో ర్యాలీలు చేస్తారు. ముందుగా ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, x వంటి మాధ్యమాల్లో ‘ప్రజాసేవ చేస్తాం.. మీ సేవచేసి మా సినిమాలు విజయవంతం చేసినందుకు మీరుణం తీర్చుకుంటాం.’ అంటూ పలకరింపులు మొదలుపెట్టి కమ్మని కబుర్లు చెబుతారు. 


స్టిల్స్ ఏవేవో యాంగిల్స్లో పెట్టి వెర్రి ఎక్కిస్తారు. నాకే పర్సొనల్గా పంపాడా హీరో అనుకుని ఆనందంతో మురిసిపోయే అభిమానులు గర్వముగా ఫీల్ అవుతూ మరి కొంత మందిని కూడగడతారు. 


నిజానికి ఈ తతంగం అంతా చేసేది డూప్ పరివారం. ఇలా మీడియాకి ఒకరు, మరొకరు సమాచారం అందచేస్తారు తప్పితే హీరోలు ఎవరూ రంగంలోకి రారు. పిచ్చి అభిమానులు భ్రమల్లో వుంటారు. 


ఈ అభిమానులు ర్యాలీలకు సినీ ఉత్శవాలకు రిలీజ్ ఫంక్షన్స్ కి మరోటి.. అంటూ ఆ నటులమీద వల్లమాలిన ప్రేమతో అమాయకంగా ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ హీరోలు ఎవరైనా బయటకువస్తే ఏమిజరుగుతుందో ప్రభుత్వానికి తెలుసు. ప్రజలకు అనుభవమే. 


అయినా రాజకీయం రాజకీయమే. ప్రమాదాలు ప్రమాదాలే. ఒక్క సినిమా వారనేకాదు ఆధ్యాత్మికత భక్తి, పండుగలు అమ్మవారి జాతరలు అంటూ తొక్కిసలాటలు జరగడం దెబ్బలు తినడం ప్రాణాలు పోగొట్టుకోవడం.. ఒక పద్ధతి లేదు. ప్రదర్శన, ఆర్భాటం, వృథాఖర్చు, వాతావరణ కాలుష్యం తప్ప. భక్తి - అభిమానం ఏది ఐనా ఇంటికి పరిమితం అయితే ఈ దారుణాలు జరగవు. 


కోవిద్ మహమ్మారితో యువత ఎందరో అకాల మరణం పాలయ్యారు. వృద్ధుల జీవన పరిమాణం పెరిగింది. 


యువత వారి మనుగడ కాపాడుకోవాలి. చదువులో పోటీ పడలేక ఇష్టం లేని చదువు చదవలేక ఇంటి పరిస్థితుల కారణంగా ఎందరో ఆత్మా హత్యలు చేసుకోడమూ చూస్తున్నాం. ఇలా కృంగుబాటుకు గురి అవుతూ ఉంటే దేశాభివృద్ధికి అవరోధం ఏర్పడుతుంది. 


దేనికైనా ఒక హద్దులోవుండాలి. హీరోలకు నువ్వుపోతే ఇంకోడు వస్తారు. నీ తల్లి తండ్రులకు మాత్రం తీరని లోటు కలుగుతోంది. బలహీనతకు లోనుకావద్దు. బాగుపడే మంచిమార్గం చూసుకోవాలి. జీవితాన్ని భద్రంగా కాపాడుకోవాలి. 

*******************


ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ


నాగురించి పరిచయం. 

నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లుగారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంధకర్త. ''వారురాసిన మహర్హుల చరిత్ర'' టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. దానిమీద నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథవారి ''ఏకవీర '', శరత్ బాబు, ప్రేమ్ చంద్, తిలక్, భారతీ మాసపత్రిక. నాన్నగారు రాసిన వ్యాసాలూ ప్రింట్ అయినా తెలుగు -ఇంగిలీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్నా ;;ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ'' కి వచ్చే పిల్లల పత్రికలూ, వారం మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటు అయింది. పెళ్లి అయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. 


చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపుల తో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చారు. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమసంస్థ లో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను.. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే

వెళ్ళివస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, సాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనేవున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలి అనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్ట్లలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.

(writing for development, progress, uplift)

ree

Comments


bottom of page