top of page

యాక్సిడెంట్'Accident' - New Telugu Story Written By Pitta Gopi

Published In manatelugukathalu.com On 30/01/2024

'యాక్సిడెంట్' తెలుగు కథ

రచన: పిట్ట గోపి


ఎక్కడ చూసినా.. రోడ్డు ప్రమాదాలు, 

ఎక్కడ చూసినా.. మరణ మ్రుదంగాలు, 

ఎక్కడ చూసినా.. అహకారాలు, అర్తనాదలు, 

ఎక్కడ చూసినా.. రక్తపు రహదారులు. 


ఇది ప్రపంచ నలుమూలల కనిపిస్తున్న భయానక దృశ్యాలు. 


ఈ భయానక దృశ్యాల్లో తప్పు ఎవరిదైనా.. ఇరువురూ భాదితులే, ఇరువురూ ఆసుపత్రి పాలవ్వల్సిందే. 


తొందరగా వెళ్ళాలనే ఆత్రత కొందరిది, తాగి వెళ్ళాలనే అతి విశ్వాసం మరికొందరిది, సరిగ్గా డ్రైవింగ్ రాకున్నా దర్జాగా పోయేవారు కొందరు, వాహనం బాగా నడపగలననే ఓవర్ కాన్ఫిడెన్స్ మరికొందరిది, నిభందనలు గాలికొదిలేసి ఇష్టానుసారం పోయేవారు కొందరు.. ఇలా చెప్పుకుంటుపోతే రోడ్డు ప్రమాదాలకు అందరూ కారకులే. అయితే..  ఏ తప్పు చేయకుండా నిభందనలు పాటిస్తూ వెళ్తున్నా కూడా అవతలి వారి తప్పు వలన ఆసుపత్రి పాలౌతున్నావారు తక్కువేం కాదు. 


పోలీసులు, ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఎన్ని జరిమానాలు వేస్తున్నా జనాల తీరు మారదు. అమాయకుల ప్రాణాలు బలికాకుండా ఆగదు. 


ప్రమాదాలను ఎవరు, ఎప్పుడు.. ఊహించలేము కాబట్టి కనీసం..  రక్షణ కవచాలు అయినా ధరించండని ఎంత మొత్తుకున్నా వినే నాథుడు లేడు. తద్వారా రోడ్డు ప్రమాదాల బారిన పడుతూ తమ కుటుంబాలను కన్నీటి సంద్రంలోకి నెట్టేస్తున్నారు. 


ఇక పండగ సమయాలు అయితే ఇంకేం చూడవసరం లేదు. బలివ్వటానికి కత్తిని సిద్ధం చేసినట్లు రహదారులు సిద్దంగా ఉండగా.. మీరు సిద్దమయితే మేము సిద్దమే అన్నట్లు కుర్రకారు పొగరుబోతు చర్యలు ఉంటున్నాయి. 


ఆ విధంగానే న్యూయిర్ వేడుకల్లో అర్దరాత్రి వరకు తప్పతాగి కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు ఒక కారులో బయలుదేరారు. కారులో కూడా మద్యం సేవిస్తున్నారు. డ్రైవింగ్ చేసేవాడు కూడా తాగుతూనే డ్రైవ్ చేస్తున్నాడు. ఆ కారు, వారి వాలకం, కారులో విచ్చలవిడిగా ఉన్న మద్యం సీసాలు, అర్దరాత్రి దాటాకా పోలీసులు విధించిన అంక్షలు లెక్కచేయకుండా అతివేగంతో అంత ధైర్యంగా వెళ్తున్నారంటే.. ! వాళ్ళకు ఖచ్చితంగా పై నుండి అండదండలు ఉండే ఉంటాయి. అలాంటి వారికి ఏదైనా ప్రమాదం జరుగుతుంది అనే ఇంగిత జ్ణానం కూడా ఉండదు. తమ వలన ఇంకొకరికి ప్రమాదం జరుగుతుంది అనే జ్ణానం అసలే ఉండదు. 


అంత వేగంగా వెళ్తున్న కారుకు మరో కారు జతయింది. ఆ కారులో కేవలం ఒకే ఒక్క యువకుడు ఉండగా వాడు కూడా మద్యం సేవిస్తున్నాడు. 


అతడు ఆ కారుని అనుకరిస్తూ.. ఆ కారులో ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా అతడిని అనుసరిస్తుండగా.. అతడు ఫోన్ నంబర్ అడిగాడు. అందుకు ఆమె సిద్దమవుతుండగా పక్కనే ఉన్న యువకుడు అభ్యంతరం చెప్పి కారుని మరింత వేగంగా పోనిచ్చాడు. సింగిల్ గా ఉన్న ఆ యువకుడు కూడా అంతే వేగంతో తన కారుని పోనిచ్చాడు. అలా ఆ రెండు కార్లు ప్లే ఓవర్ దాటుకుని దాదాపు పది కిలోమీటర్లు ప్రయాణించి నాలుగు రోడ్డు జంక్షన్ వద్దకు చేరుకోబోతున్నాయి. 


అక్కడకు అర్ధరాత్రి వరకు మధ్యం దుకాణంలో పని చేసి ఓనర్ డబ్బులు ఇవ్వటం కొంచెం ఆలస్యం చేయటంతో దాదాపు ఒంటిగంట సమయంలో సైకిల్ పై తన ఇంటికి వెళ్తు అటువైపు వస్తున్న గణేష్ అనే పేద వ్యక్తిని మొదటి కారు డీ కొట్టి ఆగిపోయింది. ఆ ఆగిపోయిన కారుని తప్పించబోయి సింగిల్ యువకుడు కారు కూడా బోల్తా కొట్టింది. 


అర్ధరాత్రి కావటంతో ఈ ప్రమాదం ఎవరు చూడలేదు. అందువలన క్షతగాత్రులను ఆసుపత్రికి సకాలంలో తీసుకెళ్ళేవాడు లేకపోవడంతో గణేష్ పరిస్థితి కాస్త విషమంగా ఉంది. మిగిలిన వారి పరిస్థితి మాత్రం బాగుంది. 


 అసలు గణేష్ ఏనాడూ మద్యం దుకాణంలో పని చేయలేదు. అతడు చాలా పేదవాడు. చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ సామాన్లు సేకరించుకుని వాటిని అమ్మగా వచ్చే డబ్బుతో కుటుంబంను పోషిస్తున్నాడు. న్యూఇయర్ కారణంగా అర్ధరాత్రి వరకు పనిచేసే వారికి డిమాండ్ పెరగటంతో అతడు ఒక మద్యం దుకాణం యజమానితో బేరం కుదుర్చుకుని అక్కడ పని చేయల్సి రావటం ఇలా యాక్సిడెంట్ కి గురి కావటం జరిగిపోయాయి. 


రోడ్డు ప్రమాదాల విషయంలో అక్కడ మనం మంచిగా వెలితే సరిపోదు అవతలి వాళ్ళు కూడా మంచోలై మంచిగా వెళ్తు ఉండాలి లేకపోతే గణేష్ పరిస్థితే అందరిదిను. 


యాక్సిడెంట్ చేసిన వారి నుండి గణేష్ కి రూపాయి కూడా సహాయం అందలేదు. 


అతడి పరిస్థితి, అతడి నేపథ్యం తెలుసుకుని పోలీసులు కొంత సహాయం అందేటట్లు చేశారు. అయితే గణేష్ ఏడాది పాటు మంచానికే పరిమితం అవ్వల్సి వచ్చింది. తర్వాత పోలీసులు ఆ రెండు కార్లలో ప్రయాణించి యాక్సిడెంట్ చేసిన వారందరి పై యాక్సెస్ తీసుకున్నారు. 


ఎందుకంటే.. !

ఇక్కడ వాళ్ళు యాక్సిడెంట్ చేసింది కేవలం గణేష్ ని మాత్రమే కాదు. , గణేష్ సంపాదనపై ఆదారపడి బతుకుతున్న అతడి కుటుంబంను కూడా. 


అలాగే ప్రతి యాక్సిడెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే కాదు. వారి పై ఆదారపడుతు బతుకుతున్న ఆయా కుటుంబాలకు కూడాను. అవును నిజమే ప్రపంచంలో ఏ యాక్సిడెంట్ అయినా.. అసలు తప్పు ఉన్నోడైనా, లేనోడైనా ప్రమాదం జరిగి మంచానికే పరిమితం అయితే తమ కుటుంబం కూడా రోడ్డున పడినట్లే కదా.. ?

అందుకే రోడ్లని రక్తసిక్తం చేయకుండా, మనసుని మద్యం మయం చేయకుండా మనం కానీ, మన వలన ఇంకొకరు కానీ ప్రమాదబారీన పడకుండా నిధానంగా వెలదాం. అక్కడ మన కుటుంబం మన రాకకోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటుంది. 


చెమట చిందించకుండా వాహనాన్ని నడుపగలరు కానీ రక్తంతో రహదారులు తడపకుండా ఎందుకు నడపరు.. 

పుట్టుకకు ఒక అర్థం తెలిసినవాడు ప్రాణాలు అంత తేలిగ్గా పోగొట్టుకోడు. 


 ***** ***** ***** ***** 


పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )

Profile:

Youtube Playlist:

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం


31 views0 comments
bottom of page