top of page

ఆడపిల్ల'Adapilla' - New Telugu Story Written By Pitta Gopi

Published In manatelugukathalu.com On 17/02/2024

'ఆడపిల్ల' తెలుగు కథ

రచన: పిట్ట గోపి


స్వాతంత్య్రం రాకముందు ఆడపిల్ల వంటింటికే పరిమితం కావాలనే సంప్రదాయం అయితే ఉండేది కానీ.. ! పుట్టుక విషయంలో ఆడ-మగ తేడ ఉండేది కాదు. ఎవరు పుట్టిన భావోద్వేగాలు ఒకేలా ఉండేవి. ఇప్పుడు పూర్తి భిన్నం. ఆడపిల్ల అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికి, ఆడపిల్ల పుడితే బెంబేలెత్తుతున్నారు. 


మధ్యతరగతి కుటుంబానికి చెందిన పరమేశుకి ఆడపిల్ల అంటే మహా ఇష్టం. తొలి కాన్పులో కొడుకు పుట్టడంతో అతడి కోరిక నెరవేరలేదు. ఎంతో దుఃఖించాడు. శివ అనే పేరు పెట్టాడు. రెండో కాన్పులో అతడి కోరిక నెరవేరింది. 

చక్కగా పార్వతి అనే పేరు నామకరణం చేశాడు పరమేశు. అదేంటో కానీ పార్వతి పుట్టిన తర్వాత పరమేశు మనసు, ఇల్లు తళతళా మెరిసిపోతున్నాయి. అవును. వంద మగపిల్లలు ఉన్న ఒక ఇంటికి అందం ఉండదు కానీ.. ఒక్క ఆడపిల్ల ఉంటే ఆ ఇంటికి కోటి కాంతుల వెలుగు ఉంటుంది కదా... 


పరమేశు కొడుకు కంటే కూతురికే ఎక్కువ ప్రేమనిచ్చేవాడు. ఏ తండ్రి అయినా అంతే కదా.. అలా అని కొడుకుని నిర్లక్ష్యం చేయడు. ఇద్దరిని బాగా చూసుకుంటాడు. ఇద్దరు పిల్లలు పెద్ద అవుతున్న కొలది పరమేశు పని బారం పెరుగుతుంది. పార్వతి నడక నేర్చుకున్నాక పరమేశు హృదయం బరువు తగ్గింది. నిజమే కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చాక నాన్న అని పరిగెత్తుకుని వచ్చి తండ్రి ఎదలో వాలితే ఆ తండ్రి కష్టం మటుమాయపోదా... ? ఆ ఆడపిల్ల తనకు ఏది కావాలంటే అది కొనితెచ్చి పెట్టే నాన్నను గుండెల్లో పెట్టుకోదా... ? ప్రేమ,మమకారం, ఆప్యాయతానురాగాలు పంచాలంటే పుట్టుకతో ఏ ఆడపిల్లకు రావు కదా.. ! అవి తల్లి, తండ్రి నేర్పించిన విద్యే. 


 పార్వతీని అందరి పిల్లల వలె బడికి పంపాడు పరమేశు. తాను చక్కగా చదువుతుంది. ఏ ఇంట్లో అయినా మగ పిల్లలు చదివితే ఆ ఇల్లు బాగుపడుతుంది అని మగ పిల్లల చదువు పై ఆశ పెట్టుకుంటారు. వారికంటే ఆడపిల్ల బాగా చదువుతుందని మాత్రం ఎవరికి తెలియదు. తెలిసినా... పెళ్ళి వయసు వరకే ఈ మద్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆడపిల్ల చదువు. 


ఇంట్లో ఆడుతూ, పాడుతూ సందడి చేసిన ఆ ఆడపిల్ల ఇప్పుడు మద్య వయసుకి వచ్చింది. అంటే పుష్పవతి అయ్యింది. ఏ తండ్రైనా.. కొడుకు గూర్చి ఆలోచిస్తు కూతురుపై ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. ఒక్కసారి కొడుకుని మందలిస్తు, కోప్పడుతు ఉంటాడు. ఎందుకంటే.. ! తన తర్వాత కొడుకే కుటుంబ బాధ్యతలు మోయల్సి ఉంటుంది కనుక. అదే కూతురుపై ఎనలేని ప్రేమ చూపిస్తాడు. ఎందుకంటే అత్తింట్లో ప్రేమనే పంచాలి కనుక. 


బందుమిత్రులకు భోజనాలకు పిలిచి మంచి ఏర్పాట్లు చేశాడు. వాటిని వర్ణించి చెప్పలేం కదా.. ! ఒక మద్యతరగతి భోజనాలకు వెళ్ళి భోజన ఏర్పాట్లు బాలేదని అనలేం. ఎందుకంటే.. ! ఆ భోజన ఏర్పాట్లు వెనుక కష్టం సుఖం చెప్పుకోలేని ఒక మద్యతరగతి తండ్రి కష్టం దాగి ఉంది కనుక. పార్వతి వచ్చి పరమేశుని హత్తుకుని తండ్రి ఒడిలో చిన్న పిల్లలానే కూర్చుంది. ఆ సమయంలో కుటుంబం, బరువు, బాధ్యతలు,ఆలోచనలు, ఆవేదనలతో సతమతమయ్యే ఆ తండ్రి మనసు పులకించిపోయింది. తన కష్టాన్ని, మరచిపోయాడు. 


అవును మరి అంతటి శక్తి ఆడపిల్లకు ఉంది. ఆంతేనా.. !అన్నతో సరదాగా గొడవ పడుతు ఆడపిల్ల చేసే అల్లరి కష్టాలతో నడుస్తున్న ఏ మద్యతరగతి కుటుంబానికైనా ఉపసమనమే. 


అందరిలాగనే పార్వతి చదువు ముగించి ఇంటివద్దే తల్లిదండ్రులుకు సహయంగా అన్ని పనులు నేర్చుకుంటు కాలాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అన్న కూడా చదువుతు మరోవైపు తండ్రికి సహాయంగా ఉంటు చెల్లెలిని కన్నీరు పెట్టించకుండా చూసుకునేవాడు. 


అలా కాలం వేగంగా ముందుకు వెళ్ళింది. పార్వతి అత్తింటికి వెళ్ళే సమయాన్ని తీసుకువచ్చింది. తనను అడిగేందుకు వరుడు సహా వారి బందువులు వచ్చారు. తనకు మనసులో ఎవరూ లేరు. కానీ.. !తనకు బాగా చదువుకుని తల్లిదండ్రులు కష్టం తీర్చాలనే ఆశ ఉన్నా... ఇన్నాళ్లు కష్టపడి,ప్రేమగా చూసుకున్న తండ్రి ప్రేమ కంటే తన కోరికలు గొప్పవేం కాదని పార్వతి ఆత్మ తనకు తాను చెప్పుకుంది. 


ఇప్పుడు ఆ ఆడపిల్ల మనసులో పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. 

తన ఇష్ట ఇష్టాలు తండ్రికే వదిలేయ్యటంతో పెళ్ళి దాదాపు ఖరారయ్యింది. కట్న కానుకలు గూర్చి మాటలు మొదలయ్యాయి. ఆ ఆడపిల్ల ఆలోచనలు,ఆవేదనలు ఇలా ఉన్నాయి 


తనను అడగటానికి వచ్చింది వాళ్ళు. అంటే.. ! నన్ను దానం చేసేవాడు నా తండ్రి అయితే.. ! దానం పుచ్చుకోవటానికి వచ్చింది వాళ్ళు. 


అతడు మీకు కొడుకే అయినా.. ఎంతటి గొప్పవాడు అయినా.. ఎంత వంశోద్దరకుడు అయినా.. వంశాన్ని ఉద్దరించి నిలబెట్టాటానికి వాడు గర్బం దాల్చలేడు కదా... ?అలాంటి నిస్సహాయక స్థితిలో నీ కొడుకునకు నన్ను దానం ఇచ్చేందుకు సిద్దపడ్డాడు నా తండ్రి. అలాంటిది దానం ఇచ్చేవాడిపై అరవటానికి, విసుక్కోవటానికి, కట్న కానుకలు అడగటానికి నీకు అదికారం ఉందా.. ? 


కట్నాలు-కానుకలు, పెళ్ళివాళ్ళ అరుపులు, ఆడపడుచులు దబాయింపులు ఇలాంటివి సనాతన ధర్మానికి తెలియదు కదా.. ఇదేం ఆచారాలు అని. ఆ ఆలోచనలు నుండి తేరుకునే సరికి మూహుర్తం ఖరారయి పెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయారు. 


ఇప్పుడు పార్వతి కుటుంబంలో తల్లి, తండ్రి,అన్న ఈ ముగ్గురు ఆమె పెళ్ళి ఖర్చులు కోసం కష్టపడుతుంటే ఆమె మాత్రం ఇన్నాళ్లు నవ్విన ఆ చిరునవ్వులను,ఇన్నాళ్లు ఆ ఇంట్లో వెలిగించిన వెలుగులను,తన ఆనందాలును ఎక్కడ దాచిందో.. కానీ మచ్చుకైనా కనపడటం లేదు. సనాతన సంప్రదాయ పెళ్ళిళ్ళు కాకుండా కట్నకానుకులు ఇచ్చే ఇలాంటి పెళ్ళిళ్ళకు నా తండ్రి లాంటివారెందరో బలైయ్యారు. ఇప్పుడు నా తండ్రి బలైయ్యాడు. 


ఇరవై ఏళ్ళుగా ఒక ఆడపిల్లని కంటికి రెప్పలా ప్రేమగా చూసుకుని ఇప్పుడు తనను వేరొకరి దగ్గరకు పంపటమే ఆ తండ్రికి నరకంలా ఉంటే కట్నాలు, పెళ్ళి ఏర్పాట్లు అంటారే ఈ పెళ్ళివాళ్ళు. ఇవే ఆ కాబోయే కొత్త పెళ్ళికూతురు మనసులో వేదనలు. ఆ ఆడపిల్ల బాదని అర్థం చేసుకున్న తనవాళ్ళు అప్పుడప్పుడు ఆడిస్తూ, పాడిస్తు,నవ్విస్తూ, కవ్విస్తు తనను మనసులో పెట్టుకున్న బాదలు నుండి విముక్తి చేయటానికి ప్రయత్నించేవాళ్ళు. 


అలా పార్వతి పెళ్ళిరోజు రానే వచ్చింది. 

వరుడు నివాసానికి బయలుదేరుతుండగా ఆమె ఏడుస్తుంది. ఆమె మనసులో ఒకటే ఆలోచనలు,ఒకటే ఆవేదనలు. నా కళ్ళల్లో వచ్చే కన్నీటికి కారణం ఎవరూ.. ? పెళ్ళి అయ్యాక ఒక ఆడది వేరే వారి ఇంటికి వెళ్ళాలని ఎవడు రాశాడో కానీ బహుశా ఖచ్చితంగా వాడికి ఆడపిల్ల పుట్టి ఉండదు. నా ఆవేదన నా కన్నవారికి తెలుసు. కానీ.. !వాళ్ళకి నన్ను వదలటం ఇష్టం లేకున్నా బాధ్యతగా బావించి వారి మనసుని చంపుకుంటు ఓర్చుకుంటున్నారు. ఇక నేను నా ఊరిని,నా కన్నవారిని వదిలి వెళ్ళటం ఖాయం. 


అయితే.. 

 ఒక ప్రపంచానికి వచ్చి తండ్రి రూపంలో ప్రేమను అనుభవించాను. అదే ప్రేమను మరో ప్రపంచంలో అనుభవిస్తానా.. ? ఒకవేళ అనుభవిస్తే అది నా తండ్రి ప్రేమకు సరితూగుతుందా.. ? ఆలోచనలు నుండి బయటపడేసరికి మెడలో పసుపు తాడు పడింది,కన్నవారితో అనుబంధం తెగింది. నా పెళ్ళిలో నా ఆవేదనలు ఒకవైపు, నా తండ్రి కష్టం ఒకవైపు ముట్టడిస్తున్నాయి. 


అప్పగింతలు సమయంలో నా కన్నవారి బాదని నేను చూడలేకపోయాను. చిన్నపిల్లలా నాన్న ఒడిలో కూర్చోలేకపోయాను. 


అన్నయ్య నన్ను పట్టుకుని చిన్నపిల్లాడిలా ఏడుస్తుంటే కరిగిపోయాను. 


నాన్న నా చెయ్యి పట్టుకొని నా భర్త చేతిలో పెట్టి మనస్ఫూర్తిగా దీవించి బయటపడని బాదతో,కనపడని కన్నీళ్ళతో,తన చెమట చుక్కని తువ్వాలుతో తుడుచుకుని తలకొరివి పెట్టినవాడిలా వెనక్కి చూడకుండా ఏడుస్తూ వెళ్ళిపోయాడు. 


అలా నా అనేవారు ఒక్కొక్కరు వెళ్ళిపోగా నా ముందు కొత్త ప్రపంచం, కొత్త మనుషులు తారసపడ్డారు. 


ఇక నేను నా వాళ్ళింటికి అంటూ వెళ్ళల్సి వస్తే.. వాళ్ళకి కూతురిగా ఏమో కానీ.. ఒక బంధువుగా వెళ్ళి రావల్సి ఉంటుంది. ఓ పుట్టింటిబంధువా.. ! పెళ్ళైయ్యాక ఒక ఆడది పుట్టింటికే బంధువుగా వెళ్ళే ఘోరమైన పరిస్థితి వస్తుంది ఆని తెలిస్తే.. ఆడదానిగా పుట్టేదాన్నే కాదని తండ్రిని తలుచుకుని ఏడుస్తుంది పార్వతి. 

**** **** **** **** **** ****

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )

Profile:

Youtube Playlist:

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం 

65 views0 comments

Comments


bottom of page