top of page
Original.png

అడవి నీతి

Aug 16
2 min read

చీమ మాటతో నిజమైన అడవి నీతి తెలుసుకున్న పులి

Adavi Neethi - Telugu Moral Story | Rallabandi Sangam Naidu

అడవి నీతి - తెలుగు నీతి కథ | రాళ్లబండి సంగం నాయుడు

Published in manatelugukathalu.com on 16/08/2026


అడవినీతి ఒక అర్థవంతమైన తెలుగు నీతికథ. ఒక అడవిలో తనకంటే చిన్న జంతువులను విచక్షణ లేకుండా వేటాడే పులి, బలవంతుడే తనకు నచ్చినట్టు చేయడం అడవి నీతి అని భావిస్తుంది. అయితే ఒక చిన్న చీమ పులిని ప్రశ్నిస్తూ, చిన్నవాడా పెద్దవాడా అన్నది కాదు—చేస్తున్న పని నీతివంతమైనదా కాదా అన్నదే ముఖ్యం అని చెబుతుంది. చివరకు పులి కష్టాల్లో ఉన్నప్పుడు అదే చీమ చేసిన సహాయం ద్వారా నిజమైన అడవి నీతి ఏమిటో తెలుసుకుంటుంది.


అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పులి జీవిస్తూ ఉండేది. పులి కనిపించిన ప్రతి జంతువును వేటాడి చంపి తినేది. అది చిన్న జంతువా? పెద్ద జంతువా? అని చూసేది కాదు. సహజంగానే చిన్న, పసి ప్రాణులే పులికి ఆహారం అయ్యేవి. పులి వల్ల ఎన్నో జంతువులు తమ పిల్లలను పోగొట్టుకున్నాయి. పులి ఎన్నో జంతువులకు కడుపుకోత మిగిల్చేది. 


ముక్కుపచ్చలారని పిల్లలు చనిపోవడం వల్ల అడవిలోని జంతుజాతి యావత్తు కుమిలిపోయేది. అలా అని పులిని ఏమీ అడిగే ధైర్యం గానీ, ఎదిరించే దమ్ము గానీ ఆ అడవి జీవులకు లేదు. 


 పులి ఒక రోజు ఒక చిన్న కుందేలు పిల్లను వేటాడుతోంది. అక్కడే ఉన్న చీమ, పులిని ఈ విషయంపై నిలదీసింది. "ఓ పులిరాజా! చిన్న జంతువులను వేటాడటానికి నీకు మనసెలా వస్తుంది?" అని అడిగింది చీమ.


దానికి పులి, "ఈ అడవిలోకెల్లా పెద్ద జంతువును నేను. అతి చిన్న జీవివి నువ్వు. నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావా?" అని అంది. 


"మనం చిన్నా, పెద్దా అన్నది సమస్య కాదు. చేస్తున్న పని నీతివంతమా, కాదా అన్నది ప్రధానం" అంది చీమ. 


"బలహీనుణ్ణి బలవంతుడు చంపడమే అడవి నీతి" అంది పులి. 


"ఐనా నువ్వు చిన్న జీవివి, నీతో నాకేటి?" అంటూ పులి కుందేలును చంపి తినేసింది. 


ఏమి చేయాలో పాలుపోక చీమ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 


 చాలా రోజుల తర్వాత ఒక జంతువును వేటాడే సందర్భంలో పులికి సింహంతో తలపడాల్సి వచ్చింది. సింహంతోటి పోరులో పులికి తీవ్ర గాయాలయ్యాయి. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు అయ్యింది పులి పరిస్థితి. ఎలాగో ఒకలా పులి తన గుహను చేరుకుంది. 


చాలా రోజులు పులి గుహ విడిచి బయటకు రాలేదు. పులి మీద కోపంతో ఉన్న ఏ అడవి జంతువు పులికి సాయం చేయలేదు. కానీ చీమ, ఒక వైద్యుడిని తీసుకువెళ్లి పులికి వైద్యం చేయించింది. పులి కోలుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసింది. 


"నీ కన్నా బలవంతుడైన మృగరాజు నిన్ను చావు దగ్గరకు తీసుకెళ్లడం ఆ అడవి నీతా?" అని అడిగింది చీమ. 


పులి మాట్లాడలేదు. 

"అడవి నీతి అంటే ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం. అంతే తప్ప బలవంతుడు బలహీనుణ్ణి చంపడం కాదు. ఈ రోజు నేను నీకు సహాయం చేయకపోతే నీ గతి ఏమయ్యేది? ఇకనైనా చిన్న ప్రాణులను కాకుండా నీతో సమానమైన జంతువులను వేటాడు" అంది చీమ. 


ఆ రోజు నుండీ పులి చిన్న జీవులను గౌరవిస్తూ, తనతో సరిసమానమైన జీవులనే వేటాడేది. చివరకు సహాయమే అడవి నీతి అని పులి తెలుసుకుని, తోటి వారికి సాయం చేస్తూ జీవించ సాగింది. 



*** 

రాళ్లబండి సంగం నాయుడు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


బి ఆర్ కె వి భాస్కర రావు

రచయిత పరిచయం: రాళ్లబండి సంగం నాయుడు

వృత్తి :స్కూల్ అసిస్టెంట్ తెలుగు

హాబీస్ :కథలు గేయాలు, వ్యాసాలు, లేఖలు రాయడం

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page