top of page
Original_edited.jpg

అజ్ఞాతవాసి

#AyyalaSomayajulaSubrahmanyam, #అజ్ఞాతవాసి, #Ajnathavasi, #అయ్యలసోమయాజులసుబ్రహ్మణ్యము, #TeluguStory, #తెలుగుకథ

ree

Ajnathavasi - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 08/07/2025

అజ్ఞాతవాసి - తెలుగు కథ

రచన: అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము   

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)


‘నాగ్గానీ ఒక్క చాన్స్ దొరికితేనే.. ’ అంటూంటారు సినిమాల్లో అవకాశం కోసం కసిగా తిరిగేవాళ్ళు. ఆ ‘ఒక్కచాన్స్‌’ చైతన్యకు పెద్దగా కష్టం లేకుండానే దొరికింది; కానీ ఆ సినిమా తరువాతే సమస్యలు మొదలయ్యాయి. పరిస్థితులు అతణ్ణి కొలిమిలో కాల్చినట్టే కా‌ల్చాయి. 


అలా ఏడేళ్ళు.. తనని తాను పుటం పెట్టుకున్న చైతన్య బంగారం లాగే బయటకొచ్చాడు. నందాతో ‘మిడిల్‌క్లాస్‌ లైఫ్’ తీసి మంచి హిట్టిచ్చాడు. తన మూడో సినిమాతోనే కళ్యాన్‌కు

‘యాక్షన్’ చెబుతున్నాడు; ఆ అనుభవాలు మనతో ఇలా.. 


మా ఊళ్ళోవాళ్ళు తమకున్న దుస్తుల్లో కొన్నింటిని భద్రంగా దాచుకుంటూ ఉంటారు. 


***


ఎపుడైనా శుభకార్యాలప్పుడు వాటిని వేసుకుని దర్జాగా వెళుతుంటారు. ”డ్రెస్‌ బావుందిరా.. ” అని ఎవరైనా అనడం ఆలస్యం “ఎవరు కుట్టిండ్రో తెలుసా?”.. రామకృష్ణ;” అని గొప్పగా చెప్పేవారు. ఆ రామకృష్ణ మా నాయన. అప్పట్లోనే బొంబాయిలో హీరోల డ్రెస్‌ డిజైనర్‌ దగ్గర పనిచేసిండు మా నాయన. అమితాబ్‌, శతృఘ్నసిన్హా, జితేంద్ర మొదలగు హీరోలకి కాస్ట్యూమ్ లు కుట్టాడు. అంతటివాడు తమకి బట్టలు కుడుతున్నాడంటే అదెంత గర్వకారణం. 


మొదట బొంబాయిలో పనిచేసిన నాన్న సౌదీకి వెళ్ళాడు. సౌదీ నుండి సెలవులకు వచ్చినప్పుడు ఊరిలో ఎవరు కష్టంలో ఉన్నా లెఖ్ఖలేవీ వేసుకోకుండా అడిగినంత సాయం చేసేవాడు. దర్జీపనులకోసం ఎవరు అడ్వాన్స్ ఇచ్చినా.. ఆ బట్టలు కుట్టే దాకా, ఆ డబ్బుని ముట్టుకునే వాడు కాదు. మనం పని పూర్తి చేసేదాకా అది మన డబ్బుకాదు.. మనది కాని ఒక్క రూపాయైనా వాడకూడదు అనేవాడు. ఆ విలువలన్నీ ప్రత్యేకించి నేర్చుకోకుండానే నాకు వచ్చాయి. ఓ రకంగా అవే నన్ను సినిమా రంగంలో నిలదొక్కుకునేలా చేశాయి. 


జనగామ జిల్లాలో మంచిరేవుల అనే గ్రామం మాది. ఇంటిలో నాతోపాటు తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. నాన్న ముంబాయి పనులకి వెళ్ళిపోవడంతో అమ్మే అన్నీ తానై మమ్మల్ని పెంచింది. ఐదో తరగతి వరకూ గ్రామంలోని ప్రభుత్వ బడిలో చేర్పించింది. నేను బాగా చదువుతున్నానని మా హెడ్మాస్టర్‌ నన్ను ఇంగ్లీషు మీడియం స్కూల్లో చేర్పించారు. 


టెన్త్ లో పదకొండో ర్యాంక్‌ వచ్చింది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్‌ గా ఉన్నప్పుడు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొదటి ర్యాంకు వచ్చింది. దాంతో నన్ను ఇంజనీరింగ్‌ చేయించాలనే లక్ష్యంతో హైదరాబాద్ లో నైతే ఇంటర్‌ తో పాటు ఎంసెట్‌ కోచింగ్ కూడా ఉంటుందని పంపించారునాన్న. 


‘నువ్వు గొప్పోడివి కాకపోయినా.. చెడ్డోడివ్ మాత్రం కావొద్దు’ అని మాత్రమే చెప్పారు. నేను చెడ్డవాడిలా అయితే పేరు తెచ్చుకోలేదు కానీ నాన్న కోరుకున్నట్లు డాక్టరు కాలేక 

పోయాను. పదో తరగతిలో నాకు పరిచయమైన డ్రామాలూ, డ్యాన్సులూ నా చదువును దారి మళ్ళించాయి.. 


హైదరాబాద్‍ లో అప్పుడప్పుడే సిటీకేబుల్‌ చానల్‌ మొదలైంది. దాని కోసం తీస్తున్న ఓ సీరియల్‌కి పదిహేడేళ్ళ కుర్రాడు అవసరముందని చెబితే వెళ్ళాను. ఇదివరకే డ్రామాల అనుభవం ఉంది కాబట్టి నటన నాకు ఈజీగానే వచ్చేసింది. 


కానీ అప్పుడే నా దృష్టి డైరెక్టర్ కుర్చీ మీద పడింది. మెగాఫోన్‌ పట్టిన వాళ్ళకి మిగతా అందరిమీద ఉన్న కమాండ్‌ చూసి ఏదో ఒకరోజు నేనూ అందులో కూర్చోవాలనుకున్నాను. మెల్లగా సినిమా నా మనసునీ, జీవితాన్ని ఆక్రమించడం మొదలెట్టింది. ఓగొప్ప సినిమా చూస్తూ ఆత్మని ఎన్‌రిచ్‌ చేసుకుని చచ్చిపోయినా చాలనుకునే వాణ్ణి.. 


ఇప్పుడూ అంతే; అప్పట్లో ఈ వ్యాపకాలతో ర్యాంకు కాదు

కదా; ఇంటర్‌ పాసవడానిక్ అపసోపాలు పడ్డాను. ఎలాగోలా గట్టెక్కాక నాన్న నన్ను ఎంసెట్‌ కోచింగ్ లో చేరమన్నారు. తొలిసారిగా ఆయన మాటని కాదన్నాను. సినిమాలతో ఎక్కువ సమయం గడపవచ్చని మామూలు డిగ్రీలో చేరాను. 


సినిమా వ్యాపకంతో కాలేజీకి హాజరు కాక, రెండు కాలేజీల నుంచి నన్ను పంపేశారు. మూడో కాలేజీలో చేరి డిగ్రీ పూర్తి చేశాను. ఓసారి ప్రముఖ దర్శకుడు రాజ్‌దీప్‌ ఓ ప్రకటనని చిత్రీకరించేందుకు హైదరాబాద్ వచ్చారు. 


ఆయనకి తెలుగు, ఇంగ్లీష్ మాట్లాడగలిగిన సహాయదర్శకుడు అవసరమని తెలిసిన వాళ్ళు చెప్పడంతో వెళ్ళాను. ముంబై నుంచి మరో బృందం కళ్యాణ్‌తో ప్రకటన తీసేందుకు వస్తే.. 


దానికి సహాయదర్శకుడిగా పనిచేశాను. అప్పుడే కుమరన్‌ పరిచయమయ్యారు. ఆయనతో “ఆర్యవాసి” కి సహాయ దర్శకుడిగా పనిచేశాను. అప్పటి నుంచి రాజేంద్ర సంస్థలో ఉండి పోయాను. 


‘భధ్రావతి, ఆటబొమ్మలు, కొత్త స్వర్గం, ముంజీ’.. ఇలా ఒక్కో సినిమాకి ఒక్కోరకం బాధ్యతని తీసుకుని పనిచేశాను. ఆ తర్వాతే రాజేంద్ర దర్శకత్వం చేయమన్నారు. అప్పటికే నేను సిద్దం చేసుకున్న ఓ కథని తెరకెక్కించాను. అదే ‘ ఓ మై దోస్త్’. అప్పటికి పదిహేను ఏళ్ళపాటు నన్ను వెంటాడిన సినిమా కల అలా సాకారమైందనుకుని గాల్లో తేలిపోయాను. 


 అంతేకాదు.. మరో నెలలో మా తమ్ముడి పెళ్ళి పెట్టుకున్నాము. కానీ నాన్న మాఇంటిపైన మరో అంతస్తు కట్టిస్తున్నాడు. ఇన్ని మంచి విషయాలు జరుగుతున్న ఆనందంలోనే నా సినిమాని ఇంటిల్లిపాది కలిసి చూశాం. ఆ తరువాత అందరం కలిసి తిరుపతి వెళ్ళాలనుకున్నాం. కానీ నాన్న ఇంటి నిర్మాణం పనులు మిగిలిపోయాయని ఊరెళ్ళాడు. 


ఆ తరువాతి రోజు మధ్యాహ్నం మేం తిరుపతి లో ఉండగా ఫోన్‌ వచ్చింది. నాన్న కొత్తగా కడుతున్న అంతస్తు పైనుంచి కింద పడిపోయాడు. మరి కాసేపటి తరువాత అసలు నిజం తెలిసింది.. నాన్న ఇక లేరని. అప్పటిదాకా పెద్దగా ఒడిదుడుకులు లేకుండా సాగిన జీవితంలో నాకు ఎదురైన పెద్ద దెబ్బ అది.. చాలా.. పెద్ద దెబ్బ కూడా..


నాన్న చనిపోయాడని వార్త విన్న తరువాత.. నా సినిమా ఏమైందో కూడా పట్టించుకోలేదు. అంత్యక్రియలప్పుడు కూడా నేను ఆ షాక్‌ నుంచి తేరుకోలేకపోయాను. మెల్లగా.. చాలా మెల్లగా నాన్న చనిపోయిన నెల రోజులకు మనిషినయ్యాను. అలా ఆ షాక్ నుంచి తేరుకున్నాక నాకొచ్చిన మొదటి ఆలోచ ‘ఫరవాలేదు.. నాన్న నేను దర్శకునయ్యానని తెలిసిన తరువాతే పోయారు. ;’ అన్నది. 


ఆ తరువాతే హైద్రాబాద్ వచ్చాను. నా సినిమా ఏమైందని కనుక్కుంటే నిర్మాత కు డబ్బులు మిగిలాయి కానీ సినిమా ఆడలేదనే విషయం తెలిసింది. ఓ దర్శకుడి మొదటి సినిమా ప్లాఫ్‌ అయితే దాని ప్రభావం ఎలా ఉంటుందో అప్పటికి నేను అంచనా వేయలేకపోయాను. ’ ఓమైదోస్త్‌’ తరువాత నేను కళ్యాన్‌ కి కథ వ్రాశాను. 


ఆయన్ని కలవడానికి షూటింగ్ స్పాట్‌ కి వెళ్ళినా కుదరలేదు. ఆ తరువాత మరో ఇద్దరు పెద్ద హీరోలకి, కథ చెప్పాను.. తిరస్కరించారు. ముగ్గురు చిన్న హీరోలు కుదరదన్నారు. అలా మొదటి సినిమా రిలీజైన ఐదేళ్ళకి నాలుగు కథలు పట్టుకుని దాదాపు అందరు హీరోల చుట్టూ తిరిగాను. మధ్యలో "మైసూరు మర్యాదలు" మళయాల సినిమా రీమేక్‌ కోసం రాజేంద్ర దగ్గర పనిచేస్తే అదికూడా పట్టా లెక్కలేదు. 


ఓ కథ సిద్దం చేసుకుని పెద్దహీరోతో మొదలు పెట్టాను. అదీ చివరి నిమిషంలో ఆగిపోయింది. 


"ఎప్పుడూ గెలుపే జీవితం అనుకోవద్దు. మనం వెళ్ళే దారిలో ముళ్ళూ, రాళ్ళూ అన్నీ ఉంటాయని " చెబుతూండేది మా అమ్మ యశోద. మెల్లగా ‘నా కథ నచ్చలేదంటే వాళ్ళకి

నచ్చేలా చెప్పలేకపోయానే కదా; ‘ అన్న నిజాన్ని స్వీకరించాను. నరేషన్‌ లో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ’రెండో ఛాన్స్‌’ కోసం ఎదురు చూడటం మొదలు పెట్టాను. 


ఇంజనీరింగ్‌ కోసం మా తమ్ముడు హైద్రాబాద్ కి వచ్చిన కొత్తలో మేమిద్దరం కలిసి ఓ గదిలో ఉండేవాళ్ళం. మాట్లాడుకున్నా, తిన్నా, పడుకున్నా మేమిద్దరమే. కానీ పెళ్ళయ్యక మా మధ్యకి మూడో వ్యక్తిగా నా భార్య వచ్చింది. 


తన రాకతో నా తమ్ముడిలో అభద్రతా భావం కనిపించేది. ఇంతకాలం నాతో మాత్రమే స్నేహితుడిగా ఉన్న అన్నయ్య జీవితంలోకి ఇంకెవరో వచ్చారనే ఉడుకుమోత్తనం ఉండేది. ప్రేమ ఉంటేనే కదా అలా అభద్రతా భావానికి గురవుతారు అనిపించింది. 


ఆ అనుభవానికే కమర్షియల్ హంగులు జోడించి “:మిడిల్‌ క్లాస్ మర్‌మర్స్‌” స్క్రిప్ట్ సిద్ధం చేశాను. ఆ సినిమా ఘనవిజయం సాధించింది. నా కెరీర్‌ లో అతిపెద్ద హిట్టు నువ్వే ఇచ్చావు అన్నాడు హీరో తేజ్‌దీప్‌. ఆ తరవాత రెండేళ్ళపాటు నాకు నేనే లాక్ డౌన్‌‌ విధించుకుని అన్వేష్‌ కోసం ‘ఐడియల్‌’ కథ రాశాను. కాకపోతే అది పట్టాలెక్కడానికి కాస్త ఆలస్యమైంది. ఈ లోపే అనుకోకుండా ఓ మంచి అవకాశం తలుపు తట్టింది. 


‘మిడిల్ క్లాస్ మర్‌మర్స్‌’ తరువాత కళ్యాణ్‌ తో నేను ‌తనతో సినిమా చేస్తున్నట్టు కల కనవయ్యా;’ అన్నా కూడా సందేహించేవాణ్ణేమో; కానీ అదే జరిగింది. ఓసారి రాజేంద్ర 

నన్ను త్రివిక్రమ్ దగ్గరకు తీసుకెళ్ళారు. వాళ్ళిద్దరూ హిందీ సినిమా ని కళ్యాణ్‌తో తెలుగు లో తీయాలనే విషయంలో మాట్లాడుకుంటున్నారు. వరసగా ఇద్దరు ముగ్గురు యువ

దర్శకుల పేర్లు వచ్చాయి.. అప్పుడు త్రివిక్రమ్ ‘మన చైతన్య అయితే తీయగలడేమో’ అన్నారు. 


అలా అనుకోకుండా నా పేరు ఖరారు అయింది. మా నాన్న అడ్వాన్స్ తీసుకుంటే ఖర్చు పెట్టరని చెప్పాను కదా; ‘మిడిల్ క్లాస్ మర్‌మర్స్‌’ తరవాత ముగ్గురు నిర్మాతలు

అడ్వాన్స్ లు ఇచ్చారు. ‘నేను చెక్‌ తీసుకుంటాను కానీ, సినిమా చేసేదాకా దాన్ని బ్యాంకులో వేయ’ నని చెప్పాను. నేను అలా చేయబట్టే ఏ కమిట్‌మెంట్స్‌ లేకుండా కళ్యాణ్‌తో సినిమా తీయగలిగాను. 


ఓ రకంగా నాన్నలోని గుణమే నాకు కళ్యాణ్‌తో “ లయర్‌ Vs లాయర్‌” చేసే అవకాశాన్ని, అదృష్టాన్ని ఇచ్చింది. 


సమాప్తం


అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

 రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.


అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.


ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,


ఆంధ్రభూమి, దేశభక్తిసాహిత్య ఈ పత్రిక, సహరి, మిసిమి,తపస్విమనోహరం,మాధురి


మాసపత్రిక,ఉషాపక్షపత్రిక, సుమతి మాస పత్రిక, షార్‌ వాణి,మన తెలుగు కథలు.కామ్‌.


బిరుదులు- సాహిత్యవిక్రమార్క- దేశభక్తిసాహిత్య ఈ పత్రిక


ఉత్తమ రచయిత- మనతెలుగుకథలు.కామ్‌.


కలహంస—- నెలవంక- నెమలీక మాస పత్రిక.


ప్రథమబహుమతులు- నవలల విభాగము- మనతెలుగుకథలు.కామ్‌ మరియు


త‌పస్విమనోహరము.


ప్రథమద్వితీయబహుమతులు— కథల విభాగము- సహరి, మనతెలుగుకథలు.కామ్‌


చారిత్రక నవలలో ప్రథమ, ద్వితీయబహుమతులు.


సాంఘికనవలలో ద్వితీయ, కన్సోలేషన్‌ బహుమతులు.


ఇవేకాక ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, ,రాజకీయ సంబంధించి పెక్కు వ్యాసాలు పత్రికల్లో వస్తూంటాయి.


కవితలు కూడా అన్ని విషయాల మీద కూడా వస్తూంటాయి.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ree


ree




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page