'Amma Korika' New Telugu Story
Written By Kolla Pushpa
'అమ్మ కోరిక' తెలుగు కథ
రచన: కొల్లా పుష్ప
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
"అమ్మా" అంటూ వాటేసుకుంది సుగుణ తల్లిని.
" ఏంట్రా తల్లి అంత సంతోషంగా ఉన్నావ్" అన్నది తల్లి సత్యవతి. " నేను సైకిల్ రేస్ లో ఫస్ట్ వచ్చానమ్మా స్కూల్లో" అంది సంతోషంగా సుగుణ.
ఇంతలో రెండవ కూతురు "అక్క కొంచెం కూడా ఆగకుండా ముందుకు వెళ్లిపోయింది, నేను సెకండ్ వచ్చాను" అన్నది బుంగమూతి పెట్టుకొని వాణి.
"ఓ నువ్వు కూడా గెలిచావా అబ్బా నా కూతుర్లు బంగారాలు" అంటూ ముద్దులాడి "ఈసారి నువ్వు ఫస్టు వద్దు గానీ లేమ్మా" అని పిల్లలకి టిఫిన్ పెట్టి పెరట్లోకి వెళ్ళింది సత్యవతి. రెండు సైకిల్స్ దుమ్ము పట్టి ఉన్నాయి. వాటి మీద చెయ్యి వేసి గతంలోకి జారిపోయింది.
@@@
రామాపురం హైస్కూలు లో ఏడవ తరగతి చదువుతున్నది సత్యవతి తన ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది స్కూల్. చాలామంది పిల్లలు సైకిల్ మీద వస్తారు.
" నాన్న నాకు సైకిల్ కొని పెట్టవా"? అని అడిగింది సత్యవతి వాళ్ళ నాన్నని. ఈ ఏడూ ఎక్కువ వర్షాలు పడటంవలన పంట పోయిందమ్మా మళ్లీ ఏడు కొంటానులే" అన్నాడు తండ్రి సోములు నాగలి భుజం మీద వేసుకుంటూ.
మళ్ళీ సంవత్సరం అడిగింది తండ్రిని సత్యవతి సైకిల్ కొనమని. "అమ్మకి ప్రాణం బాగోలేదు కదమ్మా తర్వాత చూద్దాంలే" అన్నాడు సోములు. ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒక అడ్డంకి తో సైకిలు కొనలేదు కానీ బాధ్యత తీర్చుకోవాలని పెళ్లి చేశాడు సత్యవతికి.
@@@
మొదటి రోజే భర్తని అడిగింది "తనకు సైకిల్ నేర్చుకోవాలని ఉందని"సత్యవతి. అది విన్న అత్తగారు "అవ్వ ఎవరైనా నవ్వి పోతారు పెళ్లయిన ఆడపిల్ల సైకిల్ తొక్కడం ఏంటి" అని.
అంతే తన కోరికను మనసులోని అణి చేసుకుంది.
"ఏంటమ్మా సైకిల్ పట్టుకుని ఆలోచిస్తున్నావ్" అన్నారు పిల్లలు ఒకేసారి. దాంతో ఆలోచన నుంచి బయటకు వచ్చింది సత్యవతి.
ఇంతలో భర్త కృష్ణారావు వస్తూ "దానికి పెద్ద కథ ఉందర్రా పిల్లలు" అంటూ కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్లిపోయాడు.
@@@
తెల్లవారుజామున 5:00 సమయం రోజూ పిల్లల్ని లేపి వాళ్ళను చదివించే సత్యవతి లేవలేదు. రాత్రి ఏదో ఆలోచనలతో సరిగా నిద్ర పట్టలేదేమో తెల్లవారుజామున గాఢంగా నిద్రపోతుంది.
"అమ్మా, అమ్మా లెగమ్మ" అంటూ ఇద్దరు కూతుళ్లు లేపుతుంటే లేచింది సత్యవతి "ఏమిటి" అంటూ. "నువ్వు ఒక్కసారి బయటికి రామ్మా" అన్నారు తల్లిని లాక్కెళ్తూ.
బయటకు వెళ్లిన సత్యవతికి ఇద్దరు కూతుర్లు "అమ్మా నువ్వు సైకిల్ ఎక్కు మేం నేర్పుతాం" అన్నారు.
"ఇప్పుడు ఈ వయసులో నాకెందుకురా" అన్నది సత్యవతి. పిల్లలు అయినా సరే ఒప్పుకోలేదు తల్లిని సైకిల్ మీద ఎక్కించి అటు ఇటు బ్యాలెన్స్ కాస్తూ తల్లికి సైకిల్ నేర్పించారు.
రాత్రి తండ్రి ద్వారా తల్లి కోరిక తెలుసుకున్న పిల్లలు ఎలాగైనా తల్లి కోరిక నెరవేర్చాలని అనుకున్నారు. తల్లి సైకిల్ తొక్కుతుంటే ఆనందంగా చూస్తున్నారు. తన కోరిక ఇలా నెరవేరినందుకు సత్యవతి కూడా ఆనందంగా పిల్లల్ని చూసింది.
శుభం
కొల్లా పుష్ప గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: కొల్లా పుష్ప
Comments