అమ్మ మహా కావ్యము
- Gadwala Somanna
- Aug 22
- 1 min read
#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #AmmaMahaKavyamu, #అమ్మమహాకావ్యము, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 111
Amma Maha Kavyamu - Somanna Gari Kavithalu Part 111 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 22/08/2025
అమ్మ మహా కావ్యము - సోమన్న గారి కవితలు పార్ట్ 111 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
అమ్మ మహా కావ్యము
------------------------
అమ్మ మహా కావ్యము
అజరామరం త్యాగము
ఎన్నిసార్లు విన్నా
అతి నవ్వాతి నవ్యము
అమ్మ పిలుపు మధురము
అది శ్రవణానందము
ఎన్నిమార్లు తలచినా
ఉండును క్రొత్తదనము
అమ్మ అనే శబ్దము
అందుంది మహత్యము
వింటే బహు పుణ్యము
జీవితమిక ధన్యము
అమ్మ మది నున్నితము
జాగ్రత్త అవసరము
విరిగిన ఏమాత్రము
అతుకు కొనుట కష్టము

గుండె అభిలాష
---------------------------------------
పవిత్రమైన తలపులతో
ఉపయుక్తమైన చేతలతో
ఆదర్శం కావాలోయ్!
ప్రేమలొలికే పలుకులతో
అందమైన చిరునవ్వుతో
స్వచ్ఛమైన చెలిమితో
ముందడుగే వేయాలోయ్!
విలువైన ఆత్మీయతతో
క్షమించే ఘన సుగుణాలతో
సహకరించే సహృదయంతో
లోకంలోన వెలగాలోయ్!
ఉన్నత వ్యక్తిత్వంతో
మేలి మానవత్వంతో
దివ్యమైన దైవత్వంతో
జీవితంలో ఎదగాలోయ్!
కష్టించే తత్త్వంతో

దృఢ సంకల్పముండాలి!
--------------------------------------
ఉంటే దృఢ సంకల్పము
అనుకున్నవన్ని సఫలము
నిరంతర సాధనతో
ఇక ఏదైనా సాధ్యము
మనసే అతి కీలకము
దృష్టి సారిస్తే సులభము
చేస్తున్న పనియందున
పెట్టుకోవాలి నియమము
పగటి కలలు కనరాదు
కష్టిస్తేనే ఫలితము
ఏది వృధా చేయరాదు
కావాలోయ్! ఉపయోగము
దేవునిపై భారము వేసి
ఉండాలి నిశ్చింతగా
సతతంబు దీక్ష పూని
సాధించాలి ఘనంగా

ఉంటేనే జీవితము
--------------------------------------
చక్కటి ఆలోచనలు
తియ్యటి అనుభూతులు
ఉంటేనే జీవితము
చరిత్రలో కొన్ని పుటలు
నిరంతర పోరాటము
అలలలాంటి ఆరాటము
ఉంటేనే జీవితము
చేరితేనే గమ్యము
ముఖంలోన చిరునవ్వులు
ఇతరులలోను అహర్నిశలు
చూస్తేనే జీవితము
అప్పుడే జన్మ సార్ధకము
గాఢమైన బంధాలు
విలువైన అనుభవాలు
ఉంటేనే జీవితము
కాసిన్ని ఆనందాలు
-గద్వాల సోమన్న
Comments