అమ్మ
- Nandyala Vijaya Lakshmi
- May 11
- 1 min read
#NandyalaVijayaLakshmi, #నంద్యాలవిజయలక్ష్మి, #Amma, #అమ్మ, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Amma - New Telugu Poem Written By - Nandyala Vijaya Lakshmi
Published in manatelugukathalu.com on 11/05/2025
అమ్మ - తెలుగు కవిత
రచన: నంద్యాల విజయలక్ష్మి
అనురాగం ఆప్యాయత కలబోస్తే అమ్మ .
చూపులతోనే శాసిస్తూ
ప్రేమతో వడ్డిస్తూ
కొసరి కొసరి తినిపిస్తూ
చీరచెంగు చాటున కప్పేసి
ఎల్లవేళలా నేనున్నానంటూ
కాపాడే కల్పవల్లి అమ్మ .
కొవ్వొత్తిలా వెలుగునిస్తూ
కరిగిపోతూ కూడా
కన్నవారికై తపించే
కరుణామయి అమ్మ .
ఇంటికి రాణీ ఆయినా ఇంటిల్లిపాదీకి సేవికలా నిరంతరమూ
శ్రమించే అలుపెరగని నిస్వార్థజీవి అమ్మ.
తప్పొప్పులు సరిదిద్దుతూ సుమధురగాథలు నూరిపోస్తూ సన్మార్గములో కన్నవారిని నడిపించే మార్గదర్సి అమ్మ .
జీవిత పాఠాలు
నేర్పే ఆదిగురువు అమ్మే
ఆనందములో
ఆవేదనలో ఎప్పుడైనా
అందరినోటా వచ్చే మాటే అమ్మ .

-నంద్యాల విజయలక్ష్మి
అమ్మ మదిలో ఎల్లప్పుడూ కదలాడే ఒక అందమైన భావన. అమ్మ తలపే ఒక రకమైన ధైర్యాన్నిస్తుంది. మనసులో మెదిలే భావాలకు అక్షరరూపం ఇచ్చిన రచయిత్రి కి అభినందనలు
"ఆమ్మ" గురించి చెప్పాలంటే, ఎంత చెప్పిన తక్కువే. చాలా బాగా రాసారు. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
అమ్మ అనగానే మనసు బరువెక్కుతుంది. అమ్మా జ్ఞాపకాలు మీ కవిత లో సాక్షాత్కారమయ్యాయి బాగుంది.