'Ammi Amma Attha' - New Telugu Story Written By Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 16/03/2024
'అమ్మి.. అమ్మ.. అత్త' తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
తెలుగు ప్రధాన ఉపాధ్యాయురాలు సుమలత శర్మగారు క్లాస్ గదిలో ప్రవేశించారు. పిల్లలు నమస్కారాన్ని తెలిపారు. ఉపాధ్యాయురాలు చిరునవ్వుతో.... "ఈరోజు నేను మీకు మన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడిన గొప్ప చరిత్ర నాయకీమణులు చిత్తూరుకోట (రాజ్యం) మహారాణి పద్మావతి, ఓరుగల్లు (వరంగల్) మహారాణి రుద్రమదేవి గురించి చెబుతాను శ్రద్ధగా వినండి. మన ఈ పరమపవిత్ర భారతదేశానికి ప్రపంచ చరిత్రలో గొప్ప విశిష్టత ఉంది. కారణం మన పూర్వీకులు ఆడవారిని తమతో సమానంగా భావించేవారు.... గౌరవించేవారు.... అభిమానించేవారు.
ఆ కఠిక సత్యం ప్రకారం మన దేశ చరిత్రలో ప్రసిద్ధికెక్కిన వీర నారీమణులు.
1. మహారాణి పద్మావతి వీరికి మరో పేరు పద్మిని (1351-1400 CE) Common Era)
వీరి దేశభక్తి, వీరత్వం, త్యాగం, జీవిత బలిదానం అసమానం.... అద్వితీయం. ఆమె సింహాళ (శ్రీలంక) రాజ్యపు యువరాణి. అపురూపమై అద్వితీయమైన అందచందాలు ఆమెకు సొంతం. చిత్తూరు కోట రాజు రతన్‌సేన్ (మౌర్య వంశస్థులు) పద్మావతి అందాన్ని గురించి హీరామన్ (మాట్లాడే చిలుక) చెప్పగా విని, సాహసోపేతంగా అన్వేషణ సాగించి, పద్మావతిని కలిసికొని, తన వివరాలు ఆమెకు తెలియజేసి వారి తల్లిదండ్రులను ఒప్పించి వివాహం చేసుకొని వారిని చిత్తూరు కోటకు తీసుకొని వచ్చాడు రతన్‌సేన్. ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తూరును ఆక్రమించి రతన్ సేన్‌ను బంధించి చెరసాలలో వుంచాడు. వారి రాజగురువు ’కుంభాల్నెరుదేవ్పాలు, పద్మావతిదేవి అందానికి ఆకర్షితుడై తనను వివాహం చేసుకోవాల్సిందిగా ఆమెను కోరాడు. అల్లాఉద్దీన్ షరతులను అంగీకరించిన రతన్‌సేన్ చిత్తూరుకు తిరిగి వచ్చాడు. పద్మావతి కుంభాల్నెరుదేవ్పాలు స్వభావాన్ని, కోరికను రతన్సేన్కు తెలియజేసింది. దేవ్పాలు, రతన్‌సేన్ ద్వంద్వ యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో ఇరువురూ మరణించారు. పద్మావతీ అందచందాలను గురించి విన్న అల్లావుద్దీన్ చిత్తూరు కోటను ముట్టడించారు. చిత్తూరు సైన్యం అతన్ని ఎదురించింది. అల్లా ఉద్దీన్ ఖిల్జీ సైన్యం ధాటికి చిత్తూరు సైన్యం తట్టుకోలేక ఓడిపోయింది. రాణి పద్మావతి తన అంతఃపుర సహచరులు (ఆడవారు) జౌహార్ (అగ్నిలో ప్రయోపవేశం) దీపాల జ్వాలల్లో స్వీయ ఆత్మాహుతి చేసుకొని, అల్లాఉద్దీన్ ఖిల్జీని లక్ష్యాన్ని ఓడించి, తమ రాజ్య గౌరవాన్ని ఆ రీతిగా కాపాడుకొన్నారు ఆ మహారాణి పద్మినీదేవి. ఈ చేదు విచారకరమైన సంఘటన 1303లో జరిగినది.
2. రెండవ మహానాయకి మహారాణి రుద్రమదేవి :-
ప్రతి స్త్రీ మూర్తి (ఈ దేశాన) త్యాగానికి ప్రతిరూపం.... మహారాణి రుద్రమదేవి ఆంధ్ర అతివల పౌరుష సావాసాలకు దేశభక్తికి గొప్ప నిదర్శనం. కాకతీయ వంశంలో జన్మించి ఒక ధృవతారగా వెలిగిన మహారాణి రుద్రమదేవి. వీరి జననం శా.శ (శాలివాహన శకం) 1261 మార్చి 25. ఆమె తండ్రిగారు గణపతిదేవుడు. తల్లి సోమలదేవి. గణపతిదేవుడు రుద్రమదేవిని చిన్నతనం నుంచి మగబిడ్డను పెంచినట్లు పెంచి రాజ్య రక్షణకు కావలసిన అన్నిరంగాలలో సద్గురువులు చెంత శిక్షణను కల్పించారు. వారికి పుత్ర సంతానం లేని కారణంగా వారు ఆమెను రుద్ర దేవుడని (నామకరణం చేసి) పిలిచేవారు. యుక్త వయస్సులో రాజ్యపాలనా విషయంలో రాణి రుద్రమదేవి తండ్రికి మంచి మంచి సలహాలను ఇచ్చేది. ఆమె వివాహాన్ని నిరవద్యపుర (నిడదవోలు) ప్రాంతాన్ని పాలిస్తున్న తూర్పు చాళుక్యుడైన వీరభద్రుడికి ఇచ్చి వివాహాన్ని జరిపించారు గణపతిదేవుడు. రుద్రమదేవికి ఇరువురు కుమార్తెలు. పెద్దకుమార్తె పేరు ముమ్మడమ్మ. ఈమె భర్తపేరు మహాదేవుడు వారి పుత్రుడే ప్రతాపరుద్రుడు. రుద్రమాంబ (దేవి) ప్రతాపరుద్రుని దత్తత తీసుకొని యువరాజుగా పట్టాభిషేకం చేసింది. రుద్రమ దేవి రెండవ కుమార్తె రుయ్యమ్మ. కాకతీయ రాజులలో అగ్రగణ్యుడైన గణపతి దేవుని తర్వాత 1269లో రుద్రమదేవి రుద్ర మహారాజు బిరుదంగా కాకతీయ సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్టించింది.
కానీ.... ఓర్వలేని సామంతులు ఒక మహిళ పాలకురాలు కావడాన్ని సహించలేక తిరుగుబాటు చేశారు. అదే సమయంలో నెల్లూరు పాండ్యులు క్రిందికి, వేంగి ప్రాంతం గొంకరాజు మొదటి నరసింహుడు క్రిందికి వెళ్ళినాయి. పాకసాటి కాయస్థ అంబదేవుడు, కళింగ నరశింహుని కుమారుడు వీరభానుడు తిరుగుబాట్లు చేశారు. రుద్రమ తన సేనలతో కలసికట్లుగా ఆ తిరుగుబాట్లనన్నింటినీ విజయవంతంగా అణచివేసింది. రుద్రమాంబ ఎదుర్కొన్న దండయాత్రలన్నింటిలో దేవగిరి యాదవరాజుల దండయాత్ర అతి పెద్దది. కీలకమైనది. యాదవరాజు మహాదేవుడు ఓరుగల్లును ముట్టడించాడు. రుద్రమదేవి యాదవులను ఓడించి, దేవగిరి దుర్గం వరకు తరిమికొట్టింది. వేరేదారి లేక యాదవరాజు మహాదేవుడు సంధికి వచ్చి, యుద్ధనష్ట పరిహారంగా మూడుకోట్ల సువర్ణాలను రుద్రమదేవికి చెల్లించాడు. రుద్రమదేవి తాను స్వయంగా కాయస్త రాజ్యంపై దాడి చేసింది. కాయస్త రాజు అంబదేవునితో జరిగిన యుద్ధంలో రుద్రమదేవి మరణించింది. రుద్రమదేవికి గల ఇతర బిరుదు రాయగజకేసరి. 1289 లో మహారాణి రుద్రమదేవి రణరంగంలో వీరమరణం పొందారని నల్లగొండ జిల్లా చందుపట్ల శాసనంలో ఆ వీరవనిత నిర్యాణాన్ని గురించి వివరించబడింది. అతివలు అబలలు కారు సబలలు అని నిరూపించిన మహావీర నాయకురాలు మహారాణి రుద్రమదేవి. వీరి జీవితకాలం 1261 నుండి 1289 వరకు. మన తెలుగు వారి ప్రాంతంలోకి అడుగును పెట్టనీయకుండా ముస్లింలతో పోరాడిన ధీరవనిత రాణి రుద్రమదేవి."
గంట మ్రోగింది. తెలుగు ప్రధాన ఉపాధ్యాయురాలు సుమలతాశర్మ గారి పిరీయడ్ ముగిసింది. "రేపు కలుద్దాం" అని చిరునవ్వుతో చెప్పి క్లాస్ గది నుండి బయటికి నడిచారు.
మరుదినం విద్వాన్ ఉభయ భాషా ప్రవీణులు (తెలుగు సంస్కృతము) ప్రధాన ఉపాధ్యాయురాలు సుమలతా శర్మ గారు క్లాసు గదిలోనికి వచ్చారు. పిల్లలనందరినీ పరీక్షగా చూచారు.
"నిన్న మనం మన దేశానికి స్వాతంత్ర్యం లభించక ముందు మన సంస్కృతిని, మన సిద్ధాంతాలను గొప్పగా నమ్మి, మన ఆనాటి విరోధులపై వీరోచిత పోరాటాన్ని సాగించి వీరమరణం పొందిన, చిత్తూరు మహారాణి పద్మావతి దేవిని గురించి, మన ఆంధ్రభూమిన జన్మించిన వీరనారీమణి మహారాణి రుద్రమదేవిని గురించి చెప్పుకోవడం జరిగింది. ఈనాడు పందొమ్మిదవ శతాబ్దంలో మన పాలకులైన ఆంగ్లేయులను నిరసిస్తూ, వారితో స్వతంత్ర్యం కోసం పోరాటం చేసి అమరులైన వీరనారీమణులు, కమలాదాస్ గుప్త, కల్పనాదత్, ప్రీతీలతలను గురించి మీకు వివరిస్తాను.
3. కమలాదాస్ గుప్త : (జననం 11మార్చి 1907 - నిర్యాణం 19 జూలై 200) (జీవితకాలం 93 సంవత్సరాలు)
భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఆంగ్లేయులను ఎదిరించి పోరాడిన వీరవనిత. ఆంగ్లేయులపై ఐదుసార్లు తుపాకిని ప్రేల్చింది. ఐదుసార్లు గురి తప్పింది. తొమ్మిది సంవత్సరాలు కఠిన కారాగార శిక్షను అనుభవించింది. జైలునుండి విడుదలైన తర్వాత 1939లో దాస్ కాంగ్రెస్ పార్టీలో (బెంగాల్) చేరింది. 1942 నుండి 1945 వరకూ మరలా జైలు శిక్ష అనుభవించింది. ఆంగ్లేయులను ఎదిరించడమే జీవిత ఆశయంగా వారితో పోరాడిన వీరనారీమణి. అంతేకాకుండా వారు గొప్ప కవయిత్రి. కథలు, పాటలు (కవితలు) ఎన్నో వ్రాశారు. ఎన్నో అవార్డులు సాధించారు. వీరిని 1984లో నోబుల్ ప్రైజుకు మన ప్రభుత్వం ఎంపిక చేసింది.
4. కల్పనాదత్ :- వీరి జననం 27 జూలై 1913 నిర్యాణం 8 ఫిబ్రవరి 1995 (జీవితకాలం 82 సంవత్సరాలు).
భారత స్వాతంత్ర్య ఉద్యమ కర్త సూర్యసేన్ నేతృత్వంలో సాయుధ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న వీరాంగన. భయం అన్నది ఆమెకు తెలియదు. తన దేశభక్తి పూరిత సంభాషణలతో ఎందరో ఆడవారిలో చైతన్యాన్ని కలిగించింది. తన జీవితాన్ని దేశ స్వాతంత్ర్యం కోసం అంకితం చేసిన మహాత్యాగి. స్వాతంత్ర్యం సిద్ధించేవరకూ నిరంతరం ప్రజల మధ్యన వుంటూ వారిని స్వాతంత్ర్యాభిలాషులుగా మార్చిన స్త్రీమూర్తి. మనకు స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత, వారికి మన గవర్నమెంటు 1979 జూన్ 6వతేదిన్ పూణెలో ’వీర మహిళ’ అవార్డును ఇచ్చి సత్కరించారు. దేశంలో జరిగిన స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న వనితలలో వీరిది ప్రముఖ పాత్ర.
5. ప్రీతిలత :- జననం 5 వ తేది మే 1911 - నిర్యాణం 24వ తేది సెప్టెంబరు 1932 (21సంవత్సరాలు జీవితకాలం)
జననం చిట్గాంగ్. భారత స్వాతంత్య పోరాటంపై చిన్న వయస్సు నుండీ ఆసక్తి. హైస్కూలు చదువు (Chittogram) చిటోగ్రామ్లో మరియు డాకాలో ముగించి పై చదువులకు కలకత్తాకు వచ్చారు. బితుని కాలేజ్‌లో ఫిలాసఫీలో గ్రాడ్యుయేషన్ చదివి ప్రధమ శ్రేణిలో ముగించారు. స్కూలు టీచరుగా ఉద్యోగం ప్రారంభించారు. వారికి నిక్నైంమ్ రాణి. ఆకాలంలో పాలక బ్రిటీష్ వారు వారి పహర్టలి క్లబ్ ముందు కుక్కలు భారతీయులకు ప్రవేశం లేదని బోర్డును తగిలించారు. దాన్ని చూచిన ప్రీతీలత మనస్సుకు ఎంతో ఆవేదన కలిగింది. ప్రీతీలత సూర్యసేన్ స్థాపించిన ఆంగ్లేయులకు వ్యతిరేక సమాజంలో చేరింది. పదిహేను మంది భారతీయ స్వాతంత్యవాదులతో ఆ క్లబ్లో ప్రవేశించింది. ఆయుధాలతో (తుపాకులు) ఇరువర్గాలకు జరిగిన కాల్పులలో ఒక వ్యక్తి (భారతీయుడు) మరణించాడు. పదకొండుమందికి తీవ్రగాయాలు బ్రిటీష్ వారి కాల్పుల వలన ఏర్పడ్డాయి. బ్రిటీష్ పోలీసులు బ్రతికిన అందరినీ పట్టుకొన్నారు. వారి చేతుల్లో చిక్కి చావడం కంటే ఆత్మాహుతి చేసుకోవడం శ్రేయస్కరమని ప్రీతిలత తనకు తానుగా సెనైడ్ త్రాగి (మ్రింగి) వీరమరణాన్ని పొందినది. ఆమెకున్న అపారదేశభక్తి, ఆంగ్లేయుల పట్ల వున్న తీవ్రనిరసనకు ఆమె స్వయంగా చేసుకొన్న సైనెడ్ త్రాగి ఆత్మాహుతి ప్రత్యక్ష సాక్ష్యం. ఆమెది చరిత్రపుటలలో శాశ్వతంగా నిలిచిపోయిన వీరమరణం.
6. బినాదాస్ : జననం 24 జనవరి 1911 (కృష్ణానగర్, బెంగాల్), నిర్యాణం 26 డిశంబర్ 1986 (జీవితకాలం 75 సంవత్సరాలు)
రుషికేస్లో మరణించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. స్వాతంత్ర్య సమరంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటాన్ని సాగించిన వారిలో, నిర్భయంగా ఎదిరించిన వీర వనిత. తనకు 21 సంవత్సరాల వయస్సున బెంగాల్ గవర్నర్‌ను కలకత్తా యూనివర్శిటీలో జరిగిన కాన్ ఒకేషన్ సమయంలో గవర్నర్ (Strnley jarson) ప్రసంగం నచ్చక అతన్ని కాల్చిన వీరవనిత. వీరు (chahatri Sanga) చహత్రీ సంఘం సభ్యురాలు. ఎందరో స్త్రీలకు స్వాతంత్య సమరంలో పాల్గొనేటందుకు ఉత్తేజపరచిన గొప్ప కార్యకర్త. వీరి భర్తగారి పేరు జతిష్చంద్ర భూమిక్. వీరికి ఇరువురు సంతతి. మగపిల్లలు, వారు ప్రేమ్ కిరణ్, కైలాస్. మనకు స్వాతంత్యం సిద్ధించిన తరువాత (1947 ఆగస్టు 15వ తేది) మన గవర్నమెంటు ఆమె సాహసోపేత సత్ సమాజ నిర్మాణానికి చేసిన సేవలకు గౌరవంగా వారికి 1960లో పద్మశ్రీ అవార్డును బహూకరించారు. 26 డిశంబర్ 1986 ఆమె శవాన్ని రోడ్డు ప్రక్కన మార్గాన నడుచువారు గుర్తించారు. పోలీసులకు తెలియజేశారు. ఆ చివరిదశలో వారి ఆ దుస్థితికి కారణం ఏమిటి! విధి బలీయమైనది.
బాలురు మరియు బాలికలారా!.... రెండు రోజులుగా నేను మీకు చెప్పిన మహారాణి పద్మిని, మహారాణి రుద్రమదేవి, కమలాదాస్ కల్పనా దాస్, ప్రీతీలత, బినాదాస్ గొప్ప దేశభక్తులు సమాజోద్దారకులు. వారి దృష్టిలో కులమతాలు లేవు. అందరూ భారతీయులనే పవిత్రభావన. వీరేకాదు... ఇంకా ఎందరో మహనీయులు మనదేశ స్వాతంత్ర్య పోరాటంలో పాలు పంచుకున్నారు. జైళ్ళకు వెళ్ళారు. ఆంగ్ల పోలీసుల చేత లాఠీదెబ్బలు తిన్నారు. కొందరు వారిచేత కాల్చి చంపబడ్డారు. కొందరు ఉరితియ్యబడ్డారు. వారంతా భావి భారత పౌరులైన మీకందరికీ మనందరికీ ఆదర్శమూర్తులు.
ప్రస్తుతంలో మనం సర్వస్వతంత్రులం. దేశంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, బౌద్దులు ఇంకా.... ఎందరో వున్నారు. మన దృష్టి మనకందరికీ వుండవలసినది సమభావన. ఎవరి మతం సిద్ధాంతాలు, నమ్మకాలు వారివి వారికే సొంతం. పరస్పర విమర్శలు తగదు. స్నేహం సౌభ్రాతృత్వాలను మనస్సున వుంచుకొని అందరూ భారతీయులమని భావించి కలసి మెలసి అన్నదమ్ములుగా అక్క చెల్లెళ్ళుగా ఏకతా భావనతో జీవితాన్ని గడపాలి. కుల మార్పులు, ప్రేమ పేరుతో వర్ణాంతర వివాహాలు మత మార్పులు తగదు. తప్పు. అందరినీ సృష్టించింది ఆ సర్వేశ్వరుడనే విశ్వాసం మనందరి హృదయాల్లో వుండాలి. ఐకమత్యంతో జీవితాన్ని సాగించాలి. ఎవరినీ ఏ విషయంలోనూ విమర్శించకూడదు. వ్యక్తిగత ద్వేషం, వ్యతిరేక చర్చ మహాపాపం.... పాతకం. ముఖ్యంగా అతివలను వేధించడం, వారికి బాధను కలిగించడం దానవత్వం. ఈ ప్రపంచంలో ఉండేవి రెండే జాతులు. ఆడ... మగ... ఒకరులేనిదే మరొకరు లేరు. బాలులారా!.... మీరు ప్రతి స్త్రీ మూర్తిని గౌరవించాలి.... ఆదరించాలి..... అభిమానించాలి. వారు ఆపదలో వుంటే చేయకలిగిన సాయం చేయాలి. అది మీ ధర్మం. మానవత్వం. బాలికలారా!.... మీ జీవితంలో మూడు ప్రధాన దశలు.
1. అమ్మి పాత్ర (మీ బాల్యం) పుట్టిన నాటినుంచి వివాహం అయ్యేంతవరకూ ఈ దశ. మీరు పుట్టిన ఇంట అమ్మా, నాన్న సోదరీ సోదరుల ప్రేమానురాగాలతో.... ఆనందంగా గడిచిపోతుంది.
2. వివాహం, పిల్లల అనంతరం పాత్ర అమ్మ: మీ సంతతి వలన మీకు ఆ హోదా (పేరు) లభిస్తుంది. మీ వూరు, ఇంటిపేరూ మారిపోతాయి. పుట్టింట అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, అమ్మా, నాన్నలు మీవారు. అత్తగారి ఇంట అత్తామామలు, బావమరుదులు, బావలు, మరదళ్ళు, వదినలు వుంటారు. మీరు మీ పుట్టింటి వారిని ఏ రీతిగా ప్రేమాభిమానాలతో చూచుకొంటారో, అదే రీతిగా అత్తవారింటి వారిని చూచుకోవాలి. వారి వలన మీరు కొన్ని విమర్శలకు గురి అయినా సహనంతో వారిని గౌరవించి అభిమానించాలి. మీ మంచితనంతో వారిని గెలవాలి. మీ బిడ్డలకు మంచి క్రమశిక్షణతో, వారికి మన దేశ పవిత్ర చరిత్రను మన గొప్ప నాయకుల ఆదర్శాలను, జీవిత విధానాన్ని, త్యాగాలను గురించి చెప్పి నేర్పి వారిని ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదే. అదేరీతిగా భర్తకు కార్యాషు దాసి కరణేసు మంత్రి, భోజ్యేషుమాత, శయనేసు రంభగా అంటే తల్లిగా, మంత్రిగా, (హితుడిగా) మాతగా, ప్రియురాలిగా మీ జీవితాంతం వర్తించాలి. వృద్ధాప్యంలో పరస్పర అవగాహనతో మంచి మిత్రులుగా ఒకరికొకరు సహాయం చేసుకొంటూ దైవచింతనతో జీవితాన్ని ప్రశాంతగా గడపాలి. అత్తామామలను అనాధ ఆశ్రమాల పాలు చేయకూడదు. వారి బిడ్డను వారికి దూరం చేయరాదు. మీరంతా నేడు విద్యార్థులు. బాగా చదివి ఉన్నతులు కావాలి. భావిజీవితంలో మీరు ఎవరెవరూ ఎటువంటి పదవులను, జీవిత విధానాలకు చేరుకుంటారో అది సర్వేశ్వరుల నిర్ణయం. అస్థికతను గౌరవించాలి. అభిమానించాలి. మనవారందరూ సిద్ధాంతాలను అంటే.... సత్యం, ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీ, ప్రేమ, సౌభ్రాతృత్వాలను పాటించారు. వీటన్నింటినీ ఈ వయస్సు నుండే అలవరచుకోవాలి. పాటించాలి.
3. అత్తగారి పాత్ర :- ఈ పాత్ర నిర్వహణ కోడలు ఇంటికి వచ్చాక స్త్రీ జీవితంలో ప్రారంభం అవుతుంది. మీకు కూతురు ఎంతో, మీ అబ్బాయిని వివాహం చేసుకొని అతన్ని నమ్మి తన కన్నవారిని సోదరసోదరీలందరికీ దూరమై మీ ఇంటికి వచ్చిన ఆడబిడ్డను మీ కన్న కూతురులా చూచుకోవాలి. ప్రేమించాలి.... అభిమానించాలి. కూతురికి ఒక న్యాయం, కోడలికి ఒక న్యాయం (వేరు వేరుగా) ఏ ధర్మశాస్త్రాలలోనూ లేదు. వచ్చిన కోడలు అమాయకురాలైతే తనలో తాను ఏడ్చుకుంటుంది. గడుసుదైతే మీ కుమారుడికి మీ గురించి (అత్తగారు) చిలవలు వలవలు చెప్పి, వేరు కాపురాన్ని పెట్టిస్తుంది. అలా పెట్టకలిగిన వ్యక్తి ధన్యుడు. కారణం తన తల్లితత్వం అతనికి చిన్న వయస్సు నుండీ తెలుసు కదా!. కోడలు రాగానే ఆమె తన చెల్లిని చూచేతీరు, భార్యను చూచే రీతిని గురించి, ఆలోచించి ఇటు తల్లికి చెప్పలేక, అటు భార్యను సమర్థించలేక, విడిగా వేరు కాపురం పెడితే రచ్చలు జరగవని ఇరువురి మధ్యన (అమ్మ, ఆలి) తాను నలిగిపోకుండా ప్రశాంతంగా బ్రతకాలనుకొంటాడు. వేరుకాపురం పెడతాను. పోతే అమాయకుడైనవాడు, తల్లిని అతిగా గౌరవించి అభిమానించేవాడు, భార్యకు నచ్చచెప్పలేనివాడు, ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని ఆలోచించకుండా, ఆఫ్ట్రాల్ ఆడమనిషి, నా భార్య కదా అని తన ఇల్లాలిని విమర్శించడం, తిట్టడం, ఇంకా ఆవేశం పెరిగితే కొట్టడం లాంటి చర్యలకు దిగజారిపోతే, ఆ యువతి (అతని భార్య) నేటి కాలంలో దాదాపు చదువు విషయంలో భార్యాభర్తలు సరిసమానం తానూ ఉద్యోగం చేసి సంపాదిస్తున్న కారణంగా ఆ భర్తమీద విసుగు, విరక్తి, ద్వేషం పెరిగి విడాకులకు సిద్ధం అవుతుంది. ఆడవారికి ఆడవారే శత్రువులు కాకూడదు. మంచి మిత్రులుగా శ్రేయోభిలాషులుగా కలిసిమెలసి ఉంటూ, కుటుంబాన్ని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుకోవాలి. ఈ అత్తపాత్ర చాలా క్లిష్టమైనది. కూతురిలా కోడలిని చూచుకోవాలన్న గొప్ప మనస్సు ఆ అత్తపాత్రకు అతి ముఖ్యం. అప్పుడే ఆ సంసారంలో అందరూ కలిసి ఆనందంగా జీవించగలరు." మేడంగారు చెప్పడం ఆపేశారు. చేతి వాచీని చూచారు.
"బాల బాలులారా!.... మీ అందరి భవిష్యత్తు బాగుండాలని, మీరు మీ సాటివారి మన్ననలను పొందాలని, మీ జీవన యాత్రను ఆనందమయంగా సాగించాలని ఇదంతా మీకు చెప్పాను. రేపు ఆదివారం శలవు. ఎల్లుండి సోమవారం నుండి ఫైనల్ పరీక్షలు.... బాగా చదవండి. పరీక్షలన్నింటినీ బాగా వ్రాయండి. మంచి మార్కులతో ఉత్తీర్ణులు కండీ. మీ అందరికీ నా శుభాశీస్సులు" నవ్వుతూ ముగించారు సుమలతా శర్మగారు. లాంగ్ బెల్ గంట మ్రోగింది.
తెలుగు ప్రధాన పండితులు, ఉభయ భాషా ప్రవీణులు సుమలతాశర్మగారు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థుల గదినుండి బయటికి వచ్చి నడిచారు.
పిల్లలందరూ.... పుస్తకాలను సర్దుకొని క్లాస్ రూం నుండి బయటికి వారి వారి ఇండ్లకు బయలుదేరారు.
*
సమాప్తి
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Yorumlar