'Amulyamaina Kanuka' - New Telugu Story Written By Mohana Krishna Tata
'అమూల్యమైన కానుక' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
"ఒరేయ్ రఘు! నీ పుట్టిన రోజు కదరా!.. వచ్చే గురువారం.. "
"అవును.. " అన్నాడు రఘు.
"నేనైతే.. నా పుట్టినరోజు కి అందరికి పెద్ద చాక్లెట్లు పంచాను.. నువ్వు ఇంకా పెద్దవి ఇవ్వాలి రా!.. " అన్నాడు రాము.
"ఏమో రా.. తెలియదు.. అందరికి ఉపయోగ పడేదే ఇద్దామనుకుంటున్నాను"
మర్నాడు సైన్స్ క్లాస్ లో.. మాస్టారు క్లాస్ తీసుకుంటున్నారు..
"పిల్లలూ!.. చెట్లు మనకు రెండు ముఖ్యమైన అవసరాలను.. ఆహారం మరియు ఆక్సిజన్ ఇస్తాయి. మొక్కలను పెంచడం వల్ల మనం తిరిగే ప్రతి ప్రాంతంలో కూడా మెరుగైన ఆక్సిజన్ వస్తుంది. ఎండాకాలంలోనూ.. వర్షాకాలంలోనూ.. చెట్లు చల్లని నీడను అందిస్తాయి.
కాబట్టి ఎక్కువ చెట్లను నాటడం వల్ల.. గాలి క్లియర్ అయ్యి.. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం తగ్గుతుంది. అందరికి అర్ధమైందనుకుంటాను.. అందరు మొక్కలు నాటండి..” అని చెప్పి మాస్టారు క్లాస్ ముగించారు..
రఘు పుట్టినరోజు నాడు..
"రఘు! నీ క్లాస్ లో పంచడానికి.. చాక్లెట్లు కొనడానికి డబ్బులు కావాలా?"
"డబ్బులు కావాలి.. కొంచం ఎక్కువ కావాలి అమ్మా!.. "
"అలాగే.. తీసుకో.. నువ్వు ఏది చేసినా ఆలోచించే చేస్తావు.. " అంది తల్లి
క్లాస్ లో అందరికీ పెద్ద కవర్ పంచుతున్నాడు రఘు.
మనకి చాక్లెట్లు ప్యాకెట్ ఇస్తున్నాడేమో!.. అనుకున్నారు క్లాసుమేట్స్. అందరూ బర్త్ డే విషెస్ చెప్పారు..
కవర్ ఓపెన్ చేసి చూస్తే.. కుండీ లో మొక్క..
"మొక్క ఏమిటి రా?.. తినడానికి రాదు.. ఏమి చేసుకోవాలి చెప్పు.. " అడిగాడు రాము.
"మొక్కల గురించి మాస్టారు చెప్పింది వినలేదా.. ? మొక్కలు పెంచడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నోయో విన్నారు కదా!. మీరందరు మొక్కల పెంచి.. అందరికి ఉపయోగపడాలి.. అదే మీరు నాకిచ్చే కానుక.."
రఘు మొక్కల పట్ల.. ఎన్విరాన్మెంటు పట్ల.. చాలా శ్రద్ధ తో, బాధ్యతతో.. అనేక మొక్కలు నాటాడు. చాలా మంది చేత ఎన్నో మొక్కలు నాటించాడు.
***
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు తాత మోహనకృష్ణ
Comentarios