'Premante Idena Part 9' - New Telugu Web Series Written By Penumaka Vasantha
'ప్రేమంటే ఇదేనా! పార్ట్ 9' తెలుగు ధారావాహిక
రచన, కథా పఠనం: పెనుమాక వసంత
జరిగిన కథ:
తన ఫ్రెండ్ పద్మ పెళ్ళిలో ఆనంద్ ని చూస్తుంది విరిజ.
వైజాగ్ లో ఎం ఏ చేరడానికి వెళ్తుంది. ఆనంద్ వైజాగ్ లో బ్యాంకు లో పనిచేస్తుంటాడు. విరిజకి సహాయం చేస్తుంటాడు.
తన మనసులో ఒక అమ్మాయి ఉన్నట్లు చెబుతాడు ఆనంద్. ఆనంద్ ప్రేమించేది తననే అని రాజీ ద్వారా తెలుసుకుంటుంది విరిజ. తన ఆర్ధిక పరిస్థితి ఆనంద్ కి వివరిస్తుంది విరిజ. తనకు అన్ని విధాలా సహకరిస్తానని చెబుతాడు ఆనంద్. జ్వరంతో ఉన్న ఆనంద్ ని హాస్పిటల్ కి తీసుకోని వెళ్తుంది విరిజ.
ఆనం తన పేరెంట్స్ తో విరిజ వాళ్ళ ఇంటికి వస్తాడు.
ఇక ప్రేమంటే ఇదేనా! పార్ట్ 9 చదవండి
పెళ్లి ముహూర్తం ఫిబ్రవరి పదునాలుగు రాత్రి నిశ్చయం అయింది. లగ్న పత్రిక, రాసుకునే రోజు, చిన్న ఫంక్షన్, నాన్న ఏర్పాటు చేశాడు. ఆ ఫంక్షన్కు అక్క, బావ, వచ్చారు. బావ, మొహం మాడ్చకునే ఉన్నాడు. ఆనంద్ వెళ్ళి, "హలో!" అని పలకరించినా! ఏదో ముక్తసరిగా, " హలో" అన్నాడు.
ఆనంద్ వాళ్లకు, నాన్న ఏమి కట్న, కానుకలు, ఇస్తున్నాడో! తెల్సుకోవటానికి, వచ్చాడు బావ. ఆనంద్, వాళ్ళు, మేము, ఫ్రెండ్స్ లాగా, ఉండటం చూసి, మొహం, తిప్పుకుని ఫంక్షన్ అవ్వగానే, వెళ్ళాడు. పోనీలే, ఫంక్షన్ కు వచ్చాడనీ! మేమందరం, హాపీ గా ఫీల్ అయ్యాం.
ఈలోపు నిదానంగా పెళ్లి పనులు మొదలెట్టారు అమ్మా, ఆనంద్ అమ్మ గారు.
ఇక పెళ్లికి మూడు నెలల టైం మాత్రమే ఉంది. ఈలోపు పెళ్లికి షాపింగ్ చేయమని అమ్మ వాళ్ళు ఆనంద్ కు డబ్బులు ఇస్తే ఆనంద్ అమ్మ వాళ్ళు నాకు చీరలు నగలు కొనమని ఆనంద్ కు చెప్పారు.
నేను ఆనంద్ కి ప్యాంట్, షర్ట్లు కొనేట్లు ఆనంద్ నాకు చీరలు, నగలు షాపింగ్ చేసేట్లు ఒప్పందం చేసుకున్నాము. నేను ఆనంద్ ఒక రోజంతా షాపింగ్ చేసాము. నాకు బాగుండే కలర్స్ పట్టు చీరలు సెలెక్ట్ చేసాడు. నగలు కూడా నా కిష్టమైన హారం, నల్లపూసలు కొన్నాడు.
నేను ఆనంద్ కు ఒక సూట్, రెడిమేడ్ ప్యాంట్ షర్ట్స్ కొన్నాను. ఆరోజు బయట హోటల్ లో తిన్నాము. ఈవెనింగ్ ఇంటి దగ్గర దింపి నైట్ డిన్నర్ చేసి వెళ్లాడు.
"విరి నేను చాలా లక్కీ నువు దొరకటం నా చేయి పట్టుకుని అన్నాడు" ఆనంద్.
నేను ఆ చేతి మీద చెయ్యి వేసి "నువ్వు కాదు నందూ! నేను లక్కీ. ఎందుకంటే ఎంతో మంది మగవాళ్ళను చూసాను. ఆడవాళ్ళను వాళ్ళు ఆటబొమ్మలు గా చూడటం. ఇవి చూసాక నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ పోయింది. అదీ కాకుండా మా, సుమక్క, ఇంకో ఫ్రెండ్, ప్రేమలో మోసపోయి సూసైడ్ చేసుకున్నారు.
"నేను ఇక పెళ్లి చేసుకోకుండా మా అమ్మనాన్నలను చూసుకుంటూ! నా జీవితాన్ని గడుపుదామనుకున్నా. కానీ! అబ్బాయి గారు పట్టు వదలని విక్రమార్కుడు లాగా పట్టుపట్టి నన్ను పెళ్లి చేసుకుంటున్నారుగా. అవును నాతో చెప్పొచ్చుగా డైరెక్ట్ గా నేను నచ్చానని" అన్నాను ఆనంద్, తో.
"ఎన్నిసార్లు నా మనసులో మాట ఇదని చెప్దామని ట్రై చేస్తే నువ్వు మాట్లాడకుండా సీరియస్ గా వెళ్లేదానివి. మా అత్త వాళ్లు వాళ్ల పిల్లను చేసుకోమని ఒక వైపు.. నువ్వు జాబ్ రావాలి ఇపుడే పెళ్లి చేసుకోనని ఒక వైపు ఏమి చేయాలో.. తెలియక మీ ఫ్రెండ్ రాజీ తో మన పెళ్ళి గూర్చి మాట్లాడమని చెప్పాను" అన్నాడు ఆనంద్.
"నేను మీరు నా పేరు కాకుండా ఇంకెవరో పేరు చెప్తే వినలేననీ వెళ్ళేదానిని అంతే కానీ ఇష్టం లేక కాదు. "
నా బుజం మీద చెయ్యి వేసి అయితే "రాణి గారు నేను ఇంకొకరిని ప్రేమిస్తే తట్టుకోలేరన్న మాట" అంటూ ఆట పట్టించాడు ఆనంద్.
"ఇదే.. విరి ప్రేమంటే, ప్రేమ ఎంత మధురమో! ఇపుడర్థం అయిందా. ఇంకా ప్రేమంటే ! అని క్వశ్చన్ మార్క్? ఫేస్ పెడతావా బుడ్డిస్. భలే గా మన పెళ్లి డేట్ కూడా ప్రేమికుల దినోత్సవం నాడు కావటం నాకు హ్యాపీ గా ఉంది" అన్నాడు ఆనంద్.
"నాకు తెలుసు ప్రేమంటే కాని అవి సినిమాల్లోనే అలా ఉంటాయి. కానీ నిజ జీవితం లో అంతగా అవి సఫలం అవ్వవనీ! నాన్న చెప్పే వారు. ముందు చదువును, జాబ్ ను ప్రేమించండనేవారు నాన్న. అవి నాలో బలంగా నాటుకుపోయాయి అంతే కాని.. నాకూ ప్రేమ విలువ తెలుసు చిన్ని బాబు అని వేళాకోళం ఆడాను. సరే కబుర్లు చెప్పుకుంటుంటే తెల్లారుతుంది కానీ! ఇక పద నందూ!" అంటూ ! స్కూటర్ దాక తోసుకెళ్ళాను ఆనంద్ ను.
ఇక గాజులు, బ్లౌజ్ లు లాంటివి రాజీ నేను కలసి చేశాము. సండే ఆనంద్ వచ్చి వెళ్తున్నాడు. పెళ్లికి పదిహేను రోజుల ముందు లీవ్ పెట్టీ ఊరికి వెళ్ళాను.
రాజీ పెళ్లికి ఒక నాలుగు రోజుల ముందు వస్తానంది. పద్మకు కూడా చెప్పాను. పద్మ, "ఆనంద్ మా ఆయన ఫ్రెండ్ కాబట్టి నేను మగపెళ్ళి వారి, తరుపున వస్తానంది. "
మా ఊరి లోనే పెళ్లి కాబట్టి నాన్న ఇంటిముందు తాటాకు పందిరి వేయించటం అన్ని ఏర్పాట్లు చేయిస్తున్నారు. అమ్మ, బామ్మ సలహాతో పెళ్లి ఏర్పాట్లు చూస్తున్నారు. పక్కనున్న చిన్న టౌన్ లో ఆనంద్ వాళ్ల విడిది హోటల్ లో ఏర్పాటు చేశారు నాన్న.
పదునాలుగు పొద్దునకల్లా ఆనంద్ వాళ్ళు హోటల్ చేరారు. రెడ్ రోజేస్ ఉన్న బంచ్ ఒకటి, చిన్న లెటర్ రాసి పెట్టీన ఒక పాకెట్, వాళ్ల ఫ్రెండ్ ద్వారా నాకు పంపాడు.
"అబ్బా! త్వరగా తీయవే పాకెట్" రాజీ నసపెడుతుంటే ఓపెన్ చేశాను. దానిలో "డియర్ విరి బుడ్డి! ప్రేమ ఎపుడూ! అంతా మధురమే. నా ప్రేమ హృదయలోకం లోకి మనసారా.. నీకు స్వాగతం" అని రాసి ఉంది.
"ఏమి రాసి ఉందే దానిలో" అన్న రాజీ తో "లెటర్ మటుకు చూపను సీక్రెట్" అదన్నాను.
"అబ్బో!చూపెట్టక.. దాచుకో తల్లి" అని ఆట పట్టించింది రాజీ.
పెళ్లికి, అక్క ఒక్కతే వచ్చింది, బావగారు, రాలేదు.
'పెళ్లి ఘడియలు దగ్గర పడుతున్న కొద్దీ మనసులో దిగులు. ఇన్నాళ్లు అమ్మానాన్న దగ్గరున్న నేను అత్తవారింటికి వెళ్ళటం. ఇప్పటి నుండి నేను పూర్తిగా ఆడ.. పిల్లను కదా! అనే ఫీలింగ్ తలచుకుంటే ఒకటే బాధగా ఉంది. '
అమ్మానాన్న నా ఫీలింగ్స్ అర్థం చేసుకుని "లేదమ్మా! "ప్రతి ఆడపిల్ల ఇలాంటి పరిస్థితిని ఎదురుకోవాల్సిందేనీ! ఊరడించటం"వల్ల కాస్త తెరిపిన పడ్డాను.
పెళ్లి అయిపోయి అత్తవారింటికి వెళ్తుంటే ఏడుపు ఆగలేదు. ఇన్నాళ్లు పెరిగిన ఆ ఊరినీ అమ్మ, నాన్న ను వదిలిపోతుంటే ఆడపిల్లగా పుట్టకూడదనిపించింది మొదటిసారి.
ఆనంద్, వాళ్ల అమ్మ దైర్యం చెప్పి కారు ఎక్కించే వరకు నాకు ఏడుపు ఆగలేదు. నాన్న వచ్చి, ఆనంద్, అమ్మగారితో, "మా అమ్మాయినీ! మీ చేతిలో, పెడుతున్నా, జాగ్రత్త, చెల్లెమ్మా", అంటూ, కంట నీరు, పెట్టుకున్నారు. నాన్న, ఏడుపు, చూసి, నాకు ఏడుపు వచ్చింది. నేను, ఏడుస్తుంటే, ఆనంద్, సౌమ్య, ఊరడిం చారు.
బామ్మ, అమ్మ, , అక్క వాళ్ళు కళ్లనీళ్ళు తుడుచుకొంటు నన్ను సాగనంపారు అత్తారింటికి. ఆనంద్ అమ్మ గారు, ఒకప్పుడు, నేను ఈ పరిస్తితినీ! ఎదుర్కొన్నదాన్నే, అంటూ, నా భుజం, పై చెయ్యివేస్తూ, నడిపించుకుంటూ, కారు దాకా, తీసుకెళ్లారు.
నా ప్రేమ కథకు ఫిబ్రవరికి చాలా సంబంధం ఉంది కదా. ముఖ్యం గా వాలెంటైన్స్ రోజు జరగటం మా పెళ్లి ఇద్దరికీ ఆనందం, కలిగించింది.
ఇటూ అటు, మూడునిద్రలు అవ్వగానే, మేము హనీమూన్, ఊటీ, కొడైకెనాల్ కు వెళ్ళాము. ఈ వారం లోనే, ఆనంద్ వి ఎంత మంచి భావాలో తెల్సి వచ్చింది. నన్ను, ఎంతో, అపురూపంగా చూసుకుంటున్నాడు.
ఒక రోజు అడిగాను, "ఆనంద్, నువ్వు ఇపుడు చూపిస్తున్న ఈ ప్రేమను జీవితాంతం, నాపై కురిపిస్తావు కదూ!"
"ఇపుడు నువ్వు నాలో సగభాగం, పెళ్లి, నాటి ప్రమాణాలలో, ఏమి చెప్తాం, జీవితాంతం, కష్టసుఖాల్లో ఇరువురం, పాలుపంచుకుంటామని. మరి నిన్ను మధ్యలో, ఎలా, వదిలేస్తాను, !?. ఇలాగే, ఎప్పటికీ, నిన్నూ ప్రేమిస్తూనే ఉంటా, ప్రామిసంటూ!" నా నుదుటి మీద ముద్దు పెట్టాడు.
" థాంక్స్ నందూ" అనీ! ఆనంద్ ను ప్రేమతో అల్లుకుపోయాను. ఇక నాకు జీవితం లో ఏవి వద్దూ, ఒక్క నువ్వుంటే, చాలనుకుంటూ, తృప్తిగా, కళ్ళు మూసుకున్నా.
హనీమూన్ అయిపోయి, హైదరాబాద్, చేరుకున్నాము. అప్పటికే, ఆనంద్ డబుల్ బెడ్ రూం హౌస్ తీసుకున్నాడు. అమ్మా, ఆనంద్ అమ్మగారు, మా ఆడపడుచు, సౌమ్య వచ్చి, పాలు పొంగించి, వెళ్ళారు. ఒక పది రోజులు ఉండమంటే, మీ మధ్య, మేమెందుకులే, పానకంలో పుడకల్లాగ అంటూ, సౌమ్యా, మా ఇద్దరినీ, ! ఆట, పట్టించింది. అమ్మా వాళ్ళు, ఒక నాల్గు, రోజులుండి, వెళ్ళారు.
నేను, ఆనంద్, లీవ్, అయిపోయి, ఆఫీసులకు, వెళ్తున్నాం. ఈవెనింగ్, ఆనంద్ వచ్చి, స్కూటర్, పై, నన్ను, తీసుకుని వెళ్తాడు. మార్నింగ్ నన్ను ఆఫీస్, దగ్గర, డ్రాప్ చేసి వెళ్తాడు. తన, స్కూటర్, నాకిచ్చి, ఆనంద్, బుల్లెట్, తీసుకున్నాడు. నాకు స్కూటీ, నడపటం, వచ్చి కాబట్టి, ఆనంద్, స్కూటర్, ను నడుపుతున్నా హాయిగా.
ఒకరోజు, నాన్న, కాల్ చేసాడు. బావ, పొలం అమ్మి, డబ్బులు, ఇవ్వమంటున్నాడు. నేను ఇపుడు కాదన్నాను"
"వద్దూ నాన్న, పొలం అమ్మవద్దన్నాను. " మరి ఎట్లా తల్లీ! అక్కను, ఏడిపించుకు, తింటున్నారన్నాడు. "
"అక్కను, వెళ్ళి, ఇంటి, తెచ్చేయి. నేను, వస్తున్నాను, ఏదోకటి, చేద్దామన్నాను. "
"నేనూ, రానా! ఆన్న ఆనంద్ తో, లేదు, నేవెళ్లి, వెంటనే, వస్తానని" బయలుదేరాను. "నువ్వు లేకుండా, నేను, ఉండలేను, విరి" అంటూ, నన్ను, దగ్గరకు లాక్కున్నాడు.
"లీవ్ కూడా, లేదు, ఒక్క రోజే కదా! ఎల్లుండి కంతా వచ్చేస్తాను. "
పొద్దున, ఇంటికి వెళ్లే సరికి, ఇంటి ముందు జనం, ఏంటో, అపశకునం గా అనిపించి, ఇంట్లో కి నడిచాను. "రామ్మ విరిజా! అక్క ఎంత, పనీ చేసిందో! రాత్రి, వురి వేసుకుని చనిపోయిందని, అమ్మ ఏడుపు. అక్క శవం, అత్త గారింట్లో ఉంది. నీకు ఫోన్ చేస్తుంటే స్విచ్ఛాఫ్, వచ్చింది.
కారు, మాట్లాడుకుని, పక్కనే, ఉన్న అక్క వూరెళ్ళాము. అక్క ఇంటికెళ్ళేసరికి, అక్కను బయట వరండాలో, పడుకోబెట్టారు. పాప, దివిజ, అమ్మ మీద, పడి, ఏడుస్తుంది. నాకు అక్కను, చూడగానే ఎడుపుఆగలేదు. "ఎలా జరిగింది ఇది, మా అక్కను చంపావు కదరా!" అని నేను ఆవేశంగా హరి చొక్కా, పట్టుకున్నాను.
విరి, "నో అంటూ, " ఆనంద్, ఎపుడూ వచ్చాడో, నన్ను పట్టుకుని, అవతలకు, తీసుకెళ్ళాడు.
"ఆనంద్, వచ్చావా, , ! మా అక్కను, చంపారు, వీళ్ళు డబ్బుకోసం, అది వురేసుకునెంత పిరికిది, కాదు. వీళ్లందరి మీద, డౌట్ అంటూ" పోలీసులకు, కాల్ చేశాను.
పోస్ట్ మార్టం లో తలకు బాగా దెబ్బ తగిలి చనిపోయింది. కానీ హరి వాళ్ళు, వురేసి తనే పోయినట్లుగా, చిత్రీకరించారు.
తర్వాత, తెలిసింది ఏమిటంటే, మీ నాన్న, వాళ్ళు, నీకు, ఆస్తి, ఇవ్వరు, మొత్తం, మీ చెల్లెలుకు ఇస్తారు. వెళ్ళి, నీకు, వచ్చేబాగం, అమ్ముకు రమ్మంటే, నేను అడగను అందిట. మీ నాన్నకు కాల్ చేస్తే, ఇపుడు కాదన్నాడు. మీకు నేను ఎట్లా, కనపడుతున్నానని, హరి అక్కను ఒక్క తోపు తోసేసరికి, డబులకాట్, అంచుకు, తల బలంగా తగిలి, ప్రాణం పోయింది. వెంటేనే దాన్ని.. వురేసుకున్నట్లుగా, చిత్రీకరించారు.
అక్క దహన సంస్కారాలు అయిన తర్వాత, పాపను తీసుకుని అమ్మ వాళ్ళింటికి వచ్చాము
పోలీసులు, హరిని, గృహహింస చట్టం కింద, అరెస్ట్ చేశారు.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పెనుమాక వసంత గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్. మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.
Comments