top of page

అనగనగా ఓ ప్రేమ కథ


'Anaganaga O Prema Katha' New Telugu Story


Written By N. Dhanalakshmi


(ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

ఊహ తెలిసినప్పటి నుంచి నేను కోరుకున్న నా ప్రేమ, నేను కోరుకున్న జీవితాన్ని ఈ రోజు అందుకుంటున్నా. ఇంకో గంటలో నా బావకి నేను సొంతం కాబోతున్నా.

‘ఐ లవ్ యూ’..

‘ఈ మాట నా నోట వినాలని చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నావుగా.. నేను నీ సొంతం అయిన మరుక్షణం ఈ మాట చెపుతాను’ అంటూ అద్దంలో తనని తాను మరొకసారి చూసుకొని మురిసిపోతుంది రచన...

తలుపు చప్పుడు అవ్వడంతో వెళ్ళి తీసిన రచన మొహం పై ఏదో పడింది.. అంతే మరుక్షణం తన ఆర్తనాదాలు విని కళ్యాణమండపం నుండి రెస్ట్ రూం వైపుకి చేరుకున్నారు బంధుగణం..

‘అమ్మా.. మంట మంట... బావ.. బావ..’ అని ఏడుస్తున్న రచనను చూస్తూంటే అక్కడున్న వారికి కడుపు తరుక్కుపోతుంది..

రవి తనని తాను కంట్రోల్ చేసుకొని “రచనా! ఏమీ కాదు. భయపడకు” అంటూ తనని ఎత్తుకుని కార్లో కూర్చోపెట్టుకొని దగ్గర్లోనున్న హాస్పిటల్ కు తీసుకొని వెళ్ళాడు.

రచన మొహం ఓ పక్క కొంత భాగం కాలిపోయింది.

“అదృష్టం బాగుండి కళ్ళలో ఏమీ పడలేదు. మెడిసిన్స్ వాడుతూ తగిన స్కిన్ కేర్ తీసుకుంటే తను త్వరగా క్యూర్ అవుతుంది.. తను చాలా భయపడుతుంది..”

అని డాక్టర్స్ చెప్పి వెళ్ళి పోయారు...

ప్రాణాపాయం తప్పినందుకు అందరు సంతోషపడ్డారు.

రెండు రోజుల తరువాత మెలకువ వచ్చిన రచన

ఎదురుగా ఉన్న తన బావను చూస్తూ మొహం పక్కకు

తిప్పేస్తు "బావ.. నువ్వు ఇంకో పెళ్ళి చేసుకో. నా లాంటి కురూపి నీ పక్కన బాగోదు” అంటున్న రచన మాటలకు అడ్డు కట్ట వేస్తూ తన పెదవులు అందుకుని ముద్దు పెట్టాడు రవి.. అందులో కోరిక లేదు. నీకు నేనున్నా అనే భరోసా మాత్రమే ఉంది..

“పిచ్చి దాన.. నీ సోయగం చూసి కాదే నేను పడిపోయింది. ఏమి చూసి నీకు నేను దాసోహం అయ్యానో తెలుసా..

ఇంట్లో ఒక్కరికే చదివించే స్తోమత ఉంది అని మీ చెల్లి కోసం నీ భవిష్యత్తుని వదులుకున్నావ చూడు.. అక్కడ నీ బాధ్యత నచ్చింది.

ఫోన్ ద్వారా అల్లికలు, కుట్లు నేర్చుకొని నేడు మన ఊరిలో చిన్న షాప్ పెట్టీ నీతో మరో ఐదుగురికి ఉపాధి కలిగించావు చూడు.. అక్కడ నీ తెలివితేటలు నచ్చింది.

మా అమ్మకి ఆరోగ్యం బాగాలేక ఇబ్బంది పడుతుంటే అమ్మలా దగ్గరుండి చూసావు చూడు.. ఆ మనసుకి పడిపోయాను.

నాకు ఏక్సిడెంట్ అయి చావు బ్రతుకుల మధ్య ఉంటే నన్ను బ్రతికించి నాకో మరో జన్మనిచ్చావు. ఇదిగో నీ ముందర ఇలా నిలబడేలా చేశావు.. నీ లాంటి అమ్మాయికి ఎవరైనా దాసోహం కాకుండా ఉంటారా చెప్పు!??”

“అది కాదు బావ..” అంటున్న రచనకు మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మెడలో తాళి కట్టేసి నుదుటిన సింధూరం దిద్ది, “ఐ లవ్ యూ మిసెస్ రచన రవి” అని పిలిచి ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టి తన చేతిని పట్టుకొని “ఈ క్షణం నువ్వు నా భార్యవి అర్థమైందా…” అన్నాడు.

రచన ఏడుస్తూ " ఐ లవ్ యూ బావ" అంది.

“ఇంకో సారి చెప్పవే…”

“ఐ లవ్ యూ రా బావ…”

“ఐ లవ్ యూ..... ఈ మాట కోసం ఎంత తప్పించానే..

“కానీ నేను ఈ మాట ఇలా చెపుతాను ఎప్పుడు అనుకోలేదు బావ…”

పోలీసుల నుండి ఫోన్ రావడంతో “నువ్వు రెస్ట్ తీసుకో. నేను ఇప్పుడే వస్తాను” అంటూ బయటకి వెళ్ళి ఫోన్లో మాట్లాడి ఇంట్లో వారికి చెప్పి స్టేషనుకి చేరుకున్నాడు..

సెల్ లో ఉన్న ఖైదీని చూసి ఒకింత షాక్ అవుతూ

“మీరు మా అత్తయ్య వాళ్ళ ఇంటి పక్కన ఉంటారు. మీ పేరు కూడా తెలియదు. తనని ఎందుకు అరెస్ట్ చేశారు సర్..”

"శాంతి తన పేరు. మీ కాబోయే భార్య పై దాడి చేసిందే తానే. కావాలంటే మీరు చూడండి” అంటూ వీడియోలో రికార్డ్ అయిన దృశ్యాలను చూపించాడు ఎస్ ఐ..

ఫేస్ మాస్క్ వేసుకొని లోపలికి వచ్చిన శాంత పెళ్ళి మండపంలో జరుగుతున్న తంతును చూస్తూ రచన డ్రెస్ మార్చుకొని రెస్ట్ రూంలోకి వెళ్ళడం చూసి తనని ఫాలో చేయడం కనపడింది.. ఆ తరువాత బయటకి వెళ్తూ బయట డ్రోన్ కూడా వీడియో రికార్డ్ చేస్తున్న

విషయాన్ని మరిచి మాస్క్ తీసేసి వెళ్ళిపోయింది..

“నా రచన మీకేమి అపకారం చేసిందని ఇంతటి దారుణానికి ఒడిగట్టారు…”

“ఏమి చేయలేదని అడగండి !!??

చిన్నప్పటి నుంచి తనని చూసి నేర్చుకోమని ఇంట్లో ఒక్కటే గొడవ. నాకు చదువు సరిగ్గా అబ్బకపోతే నేనేమీ చేయగలను.. నేనొక పనికిమాలిన దాని కింద జమకట్టి తిట్టేవారు..

ఇంట్లో ఎంత పని చేస్తున్నా సరే రచనతో పోలిస్తూ చూస్తూ ఏదొకటి అంటుండేవారు. తన కొత్త రకం వంట చేస్తే సైలెంట్ గా ఉండచ్చు గా లేదే ఏమి చేసినా ఇదిగోండి పిన్ని గారు అంటూ తెచ్చి ఇచ్చేది. అది చూసి మా అమ్మ రచన వంటలతో పోలిస్తూ నన్ను తిట్టేవారు.. నేను ఎంత బాగా చేసిన సరే ఆ మాట అంటుంటే ఎట్లా ఉంటుందో రూంలో కూర్చుని ఎంత ఏడ్చో దానినే తెలుసా!!

ట్రైలరింగ్ నేర్చుకొని ఇంట్లో కుట్టేదానిని.. ఊరిలో అందరు నా దగ్గరికే వచ్చేవారు. నాకంటూ సంపాదన మొదలయింది.. దానికి కూడా అడ్డు పడింది రచన

తను ఎప్పుడైతే కొత్త కొత్త డిజైన్స్ కుట్టడం మొదలు పెట్టిందో అప్పటినుంచి నా దగ్గరికి జనాలు రావడం తగ్గింది. నాన్న నేనొక పనికిమలిన దాని కింద నన్ను జమ కట్టడం మొదలు పెట్టారు.

వచ్చిన పెళ్ళి కొడుకుకి నేను నచ్చకపోవడం నా తప్పు కాదే.. అదే సమయంలో రచన మా ఇంటికి వచ్చి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చింది. ఇంకా ఏముంది అక్కడ కూడా నన్ను పోల్చడం మొదలు పెట్టారు. ఇంకా తట్టుకోవడం నా వల్ల కాలేదు అందుకే తన మొహాన్ని కాల్చి తను జీవితాంతం బాధ పడేలా చేయాలని ఈ పని చేశాను.

ఇప్పుడు ఆ కురుపిని ఎవరు పెళ్ళి చేసుకోరు. అది ఇంకా పై ఏ పని చేయలేదు. “

ఎస్ ఐ, రవితో పాటుగా తమ కూతురు కోసం వచ్చిన శాంత అమ్మ, నాన్న కూడా విన్నారు. వారి మాట శాంత పై ఎంతటి ప్రభావం చూపించదో చూసి బాధ పడుతూ ఏడుస్తూ వెళ్ళిపోయారు..

“ఎంత ఈర్ష, ద్వేషం ఉంటే ఇలా చేయడం తప్పు. దీనికి నువ్వు తప్పకుండ శిక్ష అనుభవించి తీరాలి..”

“పర్లేదు సర్.. ఆ రచన ఇంకా పై జీవితాంతం బాధ పడుతుంది. అది చాలు నాకు..”

“నేనుండగా నా రచనకి బాధ దరి చేరదు.. నీకో విషయం తెలుసా? మేము పెళ్ళి చేసుకున్నాము. తనతో ఏ పని చేసినా నేను తోడు ఉంటాను. నీ లాంటి వారికి ఇదే సరైన చోటు” అంటూ శాంత వైపు అసహ్యంగా చూసి వెళ్లిపోయాడు రవి...

“పెళ్ళి చేసుకున్నా సరే.. తన మొహాన్ని తాను చూస్తూ ప్రతి క్షణం నరకం అనుభవిస్తుంది’ అని వికృతంగా నవ్వుతుంది శాంత..

కాలంతో పాటు రవి ప్రేమ రచనను మాములు మనిషిని చేసింది. తన టైలరింగ్ పనిని మరింతగా హుషారుగా చేయడం మొదలు పెట్టింది.

రవి, రచన ప్రేమకి గుర్తుగా కవలలు పుట్టారు. వారికి

ఉజ్వల్, ఉజ్వల పేర్లు పెట్టారు.. వారి అల్లరి కేరింతలతో వారి జీవితం ఆనందంగా కొనసాగుతోంది...

***శుభం***


N. ధనలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Twitter Link

Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత్రి పరిచయం :

నమస్తే. నా పేరు ధనలక్ష్మి. వృత్తి రీత్యా ప్రైవేట్ స్కూల్లో గణితం బోధిస్తాను. మాది మదనపల్లి, చిత్తూర్ జిల్లా. కథలు , కవితలు రాయడం నాకు ఇష్టమైన వ్యాపకం. ఆనందం వేసినా, బాధ వేసినా, కోపం వచ్చినా నేను పంచుకునే నా నేస్తం అక్షరం. నాలో మెదిలే భావాలను, నేను చూసిన సంఘటనలను రాయడం నాకు అలవాటు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ యువ రచయిత్రి బిరుదు పొందారు.









88 views0 comments
bottom of page