top of page
Original.png

నాన్నా...!

Aug 6
1 min read

కూతురు కోసం జీవితమంతా త్యాగం చేసిన తండ్రి ప్రేమను ప్రతిబింబించే భావోద్వేగ దృశ్యం.

Nannaa - Telugu Emotional Poetry | Anagha

నాన్నా తెలుగు భావోద్వేగ కవిత| అనఘ

Published in manatelugukathalu.com on 06/08/2026


"నాన్న" అనే పదంలోనే ప్రేమ, బాధ్యత, త్యాగం, మౌనం అన్నీ దాగి ఉంటాయి. తండ్రి జీవితాంతం కుటుంబం కోసం పడే కష్టం చాలా సార్లు కనిపించదు, కానీ ప్రతి విజయానికి ఆయన త్యాగమే పునాది. రచయిత అనఘ రచించిన "నాన్నా" కవిత ప్రతి తండ్రి హృదయాన్ని ప్రతిబింబించే భావోద్వేగ గీతం. తండ్రి ప్రేమను కొత్త కోణంలో చూపించే ఈ తెలుగు కవిత ప్రతి పాఠకుడి మనసును తాకుతుంది.


కనిపించని కష్టం నాన్న

వినిపించని ఇష్టం నాన్న

మాటలొచ్చిన మౌనం నాన్న

ప్రేమను పంచె కోపం నాన్న

అర్థం కాడనుకుంటాము

అర్థం చేసుకోలేక మనము

మనసే లేదనుకుంటాము

నిన్ను ఒంటరిని చేసేసాము

గుండెలపై ఆడిస్తావు

గుండెబలమై నిలుస్తావు

భుజాలపై మోస్తావు

బలగం నీవై నడిపిస్తావు

బట్టల్లో చిరుగును దాచేవు

గుండెల్లో బాధను మోసేవు

వేడుకల్లో వెనక ఉంటావు

విలువల్లో ముందు ఉంటావు

పిల్లల గెలుపుకై ఒడిపోతావు

వారిని గెలిపించి నువ్వూ గెలుస్తావు

అందరిలో ఒంటరిగా మిగిలిపోతావు

గుర్తింపు కోరక కాలంలో కలిసిపోతావు   


*** 

అనఘ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


Mahesh Konda

రచయిత పరిచయం: మహేశ్ కొండ


నా పేరు మహేశ్ కొండ. వృత్తి వ్యాపారం. మహేశ్ కొండ 'అనఘ' పేరుతో రచనలు చేస్తాను. వివిధ సంకలనాలలో కొన్ని కథలు ప్రచురితం అయ్యాయి. వివిధ ఆన్లైన్ పత్రికల్లో కథలు, కవితలు బహుమతులు గెలుచుకున్నాయి. 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page