అందని ద్రాక్ష పుల్లన
- Patrayudu Kasi Viswanadham

- Apr 20
- 4 min read

Andani Draksha Pullana - Telugu Moral Story | Patrayudu Kasi Viswanadham
అందని ద్రాక్ష పుల్లన - తెలుగు నీతి కథ | పట్రాయుడు కాశీవిశ్వనాథం
Published In manatelugukathalu.com On 20/04/2026
దక్కని దాన్ని మనమే తక్కువ చేసి మాట్లాడుతామా?
కాశీ విశ్వనాథం పట్రాయుడు గారి అందని ద్రాక్ష పుల్లన కథ చదవండి…
జవాబు మీకే తెలుస్తుంది!
ఒకరోజు సాయంత్రం వేళ రావి చెట్టు కింద తాతయ్య ప్రశాంతంగా కూర్చున్నారు. ఆయన పక్కనే జున్నుబాబు, అతని స్నేహితులు ఆడుకుంటూ ఇలా మాట్లాడుకుంటున్నారు.
“మన పక్క ఊరికి సర్కస్ వచ్చిందట! ఎవరైనా వెళ్ళారా?” అని అడిగాడు రాము.
“మా నాన్న రేపు తీసుకెళ్తానన్నారు” అన్నాడు రాజు ఉత్సాహంగా.
కానీ శ్రీను మాత్రం ముఖం మాడ్చుకుని, “ఆ సర్కస్ ఏమీ బాగోలేదట, అందుకే నేను వెళ్లడం లేదు” అన్నాడు.
“నీకెవరు చెప్పారు?” అని అడిగాడు జున్నుబాబు.
“ఎవరో అనుకుంటూ ఉంటే విన్నాను” అని నీళ్లు నమిలాడు శ్రీను.
అప్పుడు రాజు నవ్వుతూ, “సర్కస్‌కు వెళ్లడానికి మీ నాన్న డబ్బులు ఇవ్వలేదని చెప్పు, అందుకే ఇలా అంటున్నావు కదా!” అని ఆటపట్టించాడు.
శ్రీనుకి కోపం వచ్చి, “ఏం కాదు.. నిజంగానే బాగోలేదట!” అని అక్కడి నుంచి చిరాగ్గా వెళ్ళిపోయాడు.
అదంతా గమనిస్తున్న జున్నుబాబు, “తాతయ్యా! నిజంగానే సర్కస్ బాగుండదా?” అని అడిగాడు.
తాతయ్య నవ్వుతూ, “అందని ద్రాక్ష పుల్లనరా జున్నూ!” అన్నారు.
“అంటే అందనివన్నీ పుల్లగా ఉంటాయా తాతయ్యా?” అని సందేహంగా అడిగాడు జున్నుబాబు.
“అందని ద్రాక్ష పుల్లన అనేది ఒక సామెత. ఏదైనా ఒక విషయం మనకు దక్కనప్పుడు, దాన్ని తక్కువ చేసి మాట్లాడటం మనుషుల సహజ స్వభావం.
దీని వెనుక ఒక చిన్న కథ ఉంది. ఒకసారి ఒక నక్కకి విపరీతమైన ఆకలి వేసింది. అది అడవిలో తిరుగుతుండగా ఒక ద్రాక్ష తోట కనిపించింది. పందిరికి బోలెడన్ని ద్రాక్ష గుత్తులు వేలాడుతున్నాయి. నక్క వాటిని అందుకోవడానికి ఎన్నో సార్లు ఎగిరింది. కానీ అవి అందనంత ఎత్తులో ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయేసరికి.. నక్క తనలో తాను సర్దిచెప్పుకుంటూ, 'ఈ ద్రాక్షపళ్ళు చాలా పుల్లగా ఉన్నాయి, వీటిని తినకపోవడమే మంచిది' అనుకుంటూ వెళ్ళిపోయింది.”
“శ్రీను పరిస్థితి కూడా అంతే! వాళ్ళ నాన్న తీసుకెళ్లలేదని బాధపడుతూ కూర్చోలేక, ఆ సర్కస్ బాగోలేదని తన మనసుకి సర్దిచెప్పుకుంటున్నాడు. ఏదైనా అవకాశం మనకు దక్కనప్పుడు, దానిపై లేనిపోని వంకలు పెట్టడాన్నే 'అందని ద్రాక్ష పుల్లన' అంటాం” అని వివరించారు తాతయ్య.
“బాగా అర్థమయ్యింది తాతయ్యా! మరి నన్ను సర్కస్‌కు ఎప్పుడు తీసుకెళ్తావు?” అని అడిగాడు జున్నుబాబు.
“రేపే వెళ్దాం!” అన్నారు తాతయ్య.
“భలే.. భలే! మా తాతయ్య చాలా మంచివారు” అంటూ జున్నుబాబు తాతయ్యను గట్టిగా వాటేసుకుని ముద్దుపెట్టాడు.
“మేమూ రేపే సర్కస్ చూడ్డానికి వెళ్తున్నాం” అన్నారు మిగతా పిల్లలు.
సమాప్తం
పట్రాయుడు కాశీవిశ్వనాథం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు: పట్రాయుడు కాశీవిశ్వనాధం
Patrayudu kasi Viswanadham
విద్యార్హత: ఎం.కాం., బి.ఇడి., బి.ఎ.,
ఎం.ఎ(ఆంగ్లం)., ఎం.ఎ.(తెలుగు).
స్వగ్రామం : చామలాపల్లి అగ్రహారం
విజయనగరం జిల్లా.
నివాసం : శృంగవరపుకోట (ఎస్.కోట)
వృత్తి : పాఠశాల సహాయకులు(ఆంగ్లం)
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్కవరపుకోట.
ప్రవృత్తి: కవితలు, బాలల కధలు, బాలాగేయాలు రాయడం
ఆలిండియా రేడియోలో స్వీయ కవితా పఠనం చేయడం.
సేకరణలు:
**********
1.వివిధ దేశాలకు చెందిన స్టాంపులు, నాణెములు, 2.నోట్లు, 3.వార్తా పత్రికలు(వివిధ భాషల వి), 4.స్పూర్తి కధనాలు, 5.మహనీయుల జీవితాల్లో మధురఘట్టాలు, 6.సాహసబాలల కధనాలు, 7.వివిధ నెట్ వర్క్ ల సింకార్డులు ఓ చర్లు, 8.వివిధ పతాకాలు, ప్రతీదీ వందకు పైగా సేకరణ. 9. వైకల్యాలని అధిగమించి విజయాలను సాధించిన వారి స్ఫూర్తి కధనాలు వివిద పత్రికలనుంచి 150 కి పైగా సేకరణ.
విద్యార్థులతో సేవాకార్యక్రమాలు:
*******************************
1.విధ్యార్ధులల్లో సేవాభావాన్ని పెంపొందించడం కోసం విద్యార్ధులను బృందాలుగా చేసి వారి నుంచి కొంత మొత్తం సేకరించి, దానికి నేను కొంత మొత్తం కలిపి అనాదాశ్రమాలకు వికలాంగ పాఠశాలకు సంవత్సరానికొకసారి 4000 రూ. ఆర్ధిక సాయం. ప్రతీ సంవత్సరం శివరాత్రినాడు విధ్యార్ధులే స్వయంగా తయారు చేసుకుని భక్తులకు పులిహోర పంపిణీ. కనీసం 30 కిలోలు. విధ్యార్ధుల సహకారం తో చలివేంద్రాలు ఏర్పాటు.
2.మండలస్థాయిలో విద్యార్థులకు *భగవద్గీత శ్లోక పఠన పోటీలు.
3.రామాయణం క్విజ్ పోటీలు* నిర్వహించడం.
బాల రచయితలుగా తీర్చిదిద్దడం
*******************************
బాలలను రచనల వైపు ప్రోత్సహించడం.వారి రచనలు వివిధ పత్రికలకు పంపడం జరిగింది.
నా ప్రోత్సాహం తో మా పాఠశాల విద్యార్థుల కథలు, బాలగేయాలు బాలబాట పత్రికలో 10 కి పైగా ప్రచురించబడ్డాయి.
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
సంకలనాలు :
1.గురజాడ శతవర్ధంతి
కవితా సంకలనం లో
2.ఆంధ్ర సంఘం పూణె వారి 'ఆమని' సంకలనం లో
3.రచనా సమాఖ్య బొబ్బిలి వారి 'జల సంరక్షణ',
4.'రక్త బంధం',
5.'ఆకుపచ్చనినేస్తం' కవితా సంకలనాలలో.
6. గుదిబండి వెంకటరెడ్డి గారి 'ఏడడుగుల బంధం' సంకలనం లో
7.రమ్య భారతి వారి కృష్ణా పుష్క్కర సంకలనం లో 8.సాహితీ ప్రసూన దాశరధి ప్రత్యేక సంకలనం లో
9.తెలుగు ప్రతిలిపి వారి మాతృ స్పర్శ కవితా సంకలనంలో
10.గుదిబండి వెంకటరెడ్డి గారి నేస్తం కవితా సంకలనం (2019)లో
11. బైస దేవదాసుగారి నీటి గోస కవితా సంకలనం లో
12. ఉరిమళ్ల సునంద చిన్నారి లతీఫా కవితా సంకలనం లో
13.మద్యం మహమ్మారి కవితాసంకలనం లో నా కవితలకు చోటు.
🌷🌷🌷🌷🌷🌷🌷
బహుమతులు
1.డా. పట్టాభి కళా పీఠం విజయవాడ వారి జాతీయ స్థాయి కవితల పోటీలో ప్రధమ బహుమతి 1000/-(నేను నేను కాదు)2016
2.తెలుగు తేజం చిట్టి కధల పోటీలో పేగు బంధం కథకి తృతీయ బహుమతి.
3.జిల్లా రచయితల సంఘం వారు నిర్వహించిన కధల పోటీలో తృతీయ బహుమతి.
4.సాహితీ కిరణం వారి మినీ కవితల పోటీలో ద్వితీయ బహుమతి.
5.ఆంధ్ర సంఘం పూణే వారి కవితల పోటీలో ద్వితీయ బహుమతి.
6.కెనడా డే సందర్భంగా తెలుగు తల్లి సంస్థ వారి కధల పోటీలో అద్భుతం కధ కి ప్రథమ బహుమతి.1000/- 2018
7.నవ్య దీపావళి కధల పోటీలో నాకు చనిపోవాలనుంది కధ సాధారణ ప్రచురణకు ఎంపిక.
8.ప్రియమైన కథకులు సమూహం వారు నిర్వహించిన కథలపోటీ (2019) లో అల్లరి పిడుగు కథకు ప్రత్యేక బహుమతి
9.తెలుగుతల్లి కెనడా డే వారు నిర్వహించిన కథల పోటీ 2019 లో ఒక్క క్షణం ఆలోచిద్దాం కథకి ప్రధమ బహుమతి 1000 రు.
ఇంకా మరెన్నో బహుమతులు, సన్మానాలు, సత్కారాలు.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
బిరుదులు :
1.తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారి సహస్ర కవిమిత్ర,
2.సహస్ర లేఖా సాహిత్య మిత్ర,
3.సహస్ర వాణి శత స్వీయ కవితా కోకిల,
4.శతశ్లోక కంఠీరవ,
5.సూక్తిశ్రీ,
6.తెలుగు ప్రతిలిపివారి "కవి విశారద"
7.గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి రాష్ట్రస్థాయి పురస్కారం 2016
8.జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2017.
9.బండారు బాలనంద సంఘం వారి జాతీయ ఉత్తమ బాల సేవక్ పురస్కారం 2017,
10.సర్వేపల్లి జాతీయ విశిష్ట సేవాపురస్కారం 2018, 2019 లలో
11.ప్రతిలిపి వారి బాలమిత్ర 2019 పురస్కారం పొందడం జరిగింది.
12.కాశీ మావయ్య కథలు బాలల కథా సంకలనానికి పెందోట బాల సాహిత్య పురస్కారం 2023
🌹🌹🌹🌹🌹🌹🌹
ముద్రించిన పుస్తకాలు :
1."జన జీవన రాగాలు" (స్వీయ కవితా సంపుటి),
2."జిలిబిలి పలుకులు"( బాల గేయాల సంపుటి).
3.*దేవునికో ఉత్తరం* బాలల కధా సంపుటి
4.*అద్భుతం* బాలల కథా సంపుటి
5.కాశీ మామయ్య కథలు బాలల కథా సంపుటి.
6.తాతయ్య కల బాలల కథా సంపుటి.
అముద్రితాలు
1*మౌనమేలనోయి* కథల సంపుటి
2 ఉభయ కుశలోపరి లేఖల సంపుటి
3*నీకోసం* భావ కవితా సంపుటి.
4చెట్టు కథలు
5 పేదరాశి పెద్దమ్మ కథలు
6 మృగరాజు సందేశం కథల సంపుటి
ఇష్టాలు
పిల్లలతో గడపడం
బాలసాహిత్య పఠనం
బాలసాహిత్య రచన
ప్రచురణలు
ఇప్పటి వరకు..వివిధ దిన,వార, మాస, ద్వైమాస, జాతీయ, అంతర్జాతీయ,అంతర్జాల పత్రికలలో బాలల కధలు 250,బాల గేయాలు 180 సాంఘిక కథలు50, కవితలు 120, ప్రచురణ అయ్యాయి.
🌿🌿🌿🌿🌿🌿🌿🌷🌷🌷🌷🌷🌷
పట్రాయుడు కాశీవిశ్వనాథం, Goranta Deepam Kondanta Velugu, గోరంత దీపం - కొండంత వెలుగు, moral story telugu |




@rvvlmurthy1899
• 6 hours ago
Chala bagundi