top of page

అందరూ సమానులే!

#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #AndaruSamanule, #అందరూసమానులే, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 93


Andaru Samanule - Somanna Gari Kavithalu Part 93 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 21/06/2025

అందరూ సమానులే! - సోమన్న గారి కవితలు పార్ట్ 93 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


అందరూ సమానులే!

----------------------------------------

ఎదుటివారిలో మంచి

చూడాలోయ్! ఎప్పుడు

ప్రతినిత్యం తప్పులు

వెదక వద్దు తమ్ముడు


అందరూ పరిపూర్ణులు

కారు కారు బ్రతుకున

ఉంటాయి లోపాలు

ఏదో ఒక మూలన


అందాల గులాబీకి

ఉండునోయ్! ముల్లులు

రాత్రినేలు చంద్రునికి

తప్పవోయి! మచ్చలు


అందరూ సమానులు

భగవంతుని దృష్టిలో

ఈ సత్యం మరువకు

దాచుకో! మనసులో

ree















చక్కని సుభాషితాలు

----------------------------------------

అక్షరంపై పెంచుకో

అంతులేని అభిమానం

అజ్ఞానం త్రుంచుకో

విజ్ఞానం బహుమానం


జ్ఞానానికి లేదు లేదు

జగతిలోన కొలమానం

తెలుగుపై చిన్నచూపు

తెలుగోళ్లకు అవమానం


గుండెల్లో మంచితనం

పోతే కడు శోచనీయం

ఎప్పటికైనా గెలిచేది

ఖచ్చితంగా న్యాయం


చదువే నేర్పాలోయ్!

జీవితాన సంస్కారం

పెద్దలకు చేయాలోయ్!

భక్తితో నమస్కారం

ree
















అక్షర భావాలు

------------------------

చిట్టి చీమను చూసి

క్రమశిక్షణ నేర్చుకో

పొదుపు విలువను తెలిసి

భద్రంగా వాడుకో


భూమాతను పరికించి

ఓర్పును అలవర్చుకో

నలుగురికి మంచి పంచి

గుండెల్లో నిలిచిపో


పచ్చని చెట్టును గాంచి

ఎదుగుదల కోరుకో

భువిలో వాటిని పెంచి

పుణ్యం కాస్త కట్టుకో


పుస్తకాలు పట్టుకుని

విజ్ఞానం పొందుకో

ప్రతిదినమూ చదువుకుని

ఉన్నత స్థితి చేరుకో

ree














తల్లి చెప్పిన పాఠాలు

----------------------------------------

శ్రమలేని జీవితాన

ఉండవోయ్! ఫలితాలు

ముదం లేని హృదయాన

సుఖాలు గగన కుసుమాలు


సఖ్యత లేని స్థలాన

అభివృద్ధి కడు దూరం

పవిత్రత లేని మనసున

దైవత్వం మాయం


అమ్మ ఉన్న గృహమున

ఆనందం పొంగును

ఆమె చల్లని దీవెన

ఎదుగుదలకు వంతెన


కన్నవారి పలుకులు

గైకుంటే లాభము

కోకొల్లలు శుభములు

భవిత అగును శ్రేష్టము

ree











పెద్ద మనిషి విన్నపాలు

----------------------------------------

పెద్దవారి మాటల్లో

పరమార్థం తెలుసుకో

వారు నడుపు త్రోవలో

గమ్యాన్ని చేరుకో


గుండెలోని నైరాశ్యం

తక్షణమే వదులుకో

బ్రతుకులోన అలసత్వం

ఆదిలోన త్రుంచుకో


శక్యమైతే నలుగురితో

సంతోషం పంచుకో

మహిని మహనీయులతో

సహవాసం పెంచుకో


వీలైతే పేదలతో

అనురాగం చాటుకో

నిజమైన మిత్రులతో

ఎద వ్యధను దించుకో


-గద్వాల సోమన్న

Comments


bottom of page