top of page

అనుభవం

#PeddadaSathyanarayana, #పెద్దాడసత్యనారాయణ, #Anubhavam, #అనుభవం, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ


Anubhavam - New Telugu Story Written By - Peddada Sathyanarayana   

Published In manatelugukathalu.com On 21/06/2025

అనుభవం - తెలుగు కథ 

రచన: పెద్దాడ సత్యనారాయణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్


“లక్ష్మీ! నీకు చాలా సార్లు చెప్పాను.. పాపను మీఅన్నయ్యకి ఎత్తుకునేందుకు ఇవ్వవద్దు... కూకొని ఆడిపియ్యమని. నామాట నీవు వినటం లేదు. మీ అన్నయ్య ఒక కాలు మీద పరిగెత్తటం అని నీకు ఎరుక. పాపకి ఇప్పుడిప్పుడే నడక వస్తోంది. ఏమయినా జరిగితే యెంత కష్టమో ఆలోచించు” అని నర్సయ్య భార్యని హెచ్చరిస్తాడు. 


“పాపకి ఏమి జరగకుండా అన్నయ్య బాగానే ఆడిస్తాడు మావ.. నీవు బేఫికర్ గా పాలు పోసిరా” అని కాన్ ఇచ్చి పంపిచేస్తుంది. 


 అన్నయ్య కి చిన్న ప్పుడు ఆటల్లో కాలు విరిగితే సమయానికి పైసలు లేక నాయన అన్నని దవాఖాన కి తోలుకి పోలేదు. 


పసరు కట్టువేయిస్తే సెప్టిక్ అయి కాలు తీసేసినారు.తనకు పాపకి తోడుగా ఉంటాడని తనతోనే ఉంచుకుంది. అందుకే మావ జరా ఏక సెక్కము గా అన్న గురించి మాట్లాడుతాడు. 


“అక్కా! బావ పాలు పోస్తూ ఇంటికి వస్తుంటే మూడోగల్లి తాన కింద పడ్డాడు” అని పక్కింటి పోరి ఆయాసపడుతూ వచ్చి చెప్తుంది. 


“అన్న.. జర పాపని చూసుకో. నేను ఇప్పుడే వస్తా” అని జవాబు కోసము ఎదురు చూడకుండ వెళ్ళిపోతుంది లక్ష్మి. 


 “కిందపడ్డ బావ ని లేపుదామని ప్రయత్నిస్తే, హొషులో లేనందువలన అంబులెన్సికి ఫోన్ చేసి పెద్దాసు పత్రికి తీసుకుపోయినారు. 


“సారు.. మా మావ కి ఏమయినది” అని ఆతృతగా అడుగుతుంది. 


“నీవు వరండాలో కూర్చో. పరీక్ష చేసి చెపుతా” అని డాక్టర్ వెళ్లి పోతాడు.

 

గంట తర్వాత డాక్టర్ లక్ష్మి ని పిలిచి, “మీ ఆయనకి దెబ్బలేమి తగలలేదు. నేను కొన్ని ప్రశ్నలడుగుతాను. సరయిన సమాధానము చెప్పు. కడుపునొప్పి ఎప్పుడయినా వచ్చేదా?”


“అప్పుడప్పుడు వచ్చేది, వచ్చినప్పుడు మందు తాగేవాడు” 


“మందు అంటే కడుపునొప్పి మందా లేక తాగుడు అలవాటు ఉండేదా?” 


“తాగుడు అలవాటు ఉంది, కానీ జరంత తాగేవాడు” 


“సరే ఏమి చేయాలో చెప్తాను” అని డాక్టర్ వెళ్లి పోయాడు. 


“నర్సయ్యకి ఆపరేషన్ చేసేందుకు జనరల్ వార్డ్ కి షిఫ్ట్ చేసారు. 


“లక్ష్మీ! పాపని చూడాలని ఉంది” అని, కిటికీలోంచి బయటకి చూసాడు నర్సయ్య. 


“లక్ష్మీ! వద్దన్నా మీ అన్న పాపని భుజాలమిన ఎక్కించుకొని వస్తున్నాడు” అంటాడు.


“మావ.. ఆ వచ్చేది మా అన్ననే” అని జవాబిస్తుంది. 


“నేను పాపని ఈడకి తేవద్దు అంటే ఎందుకు తెస్తున్నాడు” 


“మావ.. పాప నీ మీద బెంగ పెట్టుకుంటే నీ తానాకి తెస్తుండు. లొల్లి చేయకుండా పాపతో మాట్లాడు” అని సముజాయిస్తుంది.


సరేలే, అని పాపతో ఆడుకొని, లక్ష్మి అన్నతో ముభావంగా ఉంటాడు. 


నర్సయ్యకి ఆపరేషన్ అయి విశ్రాంతి కోసము జనరల్ వార్డ్ కి తెస్తారు. 


ఇంతలో పాపని లక్ష్మి అన్నయ్య వార్డ్ లోకి తెస్తాడు. అప్పుడే డాక్టర్ వచ్చి నర్సయ్యని, ఎలావుందీ అని అడుగుతాడు. 


“డాక్టర్! నాకేమయింది” అని అడుగుతాడు. 


“నీ కిడ్నీలు పాడయితే, వేరేవాళ్ళ కిడ్నీ వేసాము” 


 “డాక్టర్.. నాకు కిడ్నీ ఎవరిచ్చారు?” 


“ఆ పాపని ఎత్తుకున్న పెద్దాయన” అని జవాబిస్తాడు డాక్టర్. 


నర్సయ్యకి ఏమనాలో అర్థము కాక, నమస్కారము పెడతాడు. 


“లక్ష్మీ! ఈ రోజునుంచి నీ అన్నయ్య నాకు దేవుడు” అని ఆప్యాయము గా “బావా, నన్ను క్షమించు” అని కౌగలించుకుంటాడు. 


***

పెద్దాడ సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


రచయిత పరిచయం:

 మన తెలుగు కథలు పాత్రికేయులకి, పాఠకులకు   నా  నమస్కారములు.

పేరు: పెద్దాడ సత్యనారాయణ   B .A  విశ్రాంత సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్                                                               

డిఫెన్స్ అకౌంట్స్ డిపార్టుమెంట్   

విద్యాభ్యాసము సికింద్రాబాద్                                                                    

సాహిత్య పరిచయము: 6 వ్యాసాలు, ఆంధ్రభూమి  4 కధలు 1 నాటిక                                                

వ్యాసాలకి పారితోషికం  మరియు కమలాకర్ ట్రస్ట్ వారితో సన్మానము జరిగినది.                                            

సంఘసేవ:  గత మూడు సంవత్సరాలు నుంచి పది వృద్ధాశ్రమాలకి బాలబాలికల వసతి గృహాలకి   మరియు ఒక పాఠశాల ,జూనియర్ కళాశాలకు అనేక వస్తవులు అందచేయడము జరిగింది. దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన సామాన్లు మరియు తొంభై విలువైన ఉపయోగకరమయిన వాడేసిన వస్తువులు అనగా మంచాలు ,ఫ్రిడ్జిలు , టి.వీ.లు. కుర్చీలు .మొదలగున్నవి పరిచయస్తుల దగ్గరనుంచి సేకరించి ఆశ్రమాలకు అందచేసాను.


 


Comentários


bottom of page