గాడిద నవ్వింది
- Kandarpa Venkata Sathyanarayana Murthy

- Jun 21
- 4 min read
#GadidaNavvindi, #గాడిదనవ్వింది, #గార్దభలహరి, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #పిల్లలకథలు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

గార్దభ లహరి - పార్ట్ 6
Gadida Navvindi - New Telugu Story Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 21/06/2025
గాడిద నవ్వింది - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
అగ్రహారం బ్రాహ్మణ వీధి ఇంటివసారా వాలుకుర్చీలో కూర్చుని ఊరి పురోహితులు విశ్వనాథశాస్త్రి పంచాంగం చూస్తున్నారు. ఊరి జనం పెళ్లి ముహూర్తాలు, గృహ ప్రవేశం, భూమి పూజలకు శుభ ముహూర్తాలు పెట్టించుకుంటున్నారు.
చాకలిపేటలో ఉండే లచ్చన్న గ్రామ ప్రజల మురికి బట్టలకు నల్లజీడితో ఇంటి గుర్తులు పెట్టి మూటలు కట్టి గాడిద వీపు మీద సర్ది ఇంటి కోళ్లు, పెంపుడు కుక్క, పెళ్లాం లచ్చి చేతిలో సిల్వర్ గిన్నెలో గుడ్డ మూట కట్టిన మధ్యాహ్న బువ్వతో సకుటుంబ సపరివార సమేతంగా ఊరి బయట చెరువు చాకిరేవుకి బయలుదేరాడు.
చాకలిపేట నుంచి చాకిరేవు మద్యలో పంచాయతీ రోడ్డు మరమ్మత్తుల కారణంగా బ్రాహ్మణ వీధి లోంచి చాకిరేవుకి బయలు దేరాడు లచ్చన్న.
"దండాలు బాబయ్యా ! "
"ఏరా లచ్చన్నా ! చాకిరేవుకి బయలు దేరావా? " పంతులి గారి ప్రశ్న.
"అవును సామీ ! "
"సరే, వెళ్లు "
లచ్చన్న పరివారం ముందుకు సాగి పోయింది.
మధ్యాహ్నం భోజనం చేసి విశ్రాంతి తీసుకుని వీధి వరండాలో కూర్చుని పంచాంగం చూస్తున్న విశ్వనాథం పంతుల గారు అటుగా సకుటుంబ సపరివార సమేతంగా ఇంటికి తిరిగి వెల్తున్న చాకలి లచ్చన్నను చూసి
"ఏరా, లచ్చన్నా! పొద్దు అవకుండానే రేవు నుంచి ఇంటికి బయలు దేరావు ?" తన మనసులోని సంశయాన్ని బయట పెట్టారు.
"వర్షం ముంచుకొస్తోంది బాబయ్యా ! ఉతికిన గుడ్డలు తడిసి పోతాయని బేగె బయలెన్నినాను " సమాధానం చెప్పి ముందుకు కదిలి పోయాడు లచ్చన్న కుటుంబం.
అప్పటికి ఎండ తీవ్రంగానే ఉంది. ఆకాశంలో మేఘాల జాడ లేదు.
"వెర్రి వెధవ, వర్షం వస్తుందని ముందే ఇంటికి బయలు దేరాడు" మనసులో అనుకున్నారు పంతులుగారు.
లచ్చన్న వెళ్లిన అరగంట తర్వాత ఒక్క సారిగా పెద్ద గాలితో కారుమేఘాలు కమ్మి కుంభవృష్టి వర్షం పడింది.
సుబ్బరాజు గారి మిల్లు ఆవరణలో ఎండపోసిన ఎర్ర మిరపకాయలు చాకలి లచ్చన్న హెచ్చరికతో వర్షానికి తడియకుండా చేయగలిగాడు.
పంతులు గారు ఆశ్చర్యానికి గురయారు. ' నా లెక్క ప్రకారం. ఈరోజు పంచాంగంలో వర్ష సూచన లేదు. మరి చాకలి లచ్చన్న ముందే వర్షం వస్తుందని ఎలా చెప్ప గలిగాడు. ఈ విషయం ఊళ్ళో వాళ్లకి తెలిస్తే నా పరువేం కాను ' అనుకుంటూ అసహనంగా ఉన్నారు.
ఇంట్లో కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్న పంతులు గార్ని చూసిన భార్య కారణ మడిగింది. ఆయన చిరాకు పడుతు విషయం చెప్పారు.
హైస్కూలులో సైన్సు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వారి అబ్బాయి తండ్రి మాటలు విని బయటకు వచ్చి " నాన్న గారూ ! ఇందులో ఆశ్చర్య పడాల్సిందేమీ లేదు. సైన్సు ప్రకారం వాతావరణం లో వేడి ఎక్కువైనప్పుడు ఆకాశంలో క్యుములోనింబస్ నీటి మేఘాలు ఏర్పడి అప్పటికప్పుడు
భారీ గాలితో వాన కురుస్తుంది. అవేవీ పంచాంగాల్లో రికార్డు కావు." వివరంగా తెలియచేసాడు.
పంతులు గారి మనస్సు అప్పటికి శాంతించినా చదువుసంధ్యలు లేని చాకలి లచ్చన్న కెలా ముందుగా వర్షం వస్తుందని తెల్సిందా అని తర్జనభర్జన పడసాగారు.
మర్నాడు చాకలి లచ్చన్న చాకిరేవు కెల్తున్నప్పుడు దగ్గర ఎవరూ లేరని చూసి పిలిచి మనసులోని శంసయాన్ని బయటపెట్టారు పంతులు గారు.
అందుకు లచ్చన్న చిన్న నవ్వు కనబరుస్తూ " అదా, బాబయ్యా ! మామూలుగా అయితే నా గాడిద తన తోటి గాడిదల్ని ఎతికేటప్పుడు గట్టిగా ఓండ్ర పెట్టి అరుస్తాది. అదే చినుకులు వచ్చే బెగులుంటే నోటి పల్లు
బయటికేసి సకిలిత్తు (నవ్వుతూ) చాకిరేవు చుట్టూ పరుగులెడతాది. అదే నాకు ఆనవాలు సామీ! నేనూ లచ్చీ గబగబా ఆరిన గుడ్డల్ని మూటలు కట్టి ఇంటికి బయలెలుతాము." వివరంగా చెప్పేడు.
లచ్చన్న వెళిపోయిన తర్వాత అతని ముందు చూపుకీ, చదువు లేక పోయినా ఉతికిన బట్టలు గుర్తులు పెట్టి ఎవరి బట్టలు వారికి అంద చేసే జ్ఞాపక శక్తికి మనసులో మెచ్చుకున్నారు పంతులు గారు.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.




Comments