అన్న ఆరాటం చెల్లెలు చెలగాటం

'Anna Aratam Chellelu Chelagatam' - New Telugu Story Written By Pitta Gopi
'అన్న ఆరాటం చెల్లెలు చెలగాటం' తెలుగు కథ
రచన: పిట్ట గోపి
దాసు అందరి పిల్లల వలె పదోతరగతిలో ఆనందంగా అడుగు పెట్టాడు.
తన చెల్లెలు ఝాన్సీ, దాసుకి ఒక మంచి రాఖీ కట్టింది.
దాసు తాను స్కూల్లో గెలుపొందిన నగదును చెల్లెలికి ఇచ్చాడు.
చెల్లెలు మురిసిపోయింది.
కానీ..
విధి రాత ఏమో.. అప్పటివరకు కష్టపడి పని చేస్తూ తనను, తన చెల్లెలు ఝాన్సీ ని చదివించిన తల్లిదండ్రులు ఒక్కసారి మంచానికి పరిమితము అయ్యారు.
చదువులో రారాజు అయిన దాసు తన చదువు గూర్చి కాస్త ఆందోళనతో గడపటం మొదలెట్టాడు.
ఎందుకంటే పదోతరగతి లో ఖచ్చితంగా తాను ఫస్ట్ ర్యాంక్ గా నిలుస్తాడు. అది పాఠశాల మొత్తం తెలుసు. ఆ తర్వాత కూడా మంచి చదువులు చదివి తల్లిదండ్రులును చెల్లెలిని చూసుకోవాలని దాసు ఆశ.
అయితే ఆ ఆశ అడియశలు చేస్తూ.. పూరి గుడిసె తప్ప ఆస్తులు లేని ఆ పేద తండ్రి..
"బాబు దాసు.. మేం ఇంకా పని చేసి మిమ్మల్ని పోషించే స్థితిలో లేము. నువ్వే చదువు మానేసి పని చేస్తూ చెల్లెలు చదువు కు దారి చూపు నాయినా" అన్నాడు తండ్రి.
తనకు చదువుకోవాలని ఉన్నా... ఇన్నాళ్లు కష్టపడి పెంచిన తండ్రి మాటలు పెడచెవిన పెట్టకుండా, పుట్టుడు దుఃఖంతో పనికి వెళ్తు ఇంటిని నడిపిస్తూ చెల్లెలు చదువుకు తోడు నిలుస్తూ వస్తున్నాడు.
తాను పని చేస్తూ చూసుకుంటున్న ఝాన్సీ మరో ఏడాది అన్నకు రాఖీ కట్టింది.
దాసు తన వద్ద ఏమీ ఉండవని ముందే చెల్లమ్మ కి ఇవ్వల్సినవి సంపాదించుకుని తనకు ఇచ్చాడు. తాను మురిసిపోతుంది.
ఒకనాడు దాసుతో "పెళ్ళి చేసుకోరా! మాకు ఒక ఆడపడుచు తోడు కూడా ఉంటుంది" అన్నాడు తండ్రి.
"నేను పెళ్ళి చేసుకుంటే చెల్లెలు చదువు పోతుంది. చెల్లెలు చదువు పూర్తి అయితే తానే మనల్ని చూసుకుంటుంది "అని దాసు అన్నాడు.
అయితే దాసు ఏది అనుకున్నా... అది జరగటం లేదు.
ఎంతో ఆశలు పెట్టుకున్న చెల్లెలు చదువు అంటూ కళాశాల కు వెళ్ళి ఎవడినో పెళ్ళి చేసుకుని ఇంటికి వచ్చింది.
దీంతో మంచం పై ఉన్న తల్లిదండ్రులకి, తన చదువు ఆపేసి తనకోసం కష్టపడి పని చేస్తున్న అన్న దాసుకి కోపం వచ్చింది.
అన్న కోపానికి అవధులు లేకపోవడంతో ఝాన్సీ ని ప్రేమలోకి లాగిన వాడిని కొట్టడానికి వెళ్ళబోతాడు.
ఝాన్సీ అన్నను అడ్డుకుని "అసలు నా భర్త ను కొట్టడానికి నువ్వు ఎవరివి..... నా మెడలో మూడు ముళ్ళు వేసిన వ్యక్తి ని అవమానించే అదికారం నీకు ఎక్కడిది... ఆ అదికారం నీకు ఎవరిచ్చారు" అని అంది.
ఆ మాటలకు దాసు నివ్వెరపోయి నిశ్చేష్టుడయ్యాడు.
ఏమైందో.. ఏమో.. తెలివి వచ్చేసరికి అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు.
బహుశా ఆ తర్వాత చెల్లెలు తల్లిదండ్రులను వదిలి అత్తవారింటికి పోయిందని అర్థం అయింది దాసుకి.
కష్టపడి దాసుకి ఒక అమ్మాయి తో పెళ్ళి చేసి కన్ను మూశారు తల్లిదండ్రులు.
చివరి చూపుకు కూడా ఝాన్సీ రాకపోవడంతో దాసుకి చెల్లెలిని భర్త బాగా చూసుకోవటం లేదేమో అనే సందేహం కలిగింది.
ఒకనాడు తానే భార్య తో కలిసి చెల్లెలి ఇంటికి వెళ్ళాడు. కానీ ఇంటి గేటు కూడా దాటి వెళ్ళలేకపోయాడు.
" నేను చెప్పకుండా పెళ్ళి చేసుకున్నానని నా భర్త నే కొట్టడానికి వచ్చి ఇప్పుడు ఏం అవసరం వచ్చిందో....
నా ఇంటికి వచ్చాడు [" అని వెటకారంగా మాట్లాడింది ఝాన్సీ.
ఆ మాటలకు ఇంక తనకు ఇంటికి వెళ్ళాలని అనిపించలేదు. చచ్చిపోవాలనిపించింది.
నిజమే! ఝాన్సీ మాటలకు మనిషైతే ఉన్నాడు కానీ.. మనసులో అప్పుడే చనిపోయాడు.
ఇక తాను కష్టపడి పని చేస్తు భార్యని చూసుకుంటున్నా...
భార్య కూడా ఆస్తులు, బంధుత్వం లేని దాసు వద్ద ఉండటానికి ఇష్టపడలేదు.
వదులించుకుని దాసుని బాదపెట్టే కంటే మనసులో మాట చెప్పి విడాకులు తీసుకుని వేరొకడితో వెళ్ళిపోయింది భార్య.
చెల్లెలికంటే తానే నయం అనిపించింది దాసుకి.
ఇక తనకు చావే శరణ్యం అని నిర్ణయించుకుని ఆత్మహత్య కు సిద్దపడ్డాడు దాసు.
సొంత వారు లేకపోవడంతో మున్సిపాలిటీ వారు చెల్లెలికి విషయం చెప్పారు.
"ఎవరు రాకపోతే అనాథగా అంత్యక్రియలు చేస్తా”మని చెప్పారు.
అన్న పోయాడని చెప్పగానే పరుగున అన్న ఇంటికి వచ్చింది ఝాన్సీ. కారణం...
అత్తింట్లో గత కొన్ని రోజులుగా కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి కాబట్టి.
అన్న శవాన్ని చూసి వెక్కివెక్కి ఏడుస్తుంది ఝాన్సీ.
ఎందుకంటే తాను చెల్లెలు కంటే బాగా చదువుతాడు కానీ నాన్న మాట కోసం, కుటుంబం బాధ్యత కోసం తన చదువు పక్కనపెట్టి చెల్లెలు అయిన తనకు ప్రోత్సాహం అందించాడు.
అన్న చేతిలో ఏదో చిన్న చెక్క పెట్టే ఉంది.
తెరిచి చూసింది.
ఏవో కొన్ని కాగితాలు, వాటి కింద బోలేడు రాఖీ లు ఉన్నాయి.
ఆ రాఖీలు అన్నీ చిన్నప్పుటి నుండి తాను కట్టినవే. అసలు బాధపడాల్సిన విషయం ఏంటంటే దాసు చనిపోయిన ఈరోజు కూడా రాఖీ పండగనే.
"అన్న ప్రేమతో ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను కానీ అన్న మాత్రం నా రాఖీలను భద్రంగా దాచుకుని తన ప్రేమను చాటి చెప్పాడు" అని ఏడుస్తుంది.
ఇంకా ఆ కాగితాలు ఏంటా అని చూస్తే.. కట్నం కోసం చెల్లెల్ని వేధిస్తారని ముందే ఊహించి చనిపోయిన తనకు ఆస్తి ఎందుకని తన పూరి గుడిసె కూడా చెల్లెలి పేరు మీద రాస్తే పనికొస్తుందని ఝాన్సీ పేరుమీద రాసి కన్ను మూశాడు.
ఈ చర్యతో ఝాన్సీ ఏడుపు..
"అన్న.. క్షమించన్నా..... ఈ ఒక్కసారి కి క్షమించి లే అన్నా లే ..కళ్ళు తెరువన్న ప్లీజ్.... ఈ జన్మకే కాదు జన్మ జన్మ కు నువ్వే నాకు అన్నవి. నీకు మళ్ళి రాఖీ కట్టాలని ఉందన్నా.. నాకు డబ్బులు ఇవ్వలేకపోయినా నీ ఆశిర్వాదం ఇవ్వన్న.. లే అన్న లే" అంటూ ఏడుస్తూ కూర్చుంది ఝాన్సీ.
***
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
https://www.facebook.com/ManaTeluguKathaluDotCom
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం :
https://www.manatelugukathalu.com/profile/gopi/profile
సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం