top of page

అన్నమో రామచంద్ర


'Annamo Ramachandra' New Telugu Story Written By Pitta Gopi

'అన్నమో రామచంద్ర' తెలుగు కథ

రచన: పిట్ట గోపి

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


స్వతంత్ర దినోత్సవ వేడుకలకు స్వయంగా ప్రధానమంత్రే ముఖ్య అతిథిగా గౌతమ్ ని ఆహ్వానించటంతో పేదలకు మాత్రమే పరిచయం ఉన్న ఆ పేరు దేశమంతా మారుమ్రోగింది.

ఇలాంటి గొప్ప వేడుకకు తానే త్రివిధ దళాలు నుండి గౌరవ వందనం స్వీకరించాలి కానీ..

అతనితో పాటు గౌతమ్ నాయుడు కూడా ఈ ఆ దళం గౌరవ వందనం స్వీకరిస్తారని తెలియటంతో వేడుకలకు అనుకున్న దానికంటే ఎక్కువ మంది తిలకించేందుకు వచ్చారు.

అందరి కళ్ళు గౌతమ్ పైనే..

వేదిక పైకి గౌతమ్ తప్ప రావల్సిన వారందరూ వచ్చారు.


వేదిక మొదట్లో కూర్చున్న కొందరు "సమయం గడుస్తున్నా.. ఇంకా ఆయన రాలేదు. ఒక ప్రధాని ని వేచి చూసేలా చేసిన ఆ ముఖ్య అతిథి ఎంత గర్వపరుడో" అని మాట్లాడుకుంటుండగా

వారి పక్కనే ఒక వ్యక్తి తెల్లని పొడవైన మెలితిప్పిన మీసాలతో చూడ్డానికి 60 ఏళ్ళు అనిపించేలా ఉన్న వ్యక్తి లేచి గబగబా వేదిక పైకి వెళ్ళసాగాడు.

ఆక్కడున్న సెక్యూరిటి అతన్ని అడ్డుకోగా..

ప్రధాని వాళ్ళని వారించి స్వయంగా ఆయనే కిందకు వచ్చి వేదిక ఎక్కించి తన సీటు లో కూర్చోబెట్టి తాను పక్క సీట్లో కూర్చున్నాడు.

అతనే గౌతమ్ అని చూసిన వాళ్ళంతా ఇంత సాదాసీదాగా ఉన్న ఆయన ఎవరూ..

ఒక ప్రధానమంత్రి ఆహ్వానం మేరకు వచ్చిన వ్యక్తి కి ఎంత భద్రత ఉండాలి.. ఎంత హడావుడి ఉండాలి.. ఎంత గర్వం ఉండాలి..

ఇవేవి లేవు సరికదా సామాన్యుడిలా ప్రజా సభలో ఉండి వేదిక పైకి వెళ్ళారు.

కాసేపు స్వంతంత్ర సమరయోధులు గూర్చి మాట్లాడాకా..

గౌతమ్ ఎవరో తెలుసుకోవాలని చూస్తున్న వారికి వివరించాడు ప్రధాని.

"భారతీయులారా.. ఈ వేడుకలకు వచ్చిన గొప్ప వ్యక్తి మన దేశంలో అత్యంత ధనికుడైన వ్యక్తి కుమారుడు" అంటూ జరిగినది చెప్పటం ఆరంభించాడు.

గౌతమ్ తన తల్లిదండ్రులకు ముద్దుల కొడుకు. ఏది కావాలంటే అది కొని తెచ్చేవాళ్ళు. తన తండ్రి గౌరి నాయుడు. అంహంకారి, కోటీశ్వరుడు. అతడి చేష్టలకు ప్రభుత్వాలు కూడా తల వంచాయి.

తన చుట్టూ ఎందరో పేదలు సహాయం కోసం ఇంటికి వచ్చినా బలవంతంగా నెట్టేవాడే కానీ ఏనాడూ సహాయం చేసి ఒకరి కడుపు నింపని వ్యక్తి గౌరి నాయుడు.

గౌతమ్ తల్లిదండ్రులు గోరుముద్దలు పెట్టినా అన్నం తినేవాడు కాదు.

అన్నం కంటపడితే అసహ్యంగా తల అటు తిప్పేవాడు. బలవంతంగా తినిపించినా.. ఏడ్చేవాడు.

దీంతో పండ్లు, కాయలు, రకరకాల తినుబండారాలు తెప్పించేవాడు తండ్రి.

పదేళ్ళు వచ్చాక కూడా ఆన్నం అంటే పడేది కాదు గౌతమ్ కు. మంచి గా రుచిగా ఉంటే నాలుగు మెతుకులు తినటం నేర్చుకున్నాడు. దీంతో మంచి మంచి వంట వాళ్ళని పిలిపించాడు తండ్రి.

అన్నం చల్లగా ఉన్నా... రంగు మారినా, మెత్తబడినా.. విసిరేసేవాడు గౌతమ్.

ఒకనాడు విహరయాత్రకు తల్లిదండ్రులతో వెళ్ళిన గౌతమ్ కు ఆ రోజు తాను ఆస్వాదించిన క్షణం కంటే ఆలోచనలతో గడిచిన క్షణాలే ఎక్కువ. అది చాలక ఇంటికొచ్చాక అదే బాధ, అదే ఆలోచన.

తన వాహనానికి ఇంధనం నింపిన వ్యక్తి కి కాళ్ళు లేవు. కానీ.. శ్రద్ధగా పని చేస్తున్నాడు. తండ్రి ఇచ్చిన నోటుకి చిల్లర లేకపోతే తిరిగి తిరిగి తెచ్చాడే తప్ప రూపాయి ఎక్కువ ఆశించలేదు.

ఇక దారిపొడవునా ఎక్కడ చూసిన పాతబడిన చిరిగిన దుస్తులతో, చంకలో పసివాళ్ళతో చెత్త ఏరుకునే వాళ్ళు కొందరు, బిచ్చమెత్తుకునే వాళ్ళు కొందరు..

ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పసివాళ్ళు కూడా ఆకలి అంటూ.. చేతులు చాచటం..

ఇంకా యాత్ర స్థలంలో కూడా ఇలా ఎక్కడ చూసినా ఆకలి కేకలతో అలమటిస్తూ.. కొందరు..

పొట్ట నింపుకునేందుకు ఎన్నో వింతైన కష్టసాధ్యమైన పనులు చేసేవారు కొందరు.

ఈ సంఘటన లకు ఎంత బాదపడ్డాడో..

అంతకంటే ఎక్కువ తాను చేసిన పనికి బాధపడ్డాడు.

ఆకలికి అలమటిస్తూ ఎంతోమంది చెయ్యిచాపి అర్థిస్తూ వుంటే, ఉన్న అన్నాన్ని అసహ్యించుకుంటూ విసిరేసేవాడు తాను.

వయసుకొచ్చిన గౌతమ్ చిన్న వయసు లోనే తన ప్రాంతంలో ఏ ఒక్కరూ ఆకలితో బాధ పడకూడదని తండ్రి సంపాదనలో కొంతబాగంతో వారి ఆకలి తీర్చేందుకు సిద్దమయ్యాడు. అలా తాను తండ్రి పనితనం నేర్చుకుని తండ్రి పోయాక తన సేవా కార్యక్రమాన్ని దేశమంతటా విస్తరించాడు.

కడుపు నింపుకోలేని ఎందరినైనా తాను పోషిస్తానని పేదలకు మాట ఇచ్చాడు.

తాను ఎక్కడికెళ్ళినా అన్నమో రామచంద్ర అంటూ ఆకలి కేక ఉండకూడదని, అందుకోసం ఆకలి తీర్చటానికి, ఆకలితో ఉన్నోళ్ళని గుర్తించటానికి, వారికి ఏదో ఒక పనితనం నేర్పించటానికి కొన్ని బృందాలను ఏర్పాటు చేశాడు. ఆకలితో ఎవరూ అలమటించకుండా ఆదుకున్నాడు.

తాను విసిరేసిన అన్నం, అసహ్యించుకున్న ఆ అన్నం పేదలతో కలిసి తిన్నాడు.

గౌతమ్ తన శ్వేతసౌథం లాంటి ఇల్లు వదిలి తన పిల్లలకు అప్పగించాడు.

పిల్లలు తమ తండ్రి అయిన గౌతమ్ కి సహకరించటంతో పేదలతోనే ఒక సామాన్యుడిలా గడుపుతున్నారు గౌతమ్.

అలా తన తండ్రి పేరు కి వణికిపోయిన ప్రభుత్వాలు గౌతమ్ చేస్తున్న పనిని గుర్తించాయి. దేశంలో అన్నార్తుల ఆకలి తీరుస్తూ కాలం గడుపుతూ ఆకలి లేని సమాజ సృష్టికర్త అయిన వ్యక్తే ఈ గౌతమ్" అని ప్రధాని చెప్పటంతో అక్కడి వారంతా లేచి రెండు చేతులు జోడించి వందేమాతరం గేయం పాడసాగారు.

"మన సమాజాన్ని మార్చాలి అంటే కేవలం ప్రభుత్వాలే ఏదో చేయనక్కర్లేదు. మనం కూడా చేయవచ్చు అని నిరూపించిన గొప్ప వ్యక్తి గౌతమ్. అందుకే ఆయన్ని దేశ ప్రజలకు పరిచయం చేశాను. ఇందుకు గర్వంగా ఉంది” కంటినీరు తుడుచుకుంటూ అన్నాడు ప్రధాని.

***

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం :

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం

43 views1 comment
bottom of page