top of page

అంతా మన మంచికే!

#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #AnthaManaManchike, #అంతామనమంచికే, #TeluguChildrenStories, #ఆశావహదృక్పథం, #PositiveThinking

"అంతా మన మంచికే!"... "శ్రీలేఖ సృష్టించిన కొత్త నిర్వహణ తీరు"

Antha Mana Manchike - New Telugu Story Written By - P V Padmavathi Madhu Nivrithi Published In manatelugukathalu.com On 13/01/2025

అంతా మన మంచికే - తెలుగు కథ

రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి


1). శ్రీలేఖ ఒక కళాశాల విద్యార్థిని. అందరి స్నేహితులకు క్విజ్ ఇచ్చి మరియు పలు రకాలుగా సహాయాలు అందించేది (వీలయినంత). ఆమె స్నేహితులు ఆమెను "మంచికి మరో పేరు" అని కొనియాడే వారు.


ఒక సారి శ్రీలేఖ యొక్క స్నేహితురాలు డైనింగ్ - టేబుల్ మీద సర్దుతూ ఉంటే, నీళ్ళు ఒలికి పోయాయి. వెంటనే శ్రీ లేఖ ఇలా అన్నది, "అంతా మన మంచికే!", చాలా రోజులు అయ్యింది, డైనింగ్ టేబుల్ తుడిచి. ఇప్పుడు మొత్తం టేబుల్ తుడుస్తా", అని తుడిచింది.


అపార్ట్మెంట్స్ లో ఒక సారి లిఫ్ట్ పని చేయ కుంటే, "అంతా మన మంచిదే! మెట్లు దిగితే వ్యాయామం అవుతుంది అందరికీ", అన్నది.


ఒక సారి, అపార్ట్మెంట్స్ లో విందు ఏర్పాటు చేసారు అందరూ కలసి. ఆరోజు ఏదో పండగ ఉన్న కారణం వల్ల చాలా మంది అతిథులు విందుకు రాలేదు. చాలా తిను బండారాలు మిగిలి పోయాయి. అప్పుడు శ్రీలేఖ అందరికీ ధైర్యం చెప్పింది. మంచితనం నూరి పోసింది. 


"అంతా మన మంచికే"! ఈ నెపం మీద పేదల ఆకలి తీర్చటం అవుతుంది", అంటూ మిగిలిన వ్యర్థ తిను పదార్థాలు తీసుకు వెళ్ళే వ్యవస్థ - సంస్థకు (ఫుడ్ కలెక్షన్ - డిస్ట్రిబ్యూషన్ చైన్ - సెంటర్ కు) ఫోన్ చేసి పిలిచింది. వాళ్ళు తినే - పదార్థాలను వాన్ లో పట్టికెళ్ళి... పేదల గృహాలకు తరలించారు.


ఓ సారి ఆమె స్నేహితురాలు బస్ - స్టాప్ కు ఓ ఐదు నిముషాలు ఆలస్యంగా వచ్చే సరికి, కళాశాల బస్సు వెళ్ళిపోయింది. స్నేహితురాలు "నాకు ఈ రోజు పరీక్ష ఉంది", అని కంట తడి పెట్టుకున్నది. వెంటనే శ్రీలేఖ "అంతా మన మంచికే! రైల్లో వెళదాం కాలేజ్ కి", అని మెట్రో - రైల్లో తీసుకెళ్ళింది. ప్రయాణించే మెట్రో - రైలు కిటికీ లో నుండి చూస్తే, ప్రక్కగా ఉన్న రోడ్డు అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఏదో చెట్టు కూలి పడింది, పెద్దగా వీచిన గాలికి. ఆ రోజు, బస్సు - ప్రయాణికుల కన్నా రైలు - ప్రయాణికులు ముందు చేరుకున్నారు కళాశాలకు ఆరోజు.


ఆనోటా - ఈనోటా అందరికీ ఈ విషయం తెలిసి... కళాశాల వారందరూ క్రమేణ సానుకూలంగా ఆలోచించటం మొదలుపెట్టారు అన్నింటికీ.. "అంతా మన మంచికే!...", అనుకుంటూ.

---- X X X -----



2). ఓ రోజు శ్రీలేఖ త్రాగే మంచి నీళ్ళు (బాటిల్) తెచ్చుకోలేదు పరీక్ష సమయంలో. అందరూ తెచ్చుకున్నారు. "అంతా మన మంచికే!... క్యాంటీన్ కు వెళ్లి నీళ్ళు తాగేసి వస్తా", అంటూ క్యాంటీన్ కి వెళ్ళింది శ్రీలేఖ. అదే సమయానికి, పెద్ద గాలి వీచి, పరీక్ష - గది యొక్క... కిటికీ గాజు తలుపు ముక్కలుగా విరిగి... ఆమె కుర్చీ మీద పడింది (ఆ తీవ్ర గాలికి). శ్రీలేఖ కు ఏమి కాలేదు... ఎందుకంటే... ఆ సమయం లో... ఆమె కళాశాల - క్యాంటీన్ లో మంచి నీళ్ళు తాగుతుంది కాబట్టి. 


కళాశాలలో, ఆనాటి నుండి, అందరికీ శ్రేలేఖ యొక్క "అంతా మన మంచికే!" అనే సంతోష పూరిత నిర్వహణ తీరు మరియు మంచి సానుకూల ఆలోచనా తీరు పై 100% (వంద శాతం) గురి కుదిరింది.


"మంచి సంతోష పూరిత - సానుకూల ఆలోచన తీరు నిర్వాహకురాలు / మేనేజర్", అనే బిరుదు కూడా ఇచ్చారు శ్రీలేఖ కు తన - ఆ కళాశాల లో.


అలా శ్రీలేఖ వల్ల,... క్రమేణా... ఆ నగరం లో "అంతా మన మంచికే!"... అనటం... ప్రోత్సాహకరం గా - మంచిగా - నిర్మాణాత్మకంగా ఆలోచించటం నేర్చుకున్నారు... మరియు అయిన దానిని మంచికి మలచు-కోవటం ఆచరించేవారు.

----- X X X ---------



3). ఒక రోజు (తన ఇంటి వద్ద) అపార్ట్మెంట్స్ వారికి, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఒక సినిమా ఏర్పాటు చేసింది ఇంట్లో... దాని పేరు "అంతా మన మంచికే!" (అలనాటి మహిళా సినిమా- స్టార్:- భానుమతి గారు నటించి, దర్శకత్వం వహించింది). అందరూ చూస్తున్నారు ఆ మంచి సినిమా ఆసక్తికరంగా. 


ఇంతలో విద్యుత్తు సరఫరా (కరెంట్) పోయింది. ఎవ్వరూ దిగులు పడలేదు. "అంతా మన మంచికే!, విద్యుత్తు ఆదా అయింది" అన్నారు సానుకూల భావనల తో. వెంటనే కరెంట్ వచ్చింది. "మొదటి - ప్రపంచ - అద్భుతం గా ఉందే ఇక్కడ", అన్నారు అక్కడ చేరిన వారందరూ, ఆశ్చర్యపోతూ. 


"నేనే స్విచ్ ఆఫ్ చేశా", అన్నది శ్రీలేఖ నవ్వుతూ. "అది కూడా "అంతా మనమంచికే!"... "ఎందుకంటే ఒక్క నిముషం విద్యుత్తు ఆదా - పొదుపు అయింది", అన్నది నవ్వుతూ హాస్యంగా.


అందరూ గట్టిగా నవ్వారు, "అవును! అంతా మన మంచికే!"... "తృప్తిగా నవ్వితే, తేలిక భావన వస్తుంది, బాధలు - నొప్పులు మర్చిపోతాం కాసేపు. ఆరోగ్యం కుదుట పడుతుంది... మానసిక శాంతి పొందుతాం... ఉల్లాసం - ఉత్సాహం - ఉత్తేజం వస్తుంది", అంటూ మళ్ళీ నవ్వేశారు. 

------ X X X ------


-------- సమాప్తం ---------


నీతి: 


1) ఏమి జరిగినా... ఏది జరిగినా... నిరుత్సాహ - నిస్పృహ పడకూడదు.... ప్రతి దానిని... మనకు మంచిగా, ప్రోత్సాహకరంగా మలచుకోవాలి. 


2) ఎల్లప్పుడూ "మంచి మాటలు చేతలు ఆచరణ" లోనే ఉండాలి. 


3) ఇష్టం లేని మనుషులకు, పని కి, చోట్లకు... దూరం గా ఉంటే మంచిది. ఎవ్వరికీ జోక్యం చేసుకునే అవకాశం ఇవ్వొద్దు. కీడు - హాని చేసే అవకాశం ఇవ్వొద్దు.


4) అప్పుడు కక్షలు, కోప తాపాలు ఉండవు. మనస్సు ప్రశాంతంగా గా ఉంటుంది. ఆరోగ్యం బహు - చక్కగా ఉంటుంది. 


5) అందరికీ శాంతి - ప్రగతి - సౌభాగ్యం - అభ్యుదయం కోరుకోవాలి. 


6) ప్రతి దానికి, సానుకూలంగా ఆలోచించుట అలవాటు చేసుకోవాలి... 'అంతా మన మంచికే!' అనుకుంటూ జీవించాలి. అన్నింటికీ, దేవుడి పై భారం మోపాలి... చెడు అయినా కూడా. అప్పుడు ప్రశాంత మనస్సుతో... ఆరోగ్యకరంగా... ఉత్సాహంగా - ఉల్లాసంగా - ఉత్తేజంగా - శక్తి-యుక్తులతో... ఎక్కువ కాలం జీవిస్తాం. ఇష్టం లేని వారితో, మాటలతో, స్థలాలలో దూరంగా మెలగాలి. తుదకు, దేవుడు అందరికీ మంచి యే చేస్తాడు. 

------ X X X -------


పి. వి. పద్మావతి మధు నివ్రితి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

 నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను. 


మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా). 


మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)


నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి. 


మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై). 


మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు. 


మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి. 



మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు. 


 ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. 


మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను. 


ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ... 


పి. వి. పద్మావతి మధు నివ్రితి

(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)


ఈ: pvmadhu39@gmail. com


(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము). 






46 views0 comments

Comentarios


bottom of page