అంతం.. ఆరంభం
- Chaturveadula Chenchu Subbaiah Sarma
- Jul 21
- 2 min read
#AnthamArambham, #అంతంఆరంభం, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #TeluguHeartTouchingStories

Antham Arambham - New Telugu Story Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 21/07/2025
అంతం.. ఆరంభం - తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
జనన మరణాలు సృష్టిలో ప్రతి జీవికి, వృక్షాలకు మనుష్యులకు తధ్యం.. అందుకే అన్నారు.. మన పెద్దలు ’పునరపి జననం.. పునరపి మరణం..’ కాలచక్ర భ్రమణంలో జనన మరణాలు నిరంతరం జరుగుతూనే వుంటాయి.
కొందరు.. తమ తల్లిదండ్రుల పెంపకంలో పై జీవిత తత్వాన్ని తెలుసుకొని జీవన గమనంలో.. అనిత్యమైన వాటికి ప్రాధాన్యం ఇవ్వకుండా.. తటస్థంగా ఎంతవరకు పరిమితమో.. అవసరమో.. ఆలోచించి ఇంటా బయటా నడుచుకొంటారు.. వారికి సంఘంలో మంచిపేరు.. మర్యాద.. మన్ననలు వుంటాయి.
మరికొందరు.. పైవారికి పూర్తి వ్యతిరేకంగా.. జీవిత సత్యాన్ని గురించి ఏనాడూ ఆలోచించకుండా.. వయస్సు పెరిగే కొద్దీ.. స్వార్థం.. అవివేకంతో అంతా తామేనని.. వారికి తెలియనిదంటూ లేదని.. అహంకారంతో సమాజంలో జీవితాన్ని సాగిస్తారు. వీరికి గొడుగులు పడుతూ.. జేజేలు పలుకుతూ కొందరు మూర్ఖులు.. వారి వెనుక నడుస్తూ వుంటారు.
ముందున్న ఆసామి.. వెనకున్న వారినందరినీ చూచి.. వీరంతా నా బలం.. బలగం.. నా వారు.. నా మాటకు కట్టుబడి వుంటారు.. నా మాటకు చేతలకు తిరుగులేదని.. స్వాతిశయంతో విర్రవీగుతారు. పంచభూతాల ఆధారంగా నడిచే మానవుడు.. చుట్టూ వున్న ప్రకృతి.. రెంటికీ చీకటి.. వెలుగులు సహజం.. కాలచక్ర భ్రమణంలో ఒక దశ తర్వాత మరొక (మారిన) దశ తప్పదు.
బంగారు బాబుగారు ప్రజానాయకుడు. ముఫ్ఫై సంవత్సరాల రాజకీయ చరిత్ర వున్న మహా పురుషుడు. స్వ వర్గానికి వారు దేవుడు. వైరి వర్గానికి వారు రావణుడు. ఇప్పటికి మూడు పార్టీలు మారారు. మూడు రకాల జండాలు కారుకు కట్టుకొని ప్రచారం సాగించారు. గతంలో ఆరోసారి విజయులైనారు.
ఏడవసారికి వాతావరణం మారిపోయింది. స్వజనంలో సీనియర్లకు ఎప్పుడూ ఈయనేనా!.. అనే వికృత భావన.. ఫలితంగా వర్గంలో రెండు చీలికలు.. బంగారు బాబుకు ఓటమి.. ఆనంద్ బాబుకు గెలుపు. ప్రీతిగా పిలిచినా పలికే నాథుడు లేని దుస్థితి.. మనస్సున బాధ.. అవమానం.. ఆవేదన..
అప్పుడు గతం గుర్తుకు వచ్చింది. చేసిన తప్పులు.. నేరాలు అన్నీ.. బంగారు బాబుకు సింహావలోకనం అయినాయి. తన తల్లి తండ్రి తనను అసహ్యించుకొని స్వగ్రామానికి వెళ్ళిపోయారు. ఆ గత స్పృతుల వేదనలో భోరున ఏడ్చాడు.
ఎప్పుడో.. ఎక్కడో.. విన్నమాట.. ’పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తమ్ వేరే లేదు’ హృదయంలో సంచనలం! చిన్ననాటి జ్ఞాపకాలు.. తన తల్లిదండ్రులు ఆ రోజుల్లో తనపై చూపిన ఆదరాభిమానాలు గుర్తుకు వచ్చాయి. స్వార్థం అంతరించింది. హృదయంలో పరమార్థం ఆరంభం.. పార్టీకి రాజీనామా చేశాడు. కుటుంబంతో నగరం నుండి.. తాను పుట్టిన గ్రామంలో వున్న తల్లిదండ్రుల వద్దకు.. మారిన మనసుతో బయలుదేరాడు బంగారుబాబు.
సమాప్తి
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments