మీ ఇంటి వంట-నీ చేత్తో తింటా
- Veluri Sarada

- 7 minutes ago
- 3 min read
#MeeIntiVantaNeeChetthoThinta, #మీఇంటివంటనీచేత్తోతింటా, #Mayukha, #మయూఖ, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Mee Inti Vanta Nee Chettho Thinta - New Telugu Story Written By Mayukha Published In manatelugukathalu.com On 28/11/2025
మీ ఇంటి వంట నీ చేత్తో తింటా - తెలుగు కథ
రచన: మయూఖ
"ఏవండోయ్! రేపు ఆదివారం ఏం పనులు పెట్టుకోకండి. మన ఇంటికి ఏ బి సి డి ఛానల్ వాళ్ళు వస్తున్నారు. "మీ ఇంటి వంట-నీ చేత్తో తింటా" ప్రోగ్రాం మన ఇంట్లో జరుగుతుంది. మీరు మీ ఫ్రెండ్స్ ని కూడా తీసుకురండి. అయినా రమ్మంటే ఎందుకు రారు లెండి. పైసా ఖర్చు పెట్టక్కర్లేకుండా, ఫ్రీగా టీవీలో పడతారుగా! వస్తారులెండి" అంటూ హడావుడి పడుతోంది పంకజాక్షి.
పంకజాక్షికి టీవీ పిచ్చి. ప్రతి ప్రోగ్రాం, ప్రతి సీరియల్, ఛానల్స్ మార్చి మార్చి చూస్తూనే ఉంటుంది. ఎప్పుడో వంటల ప్రోగ్రాం కి రాస్తే వాళ్ళు ఇప్పుడు ఒప్పుకున్నారు. "ఆదివారం వస్తామని, చుట్టుపక్కల అందర్నీ కూడా పిలవమని చెప్పారు". దాంతో హడావిడి ఎక్కువైంది పంకజాక్షికి.
అప్పారావు కూడా అనుకున్నాడు "ఫ్రీగా టీవీ లో రావచ్చు. ఫ్రెండ్స్ అందరినీ పిలిస్తే, ఆఫీసులో తన పరపతి కూడా పెరుగుతుంది, రూపాయి ఖర్చు లేని ఫ్రీ పబ్లిసిటీ. మేనేజర్ ని ఇంటికి వెళ్లి స్వయంగా పిలిస్తే రేపు రాబోయే ఆ ప్రమోషన్ కి కూడా ఉపయోగపడుతుంది కదా!" కాగల కార్యం గంధర్వులే తీర్చారని" ఆ టీవీ ఛానల్ పుణ్యమా అని, "స్వామి కార్యం, స్వకార్యం" రెండు అవుతాయి అనుకుని, హుషారుగా ఈల వేసుకుంటూ "వస్తానోయ్ పంకీ! నువ్వు చెప్పినట్లుగానే అందరిని పిలుస్తాను"! అన్నాడు.
"దీనికేం తక్కువ లేదు. పంకీట! పంకీ! వంకీ చేయించమని మీకు ఎన్ని సార్లు మొత్తుకున్నాను" అంటూ దండకం మొదలెట్టింది.
"బాబోయ్! బుద్ధి తక్కువై పంకి అన్నాను. అనవసరంగా నేనే ఎత్తుకున్నాను. పంకి అన్నప్పుడల్లా దానికి వంకీ గుర్తుకొస్తుంది "అనుకుంటూ, “సర్లే! వెళ్ళొస్తాను!” అంటూ చల్లగా జారుకున్నాడు అప్పారావు.
అప్పారావుకి ముద్దొచ్చినప్పుడల్లా పంకజాక్షిని పంకి అనడం అలవాటు. దాంతోపాటే తిట్లు కూడా తినడం పరిపాటి అయిపోయింది.
పంకజం చుట్టుపక్కల వాళ్లకి అందరికీ చెప్పింది.
అందరూ తినడానికి రెండు కేజీల స్వీటు, రెండు కేజీల హాటు తెప్పించింది. కూల్ డ్రింక్స్ సరే సరి. పేపర్ ప్లేట్స్, డిస్పోజబుల్ గ్లాసులు, ఏబిసిడి ఛానల్ వాళ్ళకి స్వాగతం చెప్పడానికి బ్యానర్ తయారు చేయించింది.
అర్బన్ కంపెనీకి ఫోన్ చేసి వాళ్ల చేత ఇల్లంతా క్లీన్ చేయించింది. ఇల్లంతా కొత్త కర్టెన్స్ తో నీట్ గా పెట్టింది. "తన పక్కన ఎవరిని నుంచో పెట్టుకోవాలి? పక్కింటి నీరజా! ఎదురింటి జలజా!
ఉహూ! ఇద్దరూ వద్దులే!
వాళ్లని దూరంగా నుంచో మంటా! ఎందుకంటే వాళ్లు తనకంటే అందంగా ఉంటారు. వీధి చివర ఉన్న బామ్మ గారిని నా పక్కన పెట్టుకుంటాను. ఆవిడ పెద్దావిడ కాబట్టి నా అందానికి ఢోకా లేదు” అనుకుంది
ముందు రోజు అందరికీ మరీ మరీ చెప్పింది. మధ్యాహ్నం భోజనాలు అయిన వెంటనే వచ్చేయమని
అందరూ మధ్యాహ్నం ఒంటి గంటకే బిల బిల్లా డుతూ వచ్చేసారు. ఛానల్ వాళ్ళు రెండు గంటలకి వస్తానన్నారు. 3, 4 అయిపోతోంది కానీ, వాళ్ళ జాడలేదు. ఇంతట్లోకి పిల్లలందరూ'ఆకలని ఏడుపులు .
సర్లే! అన్ని తెప్పించాను కదా అని, స్వీటు, హాటు ప్లేట్లలో పెట్టి అందరికీ ఇచ్చింది పంకజాక్షి. స్వీట్లు ఇంకా కావాలని పిల్లలు గొడవ. నీళ్ల గ్లాసులు తన్నడం, నీళ్లు ఒలికిపోయి ఇల్లంతా చిందరవందరగా తయారయింది.
అప్పుడు రయ్ మని వ్యాన్ మీద నుంచి దిగారు ఛానల్ వాళ్ళు. వాళ్లని చూడడానికి ఎక్కడి వక్కడ వదిలేసి అందరూ పెద్దాళ్ళతో సహా బయటకు పరుగులు తీశారు.
40 ఏళ్ల యాంకర్ 25 ఏళ్ల పిల్లలా సింగారించుకుని హొయలు పోతూ మైక్ తీసుకుని దిగింది.
పంకజాక్షి, అప్పారావు అందరినీ పరిచయం చేశారు. కుర్ర కెమెరామెన్ అందరినీ ఒకసారి తన కెమెరాలో బంధించాడు. కెమెరాకి ఫోజు ఇవ్వడానికి అందరూ పోటీపడ్డారు.
యాంకరమ్మ డబుల్ మీనింగ్ జోకులతో మొత్తానికి పంకజాక్షి వంట పూర్తి చేసింది.
"మీ ఇంటి వంట-నీ చేత్తో తింటా" కార్యక్రమంలో ఎవరు పెడతారు నాకు? అంటూ అప్పారావుని క్రీ కంట చూసింది. అప్పారావు ఉత్సాహంగా ముందుకు కురికేడు. పంకజాక్షి ఉరివి చూసింది.
భయంతో అప్పారావు రెండు అడుగులు వెనక్కి వేశాడు.
"అబ్బో! అప్పారావు లో ఈ యాంగిల్ కూడా ఉందా"! అనుకున్నారు కొలీగ్స్.
పంకజాక్షి యాంకరమ్మ కి తినిపించింది. అప్పారావు మేనేజర్ ని స్పెషల్ గా పరిచయం చేశాడు.
కార్యక్రమం పూర్తయి ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు.
ఫలానా రోజు కార్యక్రమం వస్తుందని తెలియడంతో అందరూ టీవీలకి అతుక్కుపోయారు. చిత్రంగా వంటచేసిన పంకజాక్షితో సహా అందరూ బ్లర్ గా కనిపించారు. ఒక్క పదహారేళ్ల అమ్మాయి తప్ప. కెమెరా అయితే అమ్మాయి వైపు ఉన్నప్పుడు క్లారిటీగా ఉండేది. అప్పారావు భయంతో బిగుసుకుపోయాడు మేనేజర్ ని తలుచుకుని.
"ప్రమోషన్ మాట దేవుడెరుగు, డి మోషన్ రాకుండా ఉంటే చాలు"అనుకున్నాడు. పంకజాక్ష అయితే ఆ టీవీ ఛానల్ ని దుమ్మెత్తి పోసింది. కొసమెరుపు ఏంటంటే కెమెరామెన్, ఆ అమ్మాయి ఆ మర్నాడే ఉడాయించారని తెలిసింది.
******శుభం *******
మయూఖ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :
63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పరిచయ వాక్యాలు:
నా పేరు శారద
విద్యార్హతలు: ఎమ్.ఎ
నాకు చిన్నతనం నుంచి కథలు నవల అంటే ఇష్టంగా ఉండేది.
నేను ఇదివరలో ఆంధ్రభూమికి వివిధ పత్రికలకి చిన్న చిన్న కథలు రాసి పంపేదాన్ని.
తర్వాత కాలంలో మానేసాను. ఈమధ్య మళ్ళీ నా రచన వ్యాసం గాని మొదలుపెట్టాను.
నా కథలు వివిధ పత్రికలకి ఎంపిక చేయబడ్డాయి.
ఉగాది, సంక్రాంతి కథల పోటీలకి ఎంపిక చేయబడ్డాయి
మా అబ్బాయి ప్రోత్సాహం తో వివిధ పత్రికలకి పంపడం జరుగుతోంది.



Comments