top of page
Original.png

సమంత వెడ్స్‌ సత్తిపండు

#AyyalaSomayajulaSubrahmanyam, #సమంతవెడ్స్‌సత్తిపండు, #SamanthaWedsSatthipandi, #అయ్యలసోమయాజులసుబ్రహ్మణ్యము, #కొసమెరుపు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

ree

Samantha Weds Satthipandu - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 27/11/2025

సమంత వెడ్స్‌ సత్తిపండు - తెలుగు కథ

రచన: అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము   

ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

“ప్రేమించి పెళ్ళి చేసుకో, నీ మనసంతా హాయి నింపుకో..”


ఈ పాట అంటే సతీష్. కి చాలా ఇష్టం. ఎన్ని సార్లు విన్నాడో తనకే తెలియదు. ఆ పాట

విని వినీ ‘కుదిర్చిన పెళ్ళి కాకుండా, ప్రేమించి పెళ్ళి చేసుకోవాలని గట్టి నిర్ణయానికి 

వచ్చేశాడు. 


సతీష్ కు వరసైన, పెళ్ళికి ఎదిగిన మరదలు పిల్ల ఉంది. ”ఒరేయ్సత్తిపండు, మా అన్నయ్య కూతురు సుబ్బలక్ష్మిని చేసుకోరా.. బాగుంటుంది. నువ్వు అంటే దానికి చాలా ఇష్టంరా.. ”


తల్లి కనకాంగి గోముగా అడిగింది. కాదు పొమ్మన్నాడు. 


“ఒరేయ్‌; నాకు అదొక్కతే కూతురు. నా తదనంతరం ఆస్తి అంతా నీదే అవుతుంది. నామాట వినరా.. ” అని మేనమామ త్యాగరాజు అన్నాడు. 


“నో” అన్నాడు సత్తిపండు ఉరఫ్‌ సతీష్‌. 


మేనరికం చేసుకుంటే పుట్టబోయే పిల్లలు అంగవైకల్యంతో పుడతారని ఏదో మెడికల్‌

జనరల్‌ లో చదివాడు. అది అతగాడి బుర్రలో పాతుకుపోయింది. అంతే కాదు సుబ్బలక్ష్మిది అన్నీ ఎడమచేతి వాటం పనులే. ఈ ఎడమచేతివాటం వాళ్ళు ఏదో జన్యులోపం వలన వస్తుంది. అందుకని సతీష్‌ సుబ్బలక్ష్మిని వద్దన్నాడు. 


పెళ్ళి అంటూ చేసుకుంటే సతీష్ బావనే చేసుకోవాలని గట్టి నిర్ణయానికి వచ్చింది. అందుకు కావలసిన ప్రణాళికలు సిద్దం చేసుకుంది. ఒక్క ఐడియా చాలు జీవితాన్ని మార్చేస్తుంది. 


అప్పుడు చూశాడు సతీష్ తన కేబిన్ ఎదురుగా ఒక అమ్మాయి నిలుచుని క్రెడిట్‌ స్లిప్‌ 

రాస్తోంది, ఎడమ చేతితో. ఐతే సతీష్‌ ఆమె అందమైన మోమును తదేకంగా చూస్తున్నాడు. అందం ద్విగుణీకృతంగా ఉండటంతో ఆమె నడుమును చూస్తున్నాడు. 


“అబ్బబ్బ; ఎంత అందంగా ఉంది ఈమె. ; నా గుండె వశం తప్పుతోంది.” అనుకున్నాడు. 


ఆమె చిరు మందహాసంతో ముంగురులను సున్నితమైన తన చేతివేళ్ళతో సవరించుకుని క్రెడిట్ స్లిప్, డబ్బులు సతీష్‌కు ఇచ్చింది తన ఎడం చేత్తో. సతీష్‌ కావాలని ఆమె చేతి వేళ్ళను తాకుతూ తీసుకుని “పేరు” అడిగాడు. 


“సమంత” అని చెప్పింది. ఆమె పెదవుల మీద చిరు మందహాసం అలానే ఉంది. 


“ఇక్కడ మీ కాంటాక్ట్‌ నెంబర్‌ రాయాలి.. ” అని పెన్నుతో క్రెడిట్ స్లిప్‌ మీద చూపించాడు. 


ఆమె నెంబర్‌ చెప్పింది. 

సతీష్‌ రాశాడు. నిజానికి ఫోన్‌ నెంబర్‌ అంత ముఖ్యం కాదు. తన భవిష్యత్తును ఊహించుకుంటూ సతీష్ అడిగాడు. 


ఆమె థాంక్స్ చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె నడకలో హంసనడక కనిపిస్తోంది. ఆ రోజు నుండి మన సత్తిపండు మనసు మనసులో లేదు. తినబుద్ది కావటం లేదు.. తాగబుద్ది కావటం లేదు.. నిద్రపోవటం లేదు. బుద్ది మంతుడిలా ఆమె నామజపం చేస్తూ కూర్చున్నాడు. 


“సమంతా.. సమంతా.. సమంతా.. అని సమంత ఇచ్చిన నంబర్‌ కు ఫోన్‌ చేశాడు. మన

 వాడి అదృష్టం పండింది.. సమంత వెంటనే ఫోన్‌ ఎత్తింది. 


 ఏవేవో మాట్లాడుతూ చివరికి ఆమెని కాఫీకి వచ్చేటట్లుగా ఒప్పించాడు సత్తిపండు ఉరఫ్‌ సతీష్‌. కాఫీడేక్లబ్‌ లో ఓమూల కార్నర్‌ టేబుల్‌ దగ్గర ఎదురెదురుగా కూర్చున్నారు సతీష్‌ ఉరఫ్‌ సత్తిపండు సమంత ఉరఫ్‌ సుబ్బలక్ష్మి. 


సత్తిపండు సమంతనే తదేకంగా చూస్తున్నాడు. ఆమెలో ఎవరివో పోలికలు కనిపిస్తున్నాయి. అయితే ఎవరో తెలియటం లేదు. కాఫీలు వచ్చాయి. 


 కాఫీ సిప్‌ చేస్తూ “ఊ.. చెప్పండి. అదే మాట్లాడాలని అన్నారు?” అంది సమంత. 


 సతీష్‌ తటపటాయించి “ఐ లవ్‌ యూ” అన్ని సమంత చేతిని మృదువుగా నొక్కాడు. 


 “నా గురించి మీకు, మీ గురించి నాకూ ఏమీ తెలియదు. ఎలా ప్రేమించుకుంటాం?”

 అంది సమంత. 


 “ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మా, నాన్న, అక్కాబావలు, .. వాళ్ళు కుదిర్చిన పెళ్ళి

 నాకిష్టం లేదు. మిమ్మల్ని చూశాను. మనసు అర్పించేశాను. లవ్‌ ఎట్‌ ఫస్ట్ సైట్.. ”

 అన్నాడు సతీష్‌. 


 “నేను అమ్మా, నాన్నలకి ఒక్కర్తినే కూతురినే. ఇక్కడ ఎమ్‌. బి. ఏ. చేస్తున్నాను. పేయింగ్‌

 గెస్ట్‌లా మా బంధువుల ఇంట్లో ఉంటున్నాను. అయితే నాది ఎక్కువగా ఎడం చేతివాటం.. ” అని తన గురించి చెప్పుకుంది సమంత. 


 “దేవుడు మనకు రెండు చేతులు ఇచ్చాడు. మీకు తెలుసా. ఎడం చేతి వాళ్ళు చాలా

 తెలివిగల వాళ్ళుంటారు. వాళ్ళలో జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది.. ” అని అన్నాడు

 సతీష్‌ ఆమెనే చూస్తూ.. 


 “మీరు ఎప్పు డైనా నవ్వుతూ అద్దంలో చూసుకున్నారా.. ?” అని అడిగాడు సత్తిపండు. 


“ఏం.. ?”


 “మీరు నవ్వుతున్నప్పుడు మీ బుగ్గలు బలేగా సొట్టలు పడతాయి. అప్పుడు మీ నవ్వు

 ఇంకా అందంగా ఉంటుంది. ” అని సతీష్‌ నవ్వాడు. 


 ఆమె కూడా నవ్వింది. 

 సతీష్‌ కి చాలా ఆనందంగా ఉంది. అందమైన అమ్మాయి తన సొంతం కాబోతుంది. ప్రేమలో ఇంతటి ఆనందం, మజా ఉంటాయని ఇంతవరకూ తెలియదు. అనుభవానికి వచ్చాక మనసు గాలిలో తేలిపోతున్నట్లుగా ఉంది. విశాఖ బీచ్‌ అంతా తిరిగేశారు. 

 సాగరతీరం, కైలాసగిరి, యారాడకొండలు. దుర్గగుడి.. వగైరా.. వగైరా.. వగైరాలన్నీ చెట్టా పట్టా లేసుకుని, రాసుకుంటూ, పూసుకుంటూ.. ఎండనకా.. వాననకా.. 


“పెళ్ళి చేసుకుందామా?” అని అడిగాడు సత్తిపండు సమంత చేతిని తన చేతిలోకి తీసుకుని. 


“నాకూ ఇష్టమే. అయితే మా ఇంట్లో “ అని ఆగిపోయింది సమంత. 


“మా ఇంట్లో కాదనరు. అయితే ముందుగా నిన్ను మా ఇంటికి తీసుకువెళతాను. మా వాళ్ళకి నిన్ను పరిచయం చేస్తాను. ఈ అందాలరాశిని చూశాక ఎవరైనా కాదంటారా? చెప్పు.. ” అని ఆమె చేతిని సుతారంగా ముద్దాడి చనువుగా ఆమె చేతిలోని సెల్‌ ను చేతిలోకి తీసుకున్నాడు సతీష్‌ అనబడే సత్తిపండు. 


సెల్‌ లో ఆమె ఫోటోల కోసం వెదుకుతుంటే ఎవరెవరివో ఉన్నాయి. ”ఇదేంటీ నీ సెల్‌ లో నీ ఫోటోలు లేకుండా ఎవరెవరివో ఉన్నాయి. ఎవరు వారంతా?” ఆశ్చర్యంగా అడిగాడు సత్తిపండు. 


“వాళ్ళంతా ఎడమ చేతి వాటంవాళ్ళు. ఇలా చాలా మంది ప్రముఖులు ఉన్నారు. గాంధీ, మోడీ, రజనీకాంత్‌, ఒబామా, బిల్‌గేట్స్‌ మొదలైనవారు. దేశజనాభాలో పదిశాతం మంది ఎడమచేతి వాటం వాళ్ళున్నారు. తన ఎడం చేతిని అటూ ఇటూ తిప్పుతూ ధారాళంగా చెప్పుకుపోతున్న సమంత వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. 


అతనికి ఆమెలో ఎవరో కనిపిస్తున్నారు. “ఎవరు? ఎవరు? ఎవర్నువ్వు?” అడిగాడు సతీష్‌గా పిలవబడే సత్తిపండు. 


ఊహించని ఈ ప్రశ్నకు సమంత షాక్‌కి గురైంది. మరుక్షణం సతీష్‌ సమంతను అక్కడ వదిలేసి ఇంటికి వచ్చేశాడు తన బైక్‌ మీద. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఇంటికి తాళం వేసి ఉంది. ఈలోగా పక్కింటి వనజాక్షి పిన్ని వచ్చి తాళం ఇచ్చింది. 


“పిన్నీ; మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు. నీకేమయినా తెలుసా? ఏమైనా చెప్పారా?” ఆతృతగా అడిగాడు సతీష్‌. 


“అదేంటీ.. నీకు తెలీదా? నీ మేనమామ కూతురు పెళ్ళటగా. అక్కడికి వెళ్ళారు.. ” అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. 


సత్తిపండు నేలమీద మోకాళ్ళమీద కూలబడి పోయాడు. ” తప్పు చేశాను. పిచ్చిపిచ్చి ఆలోచనలతో ప్రేమా, దోమా అని బంగారంలాంటి సుబ్బలక్ష్మి ని కాదనుకున్నాను”.. కంట తడి పెట్టుకుంటూ రైల్వేస్టేషన్ కు పరుగులు తీశాడు. 


వైజాగ్‌ నుండి అనపర్తి వెళ్ళాలి. పెళ్ళి ఆపాలి. నేను సుబ్బులు కలిసి తిరిగాం. తను నా కన్నా నాలుగేళ్ళు చిన్నది. అయినా మహా హుషారు. రాళ్ళతో మామిడికాయలు కొట్టి ఉప్పు కారం అద్ది నాకు ఇచ్చేది. ఉడకబెట్టిన పల్లీలు, మొక్కజొన్న పొత్తులు రుమాలుకు చుట్టి బొడ్డులో దాచి నాకోసం తెచ్చేది. 


సుబ్బులు ఏ పనిచేసినా ఎడమచేతి తోనే చేసేది. అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు దేనికీ? సత్తిపండుకు గతమంతా రీలులాగా గుర్తుకొస్తోంది. పంటకాలువలో పడి కొట్టుకుపోతున్న నన్ను ఈదుకుంటూ వచ్చి రెక్కట్టుకుని లాగి సుబ్బులు ప్రాణాలకు తెగించి రక్షించింది. అలాంటికి ఎడంచేతివాటం అని వద్దు పొమ్మన్నాడు. అదేదో పెద్ద జబ్బు అన్నట్లు. 

“ఏం ఎడమచేతి వాళ్ళు మనుషులు కారా?”వాళ్ళకి మనసులు, కోరికలు ఉండవా?”


“ఎడం చెయ్యి మంచి చెయ్యి అంటారే* లెఫ్ట్‌ హ్యాండ్ ఈజ్‌ కరెక్ట్‌ హ్యాండ్‌) సత్తిపండు

 కి పిచ్చెక్కిపోతోంది. 


 రైలు ఎక్కాడు. బస్సు ఎక్కాడు. ఆటో ఎక్కాడు. ఇప్పుడు పరుగులాంటి నడకతో పెళ్ళిమండపం వైపు వెళ్ళాడు. తిండి లేదు. నిద్ర లేదు. జుత్తు చెరిగిపోయింది. బట్టలు మట్టికొట్టుకుపోయాయి. మంగళవాద్యాలు సుస్వరంగా వినపడుతున్నాయి. 


“ఆపండి.. ఆపండి.. ఈ పెళ్ళి ఆపండి.. ” అని పెద్దగా కేకలు వేస్తూ పరుగు పరుగున వచ్చిపెళ్ళిమండపంలో స్పృహ తప్పి పడిపోయాడు సత్తిపండు. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా సమంత. 


“ఆ.. ;నువ్వేంటీ ఇక్కడా?” ఆశ్చర్యంగా, ఆదుర్దాగా అడిగాడు సతీష్‌. 


“ఆగు బావా.. నేను సుబ్బలక్ష్మి ని.. ”


“ఆ;”


“అవును.. నీకు హీరోయిన్ సమంత అంటే చాలా ఇష్టం కదా; అందుకని ఈ గెటప్ లో వచ్చి నీతో ఈ ప్రేమాట ఆడాను” అంది సుబ్బలక్ష్మి. 


“మరిప్పుడు జరిగే పెళ్ళి ఎవరిది?”


“అది మాకు తెలిసిన వాళ్ళది”. 


“మరి.. మరి మా ఇంటిదగ్గర పక్కింటి పిన్ని ఏంటీ అలా చెప్పింది?” అమాయకంగా అడిగాడు సత్తిపండు. 


“అలా చెప్పమన్నారు.. ” అని అక్కడున్నవారంతా కోరస్‌గా గొల్లుమని నవ్వారు. 


సత్తిపండు సుబ్బలక్ష్మి చేతులు పట్టుకుని “నన్ను క్షమించవే” అన్నాడు. 


ఆమె కళ్ళతోనే క్షమించేసింది. 


కొసమెరుపు. ; తనను వద్దన్న బావను మరదలు పిల్ల “మడతఖాజా” తినిపించి తనవాడిగా చేసుకుంది. 


——————————————శుభంభూయాత్‌————————————————


అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం


కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

 రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.


అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.


ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,


ఆంధ్రభూమి, దేశభక్తిసాహిత్య ఈ పత్రిక, సహరి, మిసిమి,తపస్విమనోహరం,మాధురి


మాసపత్రిక,ఉషాపక్షపత్రిక, సుమతి మాస పత్రిక, షార్‌ వాణి,మన తెలుగు కథలు.కామ్‌.


బిరుదులు- సాహిత్యవిక్రమార్క- దేశభక్తిసాహిత్య ఈ పత్రిక


ఉత్తమ రచయిత- మనతెలుగుకథలు.కామ్‌.


కలహంస—- నెలవంక- నెమలీక మాస పత్రిక.


ప్రథమబహుమతులు- నవలల విభాగము- మనతెలుగుకథలు.కామ్‌ మరియు


త‌పస్విమనోహరము.


ప్రథమద్వితీయబహుమతులు— కథల విభాగము- సహరి, మనతెలుగుకథలు.కామ్‌


చారిత్రక నవలలో ప్రథమ, ద్వితీయబహుమతులు.


సాంఘికనవలలో ద్వితీయ, కన్సోలేషన్‌ బహుమతులు.


ఇవేకాక ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, ,రాజకీయ సంబంధించి పెక్కు వ్యాసాలు పత్రికల్లో వస్తూంటాయి.


కవితలు కూడా అన్ని విషయాల మీద కూడా వస్తూంటాయి.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ree


ree



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page