అనుభవం - ఆవిష్కారం!
- A . Annapurna
- Jul 17
- 1 min read
#AAnnapurna, #ఏఅన్నపూర్ణ, #అనుభవం, #ఆవిష్కారం, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Anubhavam Avishkaram - New Telugu Poem Written By A. Annapurna
Published In manatelugukathalu.com On 17/07/2025
అనుభవం - ఆవిష్కారం! - తెలుగు కవిత
రచన: ఏ. అన్నపూర్ణ
ఉత్తమ అభ్యుదయ రచయిత్రి
విరి తోటలో పూచిన పూలు ఎన్నో కనువిందు చేశాయి
చేయి తగిలితే చాలు కమిలిపోతాయి
అవి కల కళలాడేది మూడునాళ్ళే అయినా
మురిపించి సుగంధాలు వెదజల్లి తరించిపోతాయి
పుట్టిన ప్రతిజీవి ఈ లోకానికి వీడుకోలు చెప్పక తప్పనిది
అందుకే గుర్తువుండేలా మంచిపని చేయడమే పుట్టుక ప్రయోజనం కావాలి
అవయవదానంతో ఒకరి జీవితం నిలబెట్టవచ్చు
మంచిచదువు చెప్పించి ఉపాధి కల్పించవచ్చు
లక్ష రూపాయల నగ కొనడంకంటే
ఆపెట్టుబడి ఒకరి జీవితానికి ఆలంబన కావచ్చు
ఆభరణం అందానికి -ఆడంబరానికి గుర్తుకావచ్చునేమో
కానీ ఒకరికి ప్రాణం నిలబెడుతుంది
విద్య అంటే కేవలం పరీక్షలు డిగ్రీలు కావు
బ్రతుకుతెరువుకు సోపానాలు
నీ ఆవిష్కరణలు కావాలి
అది ఏరంగమైనా జీవనోపాధికి ఆలంబన కావాలి
తలెత్తుకుని తిరిగే ధైర్యం కావాలి
ఒకో తేనెబొట్టును కూడబెట్టే భ్రమరం
స్వాతి చినుకుతో విలువపెంచుకునే ముత్యం
పుల్లా పుడకా గడ్డి పోచలూ తెచ్చి గూడుకట్టే చిన్నారి పిట్టా
మనకు ఆదర్శం కాదా
పిడికెడు అన్నం పెడితే చాలు విశ్వాసమే ఊపిరిగా
మనజీవితకాలం తోడుగా ఉంటుంది జాగిలం
కళ్ళముందు జీవితాన్ని ఆవిష్కరిస్తుంది గొప్ప అనుభవం !
*******************

-ఏ. అన్నపూర్ణ
Comments