top of page

అసలు విషయం

#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #AsaluVishayam, #అసలువిషయం, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #కొసమెరుపు


Asalu Vishayam - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 08/05/2025

అసలు విషయంతెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


"ఏమండీ..! మన అబ్బాయి రాజు బాగా చదవాలి..పెద్ద ఇంజనీర్ అవ్వాలి.."


"నిజమే సరోజ..! నా కల కూడా అదే..దానికోసం వాడిని బాగా చదివించాలి..వాడు బాగా చదువుకుని, మనల్ని ఉద్దరించాలి.." అన్నాడు భర్త. 


"సరే అండి..మీలాంటి వారు మాకు తోడుంటే, ఏమైనా సాధ్యమే" అంటూ పొంగిపోయింది భార్య సరోజ. 


అబ్బాయి పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. స్కూల్ లో ఎప్పుడూ రాజు ఫస్ట్ వస్తున్నాడు. తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. 


ఒకరోజు అనుకోకుండా భర్త ఆఫీస్ నుంచి సరోజకి ఫోన్.. తన భర్త యాక్సిడెంట్ లో చనిపోయాడని. భర్త చనిపోయినా..ఆయన ఆశయం మేరకు, కొడుకుని బాగా చదివించాలని అనుకుంది సరోజ. అలాగే చదివిస్తున్నాది. కొడుకుతో రోజూ స్కూల్ కి వెళ్లి.. తాను కూడా క్లాసెస్ విని, ఇంటికి వచ్చి.. మళ్ళీ రాజుకు చెప్పేది తల్లి సరోజ.


రాజు పెరిగి పెద్దవాడయ్యాడు. ఒక పక్క చదువుకుంటూ..నైట్ టైం పార్ట్ టైం జాబ్ చేసి డబ్బులు సంపాదించి దాచేవాడు. తల్లి వద్దని చెబుతున్నా..తండ్రి బైక్ నడిపేవాడు రాజు. చదువులో కూడా మార్కులు తగ్గిపోవడం గమనించింది సరోజ. అడిగితే, నెక్స్ట్ టైం బాగా చదువుతాను అంటూ చెప్పేవాడు రాజు.


ఒకరోజు అనుకోకుండా...


"మేడం..! ఈ లెటర్ మీ అబ్బాయి పక్కన దొరికింది.. అందులో అడ్రస్ చూసి మీకు ఇస్తున్నాము.." అంటూ పోలీసులు ఇంటికి వచ్చి చెప్పారు.


లెటర్ ఓపెన్ చేసింది సరోజ..


"నీకు ఎప్పటినుంచో ఒక విషయం చెబుదామని అనుకుంటున్నాను.. కానీ చెప్పలేకపోయాను అమ్మా..! నీకు చెప్పకుండా ఇన్నాళ్ళు దాచినందుకు దేవుడు నాకు సరైన శిక్ష వేస్తున్నాడు"


"లెటర్ చదివిన తర్వాత..ఇంతకీ మా అబ్బాయి ఎక్కడ..? వాడు ఎప్పుడూ ఇంతే..! సరదాగా దాక్కుంటాడు.."


"సారీ మేడం..! మీ అబ్బాయి యాక్సిడెంట్ లో చనిపోయాడు..వెరీ సారీ. ఆ లెటర్ చనిపోయేముందు మీ అబ్బాయి రాసినదే"


ఆ మాటలు విన్న తల్లి హృదయం పగిలిపోయింది..


"అబ్బాయిని పోగొట్టుకున్న తాను, యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఆరా తీసింది. తాగిన మత్తులో బండి డ్రైవ్ చేయడంతో అబ్బాయి డివైడర్ కి గుద్దుకుని మరణించాడని తెలిసింది. తన భర్త కూడా యాక్సిడెంట్ లో మరణించాడని గుర్తుచేసుకుంది సరోజ. వెంటనే, పేపర్ లో ఇలా ప్రకటన ఇచ్చింది..


"మా అబ్బాయి మందు తాగి బండి నడిపిన కారణంతో యాక్సిడెంట్ లో చనిపోయాడు. అందుకే తాగి బండి నడపొద్దని అందరికీ నా మనవి. ఒక నెల కిందట, మా ఆయన కూడా యాక్సిడెంట్ లో మరణించారు. ఆయనకి ఏ పాడు అలవాటు లేదు. మాలాగ ఇక మీదట ఎవరూ బలి కావడం నాకు ఇష్టం లేదు. ముఖ్యంగా..పిల్లల్ని ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూ ఉండండి.."


మర్నాడు ఉదయం సరోజ గుమ్మం తలుపు తీసేసరికి...ఎదురుగా పోలీసులు ఉన్నారు. 


"ఏమైంది..?" అంటూ ఆత్రంగా అడిగింది సరోజ. 


"మేమంతా మీరు ఇచ్చిన ప్రకటన చూసి వచ్చాం. మీకు ఒక విషయం చెప్పాలి. మీ ఆయన యాక్సిడెంట్ లో మరణించడానికి కారణం మీకు చెప్పాలి. ఆ రోజు మీ అబ్బాయి తాగి యాక్సిడెంట్ చెయ్యడం చేతనే మీ ఆయన చనిపోయారు. చనిపోయేముందు ఈ విషయం మీకు చెప్పవద్దని, అబ్బాయిని ఏమీ చేయవద్దని మాదగ్గర మాట తీసుకున్నారు మీ వారు. ఇప్పటికీ ఈ విషయం మీకు చెప్పకపోతే, మా అంత చెడ్డవారు ఉండరేమోనని చెబుతున్నాము" అంటూ అసలు విషయం చెప్పారు పోలీసులు.


*********

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

YouTube Playlist Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


1 Comment


మంచి విషయం, సూటిగా చెప్పిన కథ. తండ్రిని పోగొట్టుకున్న అతనిలో మార్పు రాకపోవడం విషాదమే

Like
bottom of page