top of page

అతను.. అతను కాదు పార్ట్ - 2


'Athanu Athanu Kadu - Part 2/2' - New Telugu Story Written By Mohana Krishna Tata 

Published In manatelugukathalu.com On 15/05/2024 

'అతను.. అతను కాదు పార్ట్ - 2/2తెలుగు పెద్ద కథ

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


కిరణ్, రాము బండి మీద ఒక అడవి నుంచి వెళ్తూ, బండి ఆగిపోవడంతో అడవిలో చిక్కుకుపోతారు. రాత్రి అవడం చేత, అక్కడే మంట వేసుకుని ఉంటారు. దెయ్యాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు.. కిరణ్ తనకి దెయ్యాలంటే భయం లేదని.. తన కథ చెబుతాడు. రాము ఆ కథని అసక్తిగా వింటాడు. 


కిరణ్, కళ్యాణి అద్దె ఇంటి నుంచి కొత్త ఇల్లు కొనడానికి చూస్తారు. కళ్యాణి కోరిక మీద, కిరణ్ తక్కువ లో సెకండ్ హ్యాండ్ ఇల్లు కోసం చూస్తాడు. చాలా ఇళ్ళు చూసిన తర్వాత, ఇద్దరికీ ఒక ఇల్లు బాగా నచ్చుతుంది. 


ఇల్లు కి పెయింట్ వేయించకుండా, దిగిపోదామని కిరణ్ అంటే, ఇద్దరూ ఇంట్లో దిగిపోతారు. ఆ రోజు రాత్రి అవుట్ హౌస్ నుండి ఏవో ఏడుపులు వినిపిస్తే, కిరణ్ వెళ్లి చూస్తాడు. మర్నాడు ఒకతను ఇంటికి వస్తాడు. అతను మర్నాడు తనని ఎక్కడో డ్రాప్ చెయ్యమని అడుగుతాడు. అతను చెప్పినట్టే అన్నీ జరుగుతాయి. ఒకరోజు అనుకోకుండా అతను కిరణ్ ఇంటికి వస్తాడు. 



ఇక అతను.. అతను కాదు పెద్దకథ చివరి భాగం చదవండి.. 


"ఈ ఇల్లు మీరు కొన్నారా.. ?" అని అడిగాడు అతను 

"అవును సర్.. బాగుందా.. ?"

"వెంటనే పెయింట్ వేయించండి.. ఇల్లు చాలా పాతది లాగ ఉంది.. " అన్నాడు అతను

"ఉండండి.. మా ఆవిడని పరిచయం చేస్తాను.. " అని కల్యాణిని పిలిచాను 


కొంతసేపటికి కళ్యాణి వచ్చింది. సర్ ని కళ్యాణి కి చూపించి పరిచయం చేసాను. అప్పుడు నా వైపు వింతగా చూసింది కళ్యాణి. నాకు ఏమీ అర్ధం కాలేదు. ఏమిటని అడిగాను. పక్కకు రమ్మని పిలిచింది కళ్యాణి.. 


"ఏమిటి చెప్పు.. ఇలా పక్కకు పిలిస్తే అతను ఏమనుకుంటారు.. ?"

"ఎవరు అనుకునేది.. ? అక్కడ ఎవరూ లేరు.. " అని కోపంగా చూసింది కళ్యాణి 

"సోఫా లో అతను ఉన్నారుగా.. ?"


"రాత్రి మీకు నిద్ర లేదా ఏమిటి.. ఇలా మాట్లాడుతున్నారు.. అక్కడ ఎవరూ లేరు.. " అని చెప్పి వెళ్ళిపోయింది కళ్యాణి 


మళ్ళీ హాల్ లోకి వచ్చి, అతనిని చూసి.. "ఇంతకీ మీరు ఎవరు.. ? నిజం చెప్పండి.. ! జరిగేవి ముందుగా మీకు ఎలా తెలుస్తున్నాయి.. ? నాకు మాత్రమే మీరు కనిపిస్తున్నారు.. " అని అడిగాను


"నేను మీలాగ బతికున్న మనిషిని కాను. నేను ఒక దెయ్యాన్ని. ఎన్నో సంవత్సరాల నుంచి మీ అవుట్ హౌస్ లోనే ఉంటున్నాను. నన్ను ఎవరైనా గుర్తుపడతారేమోనని ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసాను. కాని ఇప్పటివరకు నా ఆశ నెరవేరలేదు. ఆ రోజు రాత్రి నువ్వు విన్నది నా ఏడుపే. నా భార్యబిడ్డలు గుర్తుకొచ్చి అప్పుడు అలా బాధపడ్డాను. "


"దెయ్యమా.. ?" అని అడిగాను


"భయపడకు.. ఎవరికీ హాని చేసే దెయ్యాన్ని కాదు. ఎంతో మందికి నా గురించే చెప్పడానికి ప్రయత్నించాను. కానీ ఇంతవరకు నేను ఎవరికీ కనిపించలేదు. మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు, నువ్వు నన్ను చూసావు. అప్పుడే అనుకున్నాను నువ్వే నాకు సహాయం చేయగలవని.. "


అతను చెప్పిన మాటలు ఎలా నమ్మాలో అర్ధం కాలేదు. అందుకే, అతనిని ముట్టుకోవడానికి ట్రై చేశాను.. కానీ, నా వల్ల కాలేదు. అప్పుడే కంఫర్మ్ చేసుకున్న.. అతను చెప్పింది నిజమే అని.. 


"సర్.. ! మీకు నేను ఏ విధంగా సాయం చెయ్యగలను.. ?" అని మెల్లగా అడిగాను 


"ఇప్పుడు నువ్వు ఉంటున్న ఇంట్లోనే ఒకప్పుడు నేనూ నా భార్య, పిల్లాడితో సంతోషంగా ఉండేవాడిని. నా ఫ్యామిలీ కోసం ఎంతో చెయ్యాలని, చాలా డబ్బు సేవ్ చేసాను. అన్నీ ఒక చోట ఉంచాను. అదే విషయాన్ని నా భార్యకు చెప్పేలోపే, ఒక రోజు అనుకోకుండా ఒక యాక్సిడెంట్ లో నేను చనిపోయాను. భార్య పై ఉన్న ప్రేమతో నేను ఇంకా ఈ లోకంలోనే ఉండిపోయాను. ఇన్ని సంవత్సరాలూ, నాకు సహాయం చేసే మనిషి కోసం చూసాను, ఇప్పుడు నువ్వు వచ్చావు.. "


"నేను ఏం చెయ్యాలి.. ?"


"నేను పోయిన తర్వాత ఈ ఇల్లు వదిలేసి, నా భార్య.. పిల్లాడిని తీసుకుని వేరే చోటకి వెళ్లిపోయిందని తెలిసింది. వాళ్ళు డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేను చెప్పాల్సినది వాళ్ళకి చెప్పలేను.. ఎందుకంటే నేను వాళ్ళకి కనిపించను, నా మాట వారికి వినిపించదు. నువ్వు నాతో అక్కడికి రావాలి. నేను చెప్పిన విషయాన్ని నా భర్య తో చెప్పాలి.. "


"అలాగే సర్.. వస్తాను.. రేపే బయల్దేరదాము.. " 


మర్నాడు ఉదయం, ఇద్దరం ఒక రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఒక ఊరిలో ఉన్న ఇంటికి వెళ్ళాము. ఆ ఇంటి తలుపు కొట్టాను. ఒక ఆవిడ తలుపు తీసింది. పక్కనే ఒక పది సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఆమె కొడుకే అని గ్రహించాను. 


"ఎవరు కావాలి.. ?" అని అడిగింది ఆమె 


"మీ ఆయన, నేనూ మంచి ఫ్రెండ్స్. మీ అయన మీకు ఒక విషయం చెప్పమని అప్పట్లో నాకు చెప్పాడు. మీ అడ్రస్ తెలియక, మీకు ఇప్పటివరకూ నేను చెప్పలేకపోయాను. బ్యాంకు లాకర్‌ లో కొన్ని డాక్యుమెంట్స్, కొన్ని డిపాజిట్ వివరాలు ఉన్నాయంట.. " అని వాటి వివరాలు ఆమెకు చెప్పాను


"ఇంక మీరు హ్యాపీ గా ఉండొచ్చు. డబ్బుకి ఏమీ ఇబ్బంది పడనవసరం లేదు.. " అని సర్ పక్కనుంచి చెప్పినట్టే అన్నీ అతని భార్యకు చెప్పాను. అప్పుడు చూడాలి అతని కళ్ళలో ఆనందం, అతని పెదవులపై చిరునవ్వు. 


బయటకు వచ్చిన తర్వాత, అతను ఎంతో ఆనందంతో.. 


"నువ్వు నాకు చేసిన సహాయానికి చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు కోసమే, చాలా రోజుల నుంచి ఎదురు చూసాను. నువ్వు నా కోసమే, ఈ ఇంటికి వచ్చేవేమో. నేను నీకు కనిపించడం నా అదృష్టం. నా కోరిక తీర్చినందుకు నీకు నేను ఏమి ఇవ్వగలను.. ?" అన్నాడు అతను 


"ఒక మంచి పని చేసానన్న సంతృప్తి నాకు చాలు సర్.. " 

"అలా కాదు.. నీకు దెయ్యాల వల్ల ఎప్పుడూ ఏ హాని జరుగదని నీకు మాట ఇస్తున్నాను.. " అని చెప్పి అతను అదృశ్యమయ్యాడు


********


"నా జీవితంలో ఒక మంచి పని చేసినందుకు నేను చాలా ఆనందపడ్డాను.. " అని రాము తో అన్నాను 


"దెయ్యానికి సాయం చేసిన మహా మనిషివి నువ్వు.. " అన్నాడు రాము 


"అవును.. నా కథ తో తెల్లారినట్టుంది.. ఇక మన ప్రయాణం కొనసాగిద్దాం.. పద.. " అని అన్నాను 


=================================================================

 సమాప్తం

=================================================================

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:



Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ

42 views0 comments

Comments


bottom of page