అతిథి దేవోభవ

'Athidhi Devobhava' New Telugu Story
Written By Lakshmi Chivukula
రచన: లక్ష్మి చివుకుల
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
"అదేంటమ్మా! ఫోన్ లో మాట్లాడిన దగ్గర నుంచీ అలా డల్ గా అయిపోయావు.. ఏమయింది?" మా అత్తగారు అడిగారు నన్ను.
"ఈరోజు శివరాత్రి కదా! వంట చేయక్కరలేదు అనుకున్నాను. కానీ మా దూరపు బంధువులు.. భార్యా భర్తలు భోజనానికి వస్తానని ఫోన్ చేసారు. ఇదివరకు ఎన్ని సార్లు పిలిచినా రాలేదు. ఇప్పుడు వారంతట వారే ఈ ఏరియాలో ఏదో పనిమీద వస్తున్నారుట.
‘మేము ఉపవాసం వుండలేము అమ్మా! మధ్యాహ్నం భోజనం చేస్తాము ఇదివరకు నువ్వు చాలా సార్లు పిలిచావు అప్పుడు రావడానికి కుదరలేదు. ఆ చనువుతోనే ఇప్పుడు మా అంతట మేము మీ ఇంటికి భోజనానికి వస్తున్నామని చెప్పుతున్నాము’ అని అన్నారు.
ఫోన్ లో ఈ విషయం వినగానే ఒక్కసారిగా విసుగు వచ్చింది అత్తయ్య గారూ ఇప్పుడు పప్పు, కూర, పులుసు అన్నీ చేయాలి."
"తప్పమ్మా! అలా ఆలోచించకు. చాలా మంది ఈరోజు ఉపవాసం వుంటారు నువ్వు భోజనానికి పిలిచినా కూడా ఎవరూ రారు. అలాంటిది శివరాత్రి నాడు వాళ్ళంతట వారు భోజనానికి వస్తానని చెప్పడమే చాలా అదృష్టం. ఆ పార్వతీ పరమేశ్వరులు ఆ దంపతుల రూపంలో నీ ఇంటికి వస్తున్నారని భావించు.
భగవంతుడు ఒక్కొక్కసారి మన పాప కర్మలు తగ్గించాలని ఒక వ్యక్తి రూపంలో గాని, ఒక గురువు రూపంలో గాని, ఒక గోవు రూపంలో గాని, మన ఇంటికి పంపిస్తారుట. వాళ్లకి మన చేతులతో ఏమి పెట్టినా ఎంతో కొంత పుణ్యం మన ఖాతాలో జమ అవుతుంది.
ఎవరన్నా అన్నం పెట్టమని అడిగినారంటే.. భగవంతుడు ఎవర్నో అడ్డం పెట్టుకొని వారి ద్వారా మనకు పుణ్య ఫలమును ప్రాప్తి చేస్తున్నాడు అని అర్ధం. దానిని సరిగా మనం వినియోగించుకోవాలి.
నీవు అన్నం పెట్టడం కన్నా..
వాళ్ళు నీ ముందుకు వచ్చి అన్నం పెట్టు అమ్మా అని..
చేయి జాచితే అంత కంటే పుణ్యం ఇంకొకటి లేదు."
మా అత్తగారు అన్న మాటలతో నా కళ్ళు తెరుచుకున్నాయి.
మా అత్తగారు కూడా నాతో వంటింట్లోకి వచ్చారు. "పద నేను కూడా సాయం చేస్తాను. నాలుగు బర్నర్ మీదా నాలుగు పెట్టేద్దాం. గబగబా వంట చేసేసి ఏదైనా స్వీట్ కూడా చేద్దాం. ఇంట్లో కొత్త చీర పంచలచాపు వున్నాయి కదా! ఆ బట్టలు వాళ్ళకు పెట్టి కాళ్లకు నమస్కారం చేయమ్మా."
"అలాగే అత్తయ్య గారూ! తప్పకుండా మీరు చెప్పినట్లే చేస్తాను" నేను చాలా సంతోషంగా చెప్పాను.
##--------##
లక్ష్మి చివుకుల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
Podcast Link
https://spotifyanchor-web.app.link/e/nO9iNyEXXvb
Twitter Link
https://twitter.com/ManaTeluguKatha/status/1605906445572001792?s=20&t=6BueFONJ5FubDXw482hvQw
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
https://www.facebook.com/ManaTeluguKathaluDotCom
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
https://www.manatelugukathalu.com/profile/lakshmichivukula/profile
నా పేరు - లక్ష్మి చివుకుల
నా మొదటి కథ 1984 వ సంవత్సరంలో ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక లో ప్రచురించారు. ఆనాటి వార, మాస పత్రికలలో నా కథలు దాదాపు ప్రచురితం అయ్యాయి. సంసార సాగరంలో కొట్టుకు పోయి కొంత కాలం విరామం తీసుకుని పిల్లల బాధ్యతలు నెరవేర్చుకుని ఈమధ్యనే మళ్లీ రచనలు మొదలు పెట్టాను.
నేను నివసించేది హైదరాబాద్ లో.