top of page

ఆత్మ న్యూనత


'Athma Nyunatha' New Telugu Story

Written By Ch. Pratap

'ఆత్మ న్యూనత' తెలుగు కథ

రచన : Ch. ప్రతాప్


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

విజయనగరంలో రామయ్య అనే ఒక బట్టల వ్యాపారి వుండేవాడు. నాణ్యమైన బట్టలను దూర ప్రాంతాల నుండి తీసుకువచ్చి, తక్కువ లాభాలను వేసుకొని అమ్ముతుండడంతో అతని వ్యాపారం వృద్ధి చెందడంతో పాటు, అతనికి నిజాయితీ గల వర్తకుడన్న మంచి పేరు కూడా వచ్చింది. అతనికి లేక లేక ఒక కొడుకు పుట్టాడు. అయితే పుట్టుకతోనే ఆ పిల్లవాడికి ఎడమకాలు అవలక్షణం ఏర్పడింది. అది ఎముకల బలహీనత వలన సన్నగా వుండి, నిలబడలేక పోయేవాడు. అప్పుడు రామయ్య ఆ ఊరి వైద్యుడి సలహాతో పట్నం వెళ్ళి ఆ కాలుకు లోహంతో చేయబడిన ఒక కవచాన్ని వేయించాడు. దాని సహాయంతో ఆ పిల్లవాడు ఎలాంటి బాధ లేకుండా నడవగలిగేవాడు. అయితే నడకలో మాత్రం అవలక్షణం ఏర్పడి కుంటుతూ నడిచేవాడు. అయితే అయిదేళ్ళ ప్రాయంలో విద్యాభ్యాసం కోసం పాఠశాలకు వెళ్ళినప్పుడు అతనికి ఇబ్బందులు ఎదురవసాగాయి. చిన్న క్లాసులలో అతని తోటి వారు ఈ కాలును చూసి నవ్వేవారు. కుంటివాడు అన్న పేరు కూడా పెట్టారు. అయితే ఈ ఇబ్బందులు పెద్ద క్లాసులకు వెళ్ళినప్పుడు మరింత ఎక్కువయ్యాయి. నవ్వడం, అవహేళన చేయడం తో పాటు అతని ఎదురుగా కుంటి నడక అనుసరించడం లాంటి పనులు చేస్తుంటే ఆ అబ్బాయి ఎంతో బాధపడుతుండేవాడు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎంత సర్ది చెప్పినా ఆ ఆత్మన్యూనత నుండి బయటపడలేక పోయాడు. ఇదంతా చూసాక రామయ్య ఈ సమస్య నుండి బయటపడేందుకు తన స్నేహితులను, తోటి వ్యాపారస్థులను సంప్రదించాడు. ఒకరోజు పొరుగు రాష్ట్రంలో వున్న ఒక పురాతనమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేయిస్తే వెంటనే ఆ కాలు బాగుపడుతుందన్న నమ్మకంతో వేలాది మంది అక్కడికి వెళ్ళి, పూర్తిగా బాగై తిరిగి వస్తున్నారని చెప్పి తన కొడుకుతో అక్కడికి ప్రయాణం కట్టాడు. విషయం తెలుసుకున్న ఆ అబ్బాయి, నిజంగా అక్కడికి వెళ్ళి పూజలు చేయిస్తే కాలు బాగవుతుందా అని తండ్రిని అడిగాడు. తండ్రి ఆ మందిరం గురించి తాను విన్న కధలు అన్నీ చెప్పి వాడిలో నమ్మకం కలిగించాడు. తండ్రీ కొడుకులిద్దరూ పొరుగు రాష్ట్రానికి ప్రయాణం కట్టారు. రెండు రోజుల ప్రయాణం తర్వాత ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మందిరానికి చేరుకున్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను నెలవుగా వున్న ఒక అద్బుతమైన ఆలయం అది. భక్త జనంతో కిటకిటలాడుతోంది. వారిద్దరూ గర్భగుడిలో ప్రవేశించి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడున్న పూరోహితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. స్వామికి అభిషేకం చేసిన జలంతో ఆ అబ్బాయి ఎడమ కాలు మీద మర్ధనా చేసాడు రామయ్య. గుడి బయటకు రాగానే ఆ అబ్బాయి ఆశ్చర్యంతో ఎగిరి గంతేశాడు. నా ఎడమ కాలులో ఏదో శక్తి వచ్చినట్లు అనిపిస్తొంది. ‘ఇక మీదట నేను పరిపూర్ణమైన ఆరోగ్యంతో నడవగలను’ అని తండ్రితో అన్నాడు. రామయ్య మరింత ఆశ్చర్యంతో కొడుకు కాలు వంక చూసాడు. అది ఎప్పటిలా, శక్తిహీనంగా వుంది. అప్పుడు ఆ అబ్బాయి “నాన్నగారు, నా కాలు లో వున్న లోపం అలాగే వుంది. కాని ఆ సమస్యను తలుచుకుంటూ బాధపడుతూ ఆత్మ న్యూనతతో బాధపడే నా మనస్సులో వున్న లోపాన్ని ఆ దేవుడు సరి చేసాడు. ఇకమీదట ఈ కాలు అవిటితనం గురించి ఎంతమాత్రం బాధపడను. ఇతరులు నా కాలు గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసినా పట్టించుకోను సరికదా వారిని మరింత ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటాను. నిరాశ, నిస్పృహ లతో కూడిన నిస్సహాయత నిట్టూర్పైనప్పుడు మన నీడ కూడా నిశీధిలో మనకు ఒంటరితనం నుండి ఓదార్పు భావన కలిగించలేదు సరికదా ఇంకా ఆత్మన్యూనతకు బీజం వేస్తుందని, ఆత్మన్యూనతా భావం చెద పురుగు వలే తినేస్తే ఆత్మ విశ్వాసం చీమ వలే చైతన్యం చేస్తుందని ఉపాధ్యాయుడు చెప్పిన మాటలు ఇప్పుడు గుర్తుకొచ్చాయి. చదువులతో పాటు క్రీడలలో కూడా రాణిస్తానని మాట ఇస్తున్నాను. ఇక నా గురించి మీరు అమ్మ ఎలాంటి బెంగ పెట్టుకోకండి " ఎంతో ధైర్యంగా చెప్పాడు. చెప్పడమే కాదు ఆ క్షణం నుండి ఉత్సాహంగా, ఉల్లాసంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. శారీరక అవిటితనం కంటే మానసిక అవిటితనం ఎంతో ప్రమాదకరమైనదని, దానిని ప్రధమ దర్శనం లో తొలగించిన ఆ దేవదేవుడికి మనసులోనే శత సహస్ర కృతజ్ఞతాభి వందనములు తెలియజేసుకున్నాడు రామయ్య.

***

Ch. ప్రతాప్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఇక్కడ క్లిక్ చేయండి.

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


Podcast Link:


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు Ch. ప్రతాప్. నేను వృత్తి రీత్యా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో సివిల్ ఇంజనీరుగా పని చేస్తున్నాను. ప్రస్తుత నివాసం ముంబయి. 1984 సంవత్సరం నుండే నా సాహిత్యాభిలాష మొదలయ్యింది. తెలుగు సాహిత్యం చదవడం అంటే ఎంతో ఇష్టం. అడపా దడపా వ్యాసాలు, కథలు రాస్తుంటాను.

https://www.manatelugukathalu.com/profile/pratap/profile


234 views1 comment
bottom of page