'Athrutha' - New Telugu Story Written By Hanumantha T
'ఆతృత' తెలుగు కథ
రచన: T హనుమంత
రాఖీ పడక్కి స్కూలు రెండు రోజులు సెలువులు ఇచ్చినారు. ఆరోజు సాయంత్రానికి దూరపు బంధువైన మా అత్త వచ్చింది. ఎప్పుడో నా చిన్నపుడు వచ్చిందంట, మళ్ళీ ఇప్ప్పుడొచ్చింది. అత్త కోసమని అమ్మ పిండివంటలు చేసింది. అందరం తినేసి పడుకున్నాము. తెల్లవారు జామునే నీళ్ళు కాచి స్నానాలు చేయించింది మా అమ్మ.
నాన్నకు రాఖీని కట్టింది అత్త. అందరం గుడికి పోయి దేవునికి దండం పెట్టుకొని అత్తకు బట్టలు కొనివ్వడానికి బట్టల దుకాణానికి వెళ్ళాము, అక్కడ నుండి బంధువుల ఇంటికి వెళ్ళి వచ్చేసరికి మధ్యాహ్నము అయింది. నాన్న పొలానికి వెళ్ళాడు నేను అడుకొనేకి వెళ్ళినా. అత్త తెల్లవారు జామున మొదటి బస్సుకు వెళ్తుందని అమ్మ అన్ని సర్దుతుంది.
చెవిలో ఎవరో చెబుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మా అవ్వ అత్తను “ఎలా ఉంది ఇంట్లో వాతావరణం? అంతా బాగానే ఉందా!. మీ ఆయన ఇబ్బంది పెట్టట్లేదు కదా!” అని అడిగింది.
“మొదట్లో పెద్ద దిక్కుగా ఉన్న మావయ్య (భర్త వాళ్ళ నాన్న) తల్లితండ్రులు లేరని నాకు ఆసరాగా ఉండేవాడు. ఇద్దరికీ సర్ది చెప్పేవాడు. పించన్ డబ్బులు కూడా పిల్లల కోసమని నాకే ఇచ్చేవాడు. నా భర్త ఎప్పుడైనా సార తాగివస్తే ఇంటి బయటనే ఉండమని గోల చేసేవాడు.
మావయ్య పోయినప్పటి నుంచీ ఇతను మరింత ఎక్కువ బాధ పెడుతున్నాడు. పంటలు పండటంలేదు, బావిలోని నీరు ఇంకిపోయినాయి. పూడిక తియిద్ధామన్నా వినట్లేదు. పొద్దున పోయినొడు రాత్రైనా ఇంటికి రాడు. చిన్న చిన్న విషయాలకే నానా మాటలంటాడు”. అని తన బాధను చెప్పుకుంది.
“సరే నువ్వేమి బాధపడొద్దు .నేను నీతో పాటు వస్తాను” అని నాన్నకు చెప్పి బయలుదేరింది. నేను నిద్ర లేవనట్టుగా అలాగే పడుకున్నాను.
బస్సు వచ్చింది. అవ్వని, అత్తని బస్సు ఎక్కించడానికి వెళ్లి వచ్చాము. స్కూలుకి బయలుదేరుతుంటే అదే ఆలోచనలో ఉన్నా.. అవ్వ ఇపుడు ఏం చేస్తుంది.. ఇద్దరినీ కలుపుతుందా!. ఇంతకీ ఎందుకు గొడవ పడుతున్నారు. అని అవే ఆలోచనలు. ఎవరిని అడగాలో అర్థమే కావట్లేదు, అమ్మని అడుగుదామని వెళ్తే నీకెందుకురా అని కసిరింది.
సరే అవ్వనే అడుగుదామని నిశ్చయించుకున్నాను, కానీ అవ్వ ఊరికి పోయి వారం రోజులయింది.
మరుసటి రోజు స్కూల్ నుండి ఇంటికి వచ్చేటప్పటికి అవ్వ ఇంటిముందు కుర్చోనుంది. చాలా సంతోషంగా, ఆతృతగా వెళ్లి అడిగాను, అత్త వాళ్ళ ఊరిలో ఏంజరిగింది అని.
“మేము వెళ్ళిన రోజు మీ మామ ఇంటి దగ్గరే లేడు, ఎప్పుడో రాత్రి 10 గంటలకి వచ్చినాడు. అన్నం కూడా తినకుండా అట్లాగే పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం నన్ను చూసి పలకరించాడు. నేను కూడా ఏమీ తెలియనట్టుగా మాట్లాడాను. మా అత్త వచ్చింది ఏమైనా వంటలు చెయమని గోడకు తిరిగి చెప్పి వెళ్లి పోయాడు.
చాలా సేపైనా రాకపోవడంతో మీ సుబ్బయ్య అన్న ఇంటికి వెళ్ళాను, అక్కడ వీళ్ళ పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నాను. మరియు చుట్టుపక్కల వాళ్ళని అడిగాను. వాళ్లంతా వాళ్ళ నాన్న ఉన్నంత సేపు బాగానే ఉన్నాడు. అతను పోయిన తర్వాత డబ్బు, ఇంట్లో ఎవరూ దండించక పోవడంతో ఇలా చేస్తున్నాడు అని చెప్పారు. వాడు మళ్ళీ వాడి సమయానికే వచ్చాడు, కాళీ చేతులతో..
ఊరిలోని పెద్ద మనుషులను కలిపి వాళ్ళ నాన్న 20000 రూపాయలు పంచాయితీకి అప్పు ఉన్నట్టుగా అగ్రిమెంట్ రాయిచ్చాను. పంచాయితీకి పిలిపించి ఆ డబ్బును తీసుకొని వాడి బావి పూడిక తీయడానికి కూలి మనుషులకి ఇప్పించారు, ఊరిపెద్దలు.
ఆడపడుచులను ఒడిబియ్యం పోయించాలని చెప్పాను ఇంట్లోకి కొత్త సామాన్లు, వంటసామాగ్రి వచ్చాయి. అయినా ఇద్దరి మధ్య సఖ్యత కనబడలేదు.
పొలంలో వేరుసెనగ సెట్లు దొంగలు పికుతున్నారు అని వాడితో చెప్పించా. దెబ్బకి ఇద్దరు నన్ను ఇంటికాడ పెట్టి రాత్రి పొలం కావిలి పాయిరి. పొద్దున్నే ఇంటికొచ్చి వాళ్ళ పనుల్లో వారు నిమగ్నమయ్యారు, నేను ఇంటికి వచ్చేశాను”.
చెప్పడం ముగించింది అవ్వ.
***
T హనుమంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: పేరు: హనుమంత
జిల్లా: అనంతపురము
డిగ్రీ 3వ సంవత్సరం
Kommentare