అత్యంత ముఖ్యము
- Gadwala Somanna

- Oct 8
- 1 min read
#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #AthyanthaMukhyamu, #అత్యంతముఖ్యము, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 128
Athyantha Mukhyamu - Somanna Gari Kavithalu Part 128 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 08/10/2025
అత్యంత ముఖ్యము - సోమన్న గారి కవితలు పార్ట్ 128 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
అత్యంత ముఖ్యము
-------------------------------------------
చేసిన మేలులు
చెప్పిన పలుకులు
మరచిపోరాదు
తిరిగి చూడరాదు
బ్రతుకులో గురువులు
అమ్మానాన్నలు
అత్యంత ముఖ్యము
ప్రేమించు వ్యక్తులు
విలువైన జ్ఞానము
అనుదినము ధ్యానము
అత్యంత ముఖ్యము
బ్రతుకులో నియమము
క్షమించే తత్వము
స్నేహించు హృదయము
అత్యంత ముఖ్యము
మదిని మమకారము
నైతిక విలువలు
తనువున వలువలు
అత్యంత ముఖ్యము
బ్రతుకున ఆప్తులు
ముఖమున నవ్వులు
వనమున పువ్వులు
అత్యంత ముఖ్యము
మనసున్న మిత్రులు

అక్షర సత్యమే కదా!
---------------------------------------
ఆకులుంటే తరువులు
జలములుంటే చెరువులు
అక్షర సత్యమే కదా!
విలువలుంటే వేల్పులు
పైరులుంటే పొలములు
పిల్లలుంటే గృహములు
అక్షర సత్యమే కదా!
తృప్తి ఉంటే బ్రతుకులు
మనసుంటే మనుషులు
బుద్ధి ఉంటే పెద్దలు
అక్షర సత్యమే కదా!
ఆపదలో ఆప్తులు
మొక్కలుంటే సొగసులు
చుక్కలుంటే వెలుగులు
అక్షర సత్యమే కదా!
ప్రతిభ ఉంటే ఘనతలు

పుస్తకాల ప్రబోధ గీతి
--------------------------------------
పనికిరాదు తొందరపాటు
నిదానమే ప్రధానము
వద్దోయ్! ఏమరుపాటు
తెలుసుకో ఓ నేస్తము!
చేయకు గందరగోళము
మానుము వేళాకోళము
నీ వ్యక్తిత్వం గాంచి
హర్షించును భూగోళము
ప్రేమగా అందరితో
మంచిగా మిత్రులతో
ఉండాలి హుందాగా
చక్కని సంస్కారంతో
కలుపుగోలుతనంతో
సమ న్యాయ భావంతో
మెలగాలోయ్ జగతిలో
ఘనమైన వ్యక్తిత్వంతో

పుత్రిక సదనంలో దీపిక
-----------------------------------------
ఇంటిలోన పుత్రిక
మింటిలోన తారక
చదివిస్తే చాలును
అవుతుందోయ్! ఏలిక
గొప్పగా పెంచాలి
ప్రేమనే చాటాలి
వివక్షత మానేసి
కొడుకుగా చూడాలి
భగవంతుని కానుక
మనసేమో మల్లిక
కూతురే బ్రతుకులో
మమకారపు మూలిక
సదనంలో దీపిక
చదువుకున్న పుత్రిక
న్యాయమే చేయాలి
ప్రగతి బాట వేయాలి
కూతురనిన దేవత
చదివించుట బాధ్యత
ఇవ్వాలోయ్! తప్పక
ఎదుగుటకు చేయూత

కలం మీద ఒట్టు!
---------------------------------
పంచభూతాల సాక్షిగా
దుర్మార్గులకు నాశనము
తప్పకుండా ఉంటుంది
హఠాత్తుగా వస్తుంది
తప్పించుకోలేడు
భూమ్మీద ఏ నరుడు
ఆ భీకర యమపాశము
కాలేలేడోయ్! అమరుడు
జీవితాన రవ్వంత
మంచినే చేయాలోయ్!
మితిలేని స్వార్థమింత
మట్టిలో పాతాలోయ్
పాపము, పుణ్యము మాత్రము
మన వెంబడి వచ్చేది
ఏ సంపద వెంటరాదు
తెలుసుకో ఈ మర్మము
-గద్వాల సోమన్న




Comments