ఆవేశము అనర్థము
- Gadwala Somanna
- 5 days ago
- 1 min read
#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #AvesamuAnarthamu, #ఆవేశముఅనర్థము, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 108
Avesamu Anarthamu - Somanna Gari Kavithalu Part 108 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 13/08/2025
ఆవేశము అనర్థము - సోమన్న గారి కవితలు పార్ట్ 108 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
ఆవేశము అనర్థము
----------------------------------------
మనసులోని ఆవేశము
ఉప్పెనలా మారరాదు
అంతులేని అనర్థము
బ్రతుకున తెచ్చుకోరాదు
ఆవేశంలో నిర్ణయము
తెచ్చుపెట్టును చిక్కులు
ఆదిలోనే ఆశయము
నీరుగారిపోరాదు
ఆరోగ్యం చెరుపుతుంది
ఆనందం హరిస్తుంది
కట్టలు తెగిన ఆక్రోశము
బంధాలను తెంపుతుంది
వద్దు క్షణికావేశము
ముద్దు ప్రశాంత చిత్తము
నియంత్రణ చేస్తేనే
ఏదైనా ఇక సాధ్యము

అమ్మ చెప్పిన అమూల్యమైన మాటలు
------------------------
చెప్పుడు మాటలు విని
చేసుకోకు అపార్ధము
వదల వద్దు నిజాలెరిగి
యధార్థమైన మార్గము
కఠినమైన చిన్న మాట
చేస్తుందోయ్! గాయము
మాటలతో జాగ్రత్త!
వెన్నలాంటిది హృదయము
అనుమానం చిన్నదైనా
బ్రతుకులు కూలదోస్తుంది
అతిచిన్న రంధ్రమైనా
ఓడను ముంచేస్తుంది
అప్రమత్తమవసరము
లేకుంటే నష్టమే
చెరుపు చేసే నోటికి
వేయాలోయి తాళము

పిల్లలు ఉత్తములు - మల్లెల హృదయులు
---------------------------------------
పసి పిల్లల అందాలు
విరిసిన అరవిందాలు
ఇంటిలోన చూడంగా
కాంతులీను దీపాలు
ప్రేమకు ప్రతి రూపాలు
నింగిని ఇంద్ర చాపాలు
పవిత్రమైన పసివారు
వారికెవరు సాటిలేరు
మంచికి ప్రతిబింబాలు
మచ్చలేని మాణిక్యాలు
ఆడే పాడే పిల్లలు
ఆనంద సాగరాలు
లేనివారు అరమరికలు
ఆప్యాయతకు ప్రతీకలు
చింతలు లేని బాలలు
కన్పించే ఇలవేల్పులు
పిల్లలంటే ఉత్తములు
మల్లెల్లాంటి హృదయులు
వారుంటే సదనాలు
చూడ నందన వనాలు

ఆవేశము అనర్థము
--------------------------------------
మనసులోని ఆవేశము
ఉప్పెనలా మారరాదు
అంతులేని అనర్థము
బ్రతుకున తెచ్చుకోరాదు
ఆవేశంలో నిర్ణయము
తెచ్చుపెట్టును చిక్కులు
ఆదిలోనే ఆశయము
నీరుగారిపోరాదు
ఆరోగ్యం చెరుపుతుంది
ఆనందం హరిస్తుంది
కట్టలు తెగిన ఆక్రోశము
బంధాలను తెంపుతుంది
వద్దు క్షణికావేశము
ముద్దు ప్రశాంత చిత్తము
నియంత్రణ చేస్తేనే
ఏదైనా ఇక సాధ్యము

మనిషిలో మంచి చూడాలి
--------------------------------------
పొరుగువారి నెపములు
ఎంచుట తగదు తగదు
లెక్క లేని ఇడుములు
కలుగజేయ కూడదు
అందరు భగవంతుని
స్వరూపం గలవారు
ఈ భావన మరువకు
నిర్లక్ష్యం చేయకు
ప్రతి మనిషిలో మంచి
వెదికి వెదికి చూడాలి
గొప్పగా ఎంచి ఎంచి
గౌరవం ఇవ్వాలి
దేవుని సృష్టిలోన
అందరూ సమానము
తలచుకో మనసులోన
మేలి పనులు పూనుము
-గద్వాల సోమన్న
Comments