అవినాభావ సంబంధం
- Dr. Brinda M. N.
- 1 day ago
- 2 min read
#AvinabhavaSambandham, #అవినాభావసంబంధం, #DrBrindaMN, #డాక్టర్.బృందఎంఎన్., #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Avinabhava Sambandham - New Telugu Poem Written By Dr. Brinda M N
Published In manatelugukathalu.com On 14/12/2025
అవినాభావ సంబంధం - తెలుగు కవిత
రచన: డాక్టర్ బృంద ఎం. ఎన్.
మనిషికి పడవకు అవినాభావ సంబంధం
నౌకకు మూలాధారం జలతత్వం
మానవునికి ఆధారం సంసార సాగరం
ఇరువురు అందులో మునిగే సమయం
వివిధ రకాల నామధేయాల స్వరూపం!!
మెదడులో మెలిగే ఆలోచనల సమాహారం
పతాక శీర్షికతో వెలిగే కాంతిపుంజం
పడవ పయనించాలంటే కావాలి
ముఖ్యస్తంభం
జీవన గమనానికి వెన్నెముక మూలస్తంభం
త్రివర్ణ పతాకం మనదేశ చిహ్నం!!
జెండా లేనిదే నావ చేరదు తీరం
హెచ్చరికకై చేయు శబ్దయంత్రం
ఆయుప్రమాణ సంరక్షణకై ఆరోగ్య మంత్రం
పెద్ద చిన్న త్రాడుల సమన్వయం
చిన్నా-పెద్దల అపురూప సత్సంగం!!
అంతస్తు నుండి అంతస్తుకు మార్గం
కార్యంలో దశాదిశా నిర్దేశ బీజం
నౌకకు తెడ్డు అత్యవసరం
కోరికల గుర్రాలకు కళ్ళెం కచ్చితం
అలలు శృతి తప్పితే గగనం!!
మనుజుడు స్మృతి వీడితే మరణం
జీవిత రక్షక జాకెట్టుతో క్షేమం
బ్రతుకు ధీమా కొరవడితే క్షామం
నదిపై పడవ పాటకు తాళం
జీవన సంఘంలో విరియాలి ప్రేమానురాగం!!
"జై తెలుగుతల్లి! జై భరతమాత"
డాక్టర్ బృంద ఎం. ఎన్. గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: డాక్టర్ బృంద ఎం. ఎన్.
కవయిత్రి, రచయిత్రి, గాయని,
స్కిట్ డైరెక్టర్, చిత్రకారిణి
15 సంవత్సరాలుగా నిరంతర తెలుగు భాషా పరిరక్షణ కొరకు పాటుపడుట
భారతీ సాహితీ సమితిలో ప్రధాన కార్యదర్శిగా ఉండి ఆధునిక ప్రాచీన సాహిత్యంపై పని చేయడం అలాగే విద్యార్థులకు సుమతీ, వేమన, భాస్కర శతక పద్య పోటీలు నిర్వహించుట, తెలుగు సాహితీ మూర్తుల జయంతి వేడుకలు జరిపి వారి సేవలను గురించి సమాజానికి తెలియపరచుట, సందేశాత్మక కథలు, నీతి కథలు వ్రాసి విజేతలగుట, ప్రపంచ తెలుగు మహాసభల్లో చురుకుగా పాల్గొని (delegate) పెద్దవారి ప్రశంసలు పొందుట, యువతను ఉద్దేశించి రచనలు చేయుట, భారతదేశ ఔన్నత్యాన్ని దశ దిశల చాటుట, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కవి సమ్మేళనంలో పాల్గొనుట తదితరమైనవి.




Comments