అవినీతి వ్యాపారం
- Srinivasarao Jeedigunta

- 5 days ago
- 4 min read
#AvineethiVyaparam, #అవినీతివ్యాపారం, #JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #TeluguMoralStories, #తెలుగునీతికథలు

Avineethi Vyaparam - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao Published In manatelugukathalu.com On 12/02/2026
అవినీతి వ్యాపారం - తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
శేఖర్ పెద్ద సివిల్ కాంట్రాక్టర్. డబ్బు, దానితో పాటు అధికారులతో స్నేహం. శేఖర్‌కి డబ్బు ముందు సామాన్యుల ప్రాణాలు తృణప్రాయం అనిపించింది. ఆ ఊరికి కొత్త కలెక్టర్‌గా వచ్చిన సీతారామ్‌ని బుట్టలో వేసుకుని అతనితో స్నేహం చేయడం మొదలు పెట్టాడు శేఖర్. అయితే సీతారామ్ మాత్రం శేఖర్‌తో కల్మషం లేకుండానే స్నేహం చేశాడు.
ఒక భారీ ప్రాజెక్టులో జరిగిన పది కోట్ల అవినీతిని కలెక్టర్ సీతారామ్ తెలుసుకుని, అందులో ముఖ్య పాత్ర శేఖర్‌కి ఉందని, మిత్రుడు శేఖర్‌ని హెచ్చరించి, పద్ధతి మార్చుకుని నిజాయితీగా వ్యాపారం చేసుకోమని, తన దగ్గరికి వచ్చిన ఆధారాలు బయట పెట్టకుండా స్నేహధర్మంతో "నిన్ను ఈసారికి కాపాడుతున్నాను. ఇంకొకసారి ఇటువంటి తప్పు జరిగితే నిన్ను నేను కాపాడలేను," అన్నాడు.
"ఇంటి గుట్టు లంకకు చేటు" అన్నట్టుగా, ఈ కలెక్టర్ వల్ల తన కెరీర్ ముగిసిపోతుందని భయపడి, సీతారామ్‌ని ఎలాగైనా వదిలించుకోవాలి అనుకుని, శేఖర్ ఒకరోజు కలెక్టర్ సీతారామ్‌ని ఒక రోడ్డు ప్రమాదంలో చంపించి. అది కేవలం ఒక ఆకస్మిక ప్రమాదమని లోకాన్ని నమ్మించాడు. ఆ సమయంలో శేఖర్ దగ్గర ఉన్న కీలకమైన సాక్ష్యాలు (Hard Drive) ఎక్కడున్నాయో ఎవరికీ తెలియకుండా పోయింది.
కలెక్టర్ సీతారామ్ కొడుకు విజయ్ ఒకరోజు తన తండ్రి రాసిన డైరీ చదివి శేఖర్ చేసిన మోసం గురించి తెలుసుకుని, తన తండ్రి మరణానికి ఈ శేఖర్ చేసిన మోసానికి ఏమైనా సంబంధం ఉందా అని అనుమానంతో తండ్రి వస్తువులన్నీ వెతికితే అందులో దొరికిన ఫైల్, ఒక పెన్ డ్రైవ్ చూసి తన తండ్రి మరణం వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకుని, ప్రతీకారం కోసం శేఖర్ దగ్గరే ఉద్యోగంలో చేరాడు. శేఖర్ కూడా కలెక్టర్ సీతారామ్ కొడుకు కాబట్టి నమ్మకంగా విజయ్‌ని తన పర్సనల్ అసిస్టెంట్ గా పెట్టుకుని నమ్మకం కుదిరిన తర్వాత తన వ్యాపార రహస్యాలు మెల్లగా తెలియజేస్తూ ఉండేవాడు.
కొన్నాళ్ళు అతను నేరుగా దాడి చేయకుండా శేఖర్ రహస్యాలు తెలుసుకోవడం మొదలుపెట్టాడు విజయ్.
విజయ్ శేఖర్‌తో చాలా సన్నిహితంగా ఉంటూనే, మెల్లగా అతనికి మానసిక ఒత్తిడి పెంచసాగాడు. ఒకరోజు శేఖర్ దగ్గరికి వెళ్లి, "సార్, ఎవరో పాత కేసులను మళ్ళీ తిరగ తోడుతున్నారని సీబీఐకి కొన్ని ఫైల్స్ వెళ్లాయని వినికిడి. మా నాన్నగారి మరణం, ఆయన స్నేహాల గురించి మళ్ళీ కేసు ఎంక్వయిరీ చేస్తున్నారని సెక్రటేరియట్‌లో నా ఫ్రెండ్ చెప్పాడు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి సార్," అని భయం విత్తనాలు నాటాడు.
శేఖర్ కంగారు పడి, "విజయ్! మీ నాన్నగారు ఉన్నప్పుడు నా వ్యాపారంలో జరిగిన కొన్ని తప్పుల వల్ల కొన్ని సాక్ష్యాలు కలెక్టర్ ఆఫీసుకు చేరాయట. మీ నాన్నగారు నాకు ఆ విషయం చెప్పి ఆ ఫైల్స్ సంపాదించి నాకు ఇస్తాను అన్నారు. దురదృష్టవశాత్తు ఆ పని జరగకుండా మీ నాన్నగారు కారు ప్రమాదంలో మరణించారు. ఆ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో తెలియదు. నువ్వు నీ స్నేహితుల ద్వారా ఆ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని, వారు మనకి అందజేస్తే బాగా డబ్బు ఇస్తామని చెప్పు," అన్నాడు.
"ఎలాగైనా కనిపెట్టాలి. నా ఇమేజ్ దెబ్బతినకూడదు," అని హెచ్చరించాడు.
విజయ్ ఒక వినూత్నమైన ఆలోచన చేశాడు. శేఖర్‌తో ఇలా అన్నాడు: "సార్, ఆ హార్డ్ డ్రైవ్ మా నాన్నగారి పాత లైబ్రరీలో ఎక్కడో దాచారని నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ దాన్ని 'స్మార్ట్ సెన్సార్' తో డిజైన్ చేశారు. అది కేవలం మీ వేలిముద్రలతో లేదా మీ కంటి స్కాన్ (రెట్టినా స్కాన్) తో మాత్రమే తెరుచుకుంటుందిట. పోయిన మా నాన్నగారు ఎలాగో పోయారు. మిమ్మల్ని మా అవుట్‌హౌస్‌కి తీసుకువెళ్తాను. మీరు దాన్ని మీరు తప్ప వేరే ఎవరూ ఓపెన్ చేయలేరు. పోలీసులు దాన్ని పట్టుకోకముందే మనం వెళ్లి డిలీట్ చేద్దాం." "మీరు ఇద్దాము అనుకున్న డబ్బు నాకే ఇస్తే నేను కూడా ఏదైనా వ్యాపారం చేసుకుంటాను."
శేఖర్ లోలోపల నవ్వుకున్నాడు. "డబ్బుకు లోకం దాసోహం" అన్నట్టుగా, తండ్రి రహస్యం కూడా బయటపెట్టడానికి సహాయం చేస్తాను అంటున్నాడు అనుకుని, "ముందు వెనుక చూడకుండా" విజయ్ చెప్పిన పాత అవుట్‌హౌస్‌కి అర్ధరాత్రి వెళ్లారు.
అక్కడ ఒక పాత కంప్యూటర్ సిస్టమ్ ఉంది. విజయ్ చెప్పినట్లుగానే శేఖర్ తన వేలిముద్రను స్కాన్ చేశాడు. సిస్టమ్ ఓపెన్ అయ్యింది. స్క్రీన్ మీద పదేళ్ల క్రితం జరిగిన కుంభకోణం ఫైల్స్ అన్నీ కనిపించాయి. శేఖర్ ఆవేశంతో స్నేహం నటించి, "సీతారామ్! నా రహస్యాలు నీ దగ్గర పెట్టుకున్నావా! ఎప్పటికైనా నీ వల్ల నాకు ప్రమాదం అనుకుని నిన్ను పైలోకంలోకి పంపించాను! నీ కొడుకుని నా అంత వాడిని చేస్తాను!" అని పగలబడి నవ్వుతూ, ఆ ఫైల్స్‌ను డిలీట్ చేయడం మొదలుపెట్టాడు.
అప్పుడే విజయ్ గదిలోకి వచ్చి, అక్కడ ఉన్న ఒక భారీ కర్టెన్ పక్కకు జరిపాడు. దాని వెనుక ఒక స్క్రీన్ ఉంది. ఆ స్క్రీన్ మీద శేఖర్ నవ్వుతూ మాట్లాడిన మాటలు చూపించి. "మా నాన్నగారిని హత్య చేయించింది మీరే అని రుజువైంది. ఈ వార్త నేరుగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన మీడియా ఛానెల్స్‌కు 'లైవ్ స్ట్రీమింగ్' అవుతోంది. మీరు ఇంకా తప్పించుకోలేరు!" అన్నాడు.
", "మీరు డిలీట్ చేస్తున్నది డమ్మీ ఫైల్స్ సార్. కానీ మీరు ఇప్పుడు అన్న మాటలు మాత్రం 'లైవ్'లో కోట్లాది మంది విన్నారు. మీరు నా తండ్రిని చంపానని మీ నోటితోనే ఒప్పుకున్నారు," అన్నాడు.
విషయం గ్రహించి శేఖర్ స్థాణువైపోయాడు. తన అధికారం, తన హోదా అంతా ఒక్క నిమిషంలో కాలి బూడిదయ్యాయి. విజయ్ కళ్లలోకి చూస్తూ, "ఎవడవురా నువ్వు?" అని అరిచాడు.
విజయ్ కళ్లలో నీళ్లు తిరుగుతున్నా, గొంతులో పట్టు తగ్గకుండా, "నేను సీతారామ్ గారి కొడుకునని చెప్పినా గ్రహించలేకపోతున్నారు అంటే మీ మెదడు మొద్దుబారిపోయిందన్నమాట. 'ఇతరుల కోసం తవ్విన వాడు తవ్విన గోతిలో తానే పడతాడు' అన్నట్లు, ఇన్నాళ్లూ మీరు చేసిన పాపమే మిమ్మల్ని ఈ స్థితికి తెచ్చింది. మీరు సాక్ష్యాలను చెరిపేయొచ్చు, కానీ నిజాయితీని చంపలేరు," అన్నాడు.
పోలీసులు వచ్చి శేఖర్‌ను అరెస్టు చేసి తీసుకువెళ్లిపోయారు. విజయ్ తన తండ్రిని చంపిన హంతకుడిని పట్టించినందుకు తృప్తితో అక్కడి నుండి నిష్క్రమించాడు.
సంపాదనకి సంతృప్తి లేకపోతే అనర్థాలు తప్పవు. తస్మాత్ జాగ్రత్త.
సమాప్తం.
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.






@saipraveenajeedigunta8361
• 3 hours ago
Good one
@t.s.sbhargavateja6196
•7 hours ago
Very nice story.