అవినీతిని అంతం చేద్దాం
- Chilakamarri Rajeswari

- 1 day ago
- 2 min read
#ChilakamarriRajeswari, #చిలకమర్రిరాజేశ్వరి, #AvineethiniAnthamCheddam, #అవినీతినిఅంతంచేద్దాం, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Avineethini Antham Cheddam - New Telugu Poem Written By - Chilakamarri Rajeswari Published in manatelugukathalu.com on 14/12/2025
అవినీతిని అంతం చేద్దాం - తెలుగు కవిత
రచన: చిలకమర్రి రాజేశ్వరి
అవినీతి మర్రిచెట్టులా విస్తరిస్తునే ఉంది
కొమ్మలు కత్తిరించినా, మరల చిగుర్లు వేస్తునే ఉంది
మర్రిచెట్టు విస్తరించి నీడను ఇస్తుంది
అవినీతి ఎదుటి మనిషిని పీక్కుతినేటట్టు చేస్తుంది
అవినీతికి అలవాటు పడటం అంటే
విలాసాల మోజు పెరిగి, ఊరికే వచ్చే ధనం కోసం
నైతిక విలువలకు తిలోదకాలు ఇవ్వడం
ధన వ్యామోహంలో తనకున్న దానితో సంతృప్తి చెందక
పై స్థాయికి ఎదగాలనే తపనతో లంచాలు మరగడం
పని జరగాలంటే పైకం చేతిలో పడాల్సిందే
ఫైలు కదలాలంటే ఆఫీసరు మది కరగాల్సిందే
అర్జీ పెట్టుకున్న మనిషి, అర్హుడా, కాదా అన్నది కాదు పరిశీలించే విషయం
ముందు మనకు ఎంతవరకు ఇవ్వగలడు అనేది తేల్చుకోవాల్సిన ముఖ్యాంశం
ఇంకా ఎంతకాలం ఈ కథ ఇలా కొనసాగిద్దాం?
అవినీతి ఊబిలో ఇంకా ఇంకా మునిగిపోకముందే మేలుకుందాం
ఇకనైనా ఒక చక్కని ముగింపు పలుకుదాం
ఇది ఒక వ్యక్తి సమస్య కాదని, అందరి సమస్య అని గుర్తిద్దాం
కలిసికట్టుగా పని చేద్దాం, నిజాయుతీకి పట్టం కడదాం
కార్యాలయాలలో జవాబుదారీతనాన్ని అలవాటు చేద్దాం
***
చిలకమర్రి రాజేశ్వరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: చిలకమర్రి రాజేశ్వరి
నా పేరు చిలకమర్రి రాజేశ్వరి. నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో డిప్యూటి జనరలు మానేజర్ గా పనిచేసి, ఆగష్టు 2024లో రిటైరు,అయ్యాను.
మా కుటుంబ సభ్యులందరూ సాహితీప్రియులు కావడంతో, నా చిన్ననాటి నుంచే, తెలుగు వార,మాస పత్రికలు, నవలలు చదవం అలవాటు అయింది. అదే నాలోని పఠనాసక్తిని పెంపొందించింది. అనేక అంశాల మీద కవితలు రాయడం అభిరుచిగా మారింది. స్టీలుప్లాంట్ వారు,నిర్వహించిన వివిధ కవితల పోటీల్లో పాల్గొనడం, కొన్నిటికి బహుమతులు అందుకోవడం జరిగింది.
నీవు రాయగలవు అంటూ నన్ను అనునిత్యం ప్రోత్సహించే కుటుంబసభ్యుల మద్దతు నాకుండటం నా అదృష్టం.
పుస్తకాలు చదవడం నా హాబీ. తెలుగు, ఇంగ్లీషుభాష లలో వీలైనన్ని మంచిపుస్తకాలు చదివి నా మనోవికాసాన్ని, నా విశ్లేషణాశక్తిని మెరుగుపరుచుకోవాలని నా ఆకాంక్ష.




అవినీతిని అంతము చేయాలి సందేశము బాగుంది