top of page
Original.png

అయోమయానికి బహుమతి వచ్చింది

#NallabatiRaghavendraRao, #నల్లబాటిరాఘవేంద్రరావు, #అయోమయానికిబహుమతివచ్చింది, #AyomayanikiBahumathiVachhindi, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు


Ayomayaniki Bahumathi Vachhindi - New Telugu Story Written By - Nallabati Raghavendra Rao Published in manatelugukathalu.com on 20/01/2026

అయోమయానికి బహుమతి వచ్చింది - తెలుగు కథ

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

అయోమయపు అప్పలకొండ స్వతహాగా కొంచెం పిరికివాడు. అయితే అతను 'భూతభవిష్యత్తు' అనే పత్రిక వారు హర్రర్ కథల పోటీ నిర్వహిస్తున్నారని తెలుసుకొని అందులో పాల్గొనాలని నిశ్చయించుకున్నాడు. ఒక్కొక్క కథకు పదివేల రూపాయలు బహుమతి ఇస్తున్నారని తెలిసి ఎలాగైనా కథ రాసి గిఫ్ట్ కొట్టేయాలి అనుకున్నాడు. ఎగిరి గంతులేసాడు గంతులేస్తూ చప్పట్లు కూడా కొట్టేసుకున్నాడు. 


అందుకు ఒక కారణం ఉంది. 20 ఏళ్లు క్రితం అతని తండ్రి సత్యభయంకరరావు పెద్ద హర్రర్ నవలా రచయిత అన్నమాట. సదరు భయంకర వాసన.. కొడుకు అయోమయపు అప్పలకొండకు అస్సలు ఏమాత్రం బొత్తిగా కూడా అంటుకోలేదు. 


అతనికి కథలు రాయడం రాదు కానీ అతి కష్టం మీద ప్రయత్నించితే తట్టను బుట్టలో పెట్టి.. బుట్టను తట్టలో పెట్టి ఏదో ఒకటి రాసి పడేస్తే ఎలాగోలా పంపిస్తే తనకే మొట్టమొదటి బహుమతి వస్తుందని అతని గట్టి నమ్మకం. ఎందుకంటే హామీ పత్రం ఫ్రమ్ అడ్రస్ లో సన్నాఫ్ సత్య భయంకరరావు అని పెడతాడు కనుక ఆ విషయం తెలుసుకున్న ఎడిటర్స్ ఓహో.. వీడా మనవాడే అని ఆ పెద్దాయన మీద గౌరవంతో తన కథలో సరుకు లేకపోయినా బహుమతి ఇచ్చేస్తారని అతనికి గట్టి నమ్మకం కలిగింది. అయితే అయోమయపు అప్పలకొండ రచయిత కాకపోవడంతో ఎంత ఆలోచించినా కథకు స్క్రూ దొరకలేదు. 


'చాట్ జిపిటి' మనం ఒక సినిమా కథ చెప్పమంటే డైలాగ్స్ తో చెప్పేస్తుందట అలాంటప్పుడు మనం కూడా ఆ రకంగా ప్రయత్నించి దాని ద్వారా ఒక హర్రర్ కథ కాపీ చేసి ఈ పత్రిక వాళ్లకు పంపించవచ్చు కదా '.. అనుకున్నాడు అయోమయపు అప్పలకొండ. సిస్టం దగ్గర కూర్చుని ఆన్ చేసి ఎంత ప్రయత్నించినా ఆ సైట్ లో తనకు కావలసిన విషయం ఓపెన్ కాలేదు. వెంటనే సలహా కోసం అతని ఫ్రెండు కొరివి దయానందకు ఫోన్ చేశాడు. కొరివి.. అంటే నిజం కొరివి కాదండి బాబు దానికి ఒక లాజిక్కు ఉంది అతని ఇంటి పేరు షార్టులో కె ఆర్ వి అతన్ని.. ఫ్రెండ్స్ అందరూ కొరివి దయానంద్ అని కాకుండా కొరివి దెయ్యాలరావు అంటుంటారు. 

సరే ఇదేదో భలే గమ్మత్తుగా ఉంది అనుకుంటూ ఆ దయానంద్ కూడా ఫ్రెండ్స్ పిలిచినట్టు సెట్ అయిపోయి సర్దుకుపోతున్నాడు తన పేరు ఫేమస్ అయిపోతుందన్న ఆశతో. 


సరే అతను ఒక సలహా ఇచ్చాడు. చాట్ జిబిటి బదులు కొత్తగా వచ్చిన.. "చిట్టిచాట్ జిజిపిటి "ని కొట్టమన్నాడు.. తన ఫ్రెండ్ ఇచ్చిన మంచి సలహాకు మళ్లీ ఎగిరి గంతులు వేశాడు అయోమయపు అప్పలకొండ. 


**


సమయం రాత్రి 11:00 అవుతుంది. తన డ్రాయింగ్ రూమ్ లో కుర్చీ మీద దర్జాగా కూర్చుని సిస్టం ఆన్ చేసి తన స్నేహితుడు చెప్పినట్టు కొత్త సైటు ఓపెన్ చేసి తనకు హర్రర్ కథ చెప్పమని మెసేజ్ పెట్టాడు. అయో

మయపు అప్పలకొండ. అయితే స్క్రీన్ మీద కథ కనిపించలేదు కానీ కళ్ళుమూసి తెరిచేసరికి తన ఎదురుగా కుర్చీలో ఒక వ్యక్తి కనిపించాడు. మనిషి 10 అడుగులు ఉంటాడు. భయంకరంగా ఉన్నాయి కళ్ళు, జుట్టు, ముక్కు.. 


'ఎవరు నువ్వు?'' భయపడి కంగారుపడి అడిగాడు అయోమయపు అప్పలకొండ. ఐదు అడుగుల పైకి చూస్తూ. 


'''నీ బాబును రా. అయోమయపు సత్య భయంకరాన్ని. 

పది ఏళ్ల క్రితం చచ్చిపోయాను కదా. అప్పట్లో పెద్ద భయంకర నవలా రచయితను. నీకు తెలుసు కదా కొన్ని కారణాల వల్ల నేను ఇంకా ఈ లోకంలోనే ఉన్నాను. ఆత్మలు ఇలాగే భారీగా ఉంటాయి కంగారు పడకు. 'మాలాంటి గాలి దయ్యాలు'' అందరినీ చిట్ చాట్ వాళ్ళు హోల్ మొత్తం గా వాళ్ళ గ్రిప్ లో పెట్టుకున్నారు. నువ్వు చిట్ చాట్ వాళ్ళని ఏదో కంటెంట్ అడిగావట కదా. వాళ్ల దగ్గరి రెడీగా లేదు. నీకు చెప్పమని నన్ను పంపించారు. హర్రర్ కథ చెప్తాను టేప్ చేసుకో.. '' అన్నాడు భయంకరంగా చూసి. 


'''వామ్మో.. నాన్న.. నువ్వా నాకు ఏ కథ వద్దు నువ్వు వెళ్ళిపో ముందు.. '' దడదడలాడుతూ అన్నాడు అయోమయపు అప్పలకొండ. 


''అలా కుదరదు రా. రావడమే నా ఇష్టం.. వెళ్లడం నా ఇష్టం కాదు.. మమ్మల్ని అందరినీ తమ గుప్పిట్లో పెట్టుకున్న ఆ మాయదారి "చిట్టిచాట్ జిజిపిటి " వాళ్ల చేతుల్లోనే మేం మళ్ళీ వెళ్ళిపోయే బటన్ ఉంటుందన్నమాట. నా మీద నమ్మకం లేకపోతే మీ తాత, ముత్తాతలు దయ్యాలని కూడా ఇక్కడకు రప్పిస్తాను. ముగ్గురం కలిసి నీకు బ్రహ్మాండమైన బహుమతి వచ్చే కథ చెప్తాం కచ్చితంగా గిఫ్ట్ నీకే. ఆ తర్వాత మనం మనం చూసుకుందాం. ''' అన్నాడు మరింత కేకలు పెట్టినట్టు.. దెయ్యం తండ్రి అయోమయపు సత్యభయంకరరావు'


'ఇదేదో తప్పని మేళo రా బాబు.. ఈయనకు తోడు మళ్ళీ తాత, ముత్తాత వస్తే తన పని గడిబిడే. రెండు లేనిది అనవసరంగా తల గొరుక్కున్నట్టు అయ్యింది నా పని.. ' అనుకుంటూ.. భయం చెమటకు తడిచిన బట్టలు తర్వాత పిండుకుందాంలే అనుకొని దెయ్యం తండ్రి చెప్పిన కథను టేపు చేసుకొని టెక్స్ట్ రూపంలోకి మార్చి ఆ రాత్రి కే పత్రిక వాళ్లకి పంపించేశాడు. 


*


మూడవ రోజు పత్రిక వారి నుండి పదివేల రూపాయలు బహుమతి తనకే వచ్చినట్టు మెసేజ్ వచ్చింది. అంతే కాదు ఫోన్పే ద్వారా వచ్చిన డబ్బులు పదివేలు కూడా డ్రా చేసుకొని జేబులో పెట్టుకొని ఆనందంగా మళ్ళీ తన రూమ్ లోకి వచ్చాడు అయోమయపు అప్పలకొండ. 


అప్పటికే తన దెయ్యంతండ్రి ఆ డబ్బు కోసం రెడీగా ఆ గదిలో ఇదివరకటిలాగే కూర్చుని ఉండటంతో బెదిరి పోయి, భయపడి బయటకు పరుగున వచ్చేసాడు 

అయోమయపు అప్పలకొండ. 


తలుపు వేసేసి తలుపు సందులోంచి చూశాడు. 

''బండ వెధవ.. నేను బ్రతికున్నప్పుడు కూడా ఇలాగే నన్ను డబ్బుల కోసం ఏడిపించే వాడివి. రా.. ఆ బహుమతి డబ్బు నాకు ఇచ్చేయ్. '' అంటూ తన దయ్యం తండ్రి పిలుస్తున్నట్టు అనిపించింది.. అయోమయపు అప్పలకొండ కి. 


వెంటనే ఒక్క నిమిషం ఆగకుండా తన ఫ్రెండ్ కొరివి దయ్యాలరావుకి కబురు పెట్టాడు. కొరివి దయ్యాల రావు పరుగు పెట్టుకుంటూ వచ్చి తలుపు సందులోంచి చూసి.. తనలో తానే పకపకా నవ్వుకుని ''నిజంగా మీ దెయ్యం నాన్న లోపల కుర్చీ మీద కూర్చుని ఉన్నాడు.. 

డబ్బు ఇస్తేనే కానీ వెళ్ళడు'' అని భయం భయంగా చెప్పాడు. 


''నువ్వు లోపలికి వెళ్లడానికి భయపడుతున్నావు కనుక ఈ పొడువాటి కర్రకు ఆ డబ్బు తాడుతో కట్టి ఈ తలుపుల ఖాళీ నుండి ఆ బల్ల మీద పడేటట్టు సెట్ చెయ్. 


ఆ 10 వేలు నెమ్మదిగా బల్ల మీద పడ్డాక తలుపు దగ్గరికి వేసి కళ్ళు మూసుకొని దండం పెట్టుకో. ఆ డబ్బు పట్టుకుని మీ నాన్న వెళ్ళిపోతాడు. లేదంటే నువ్వు చెప్పినట్టు మీ తాత ముత్తాత దయ్యాలని కూడా తీసు కొచ్చి నీ పీక పిసికి ఆ ముగ్గురు కలిసి చప్పరించేస్తారు''' అంటూ సలహా కూడా ఇచ్చాడు. 


అయోమయపు అప్పలకొండ చేసేదిలేక తన ఫ్రెండ్ చెప్పినట్టే డబ్బు నెమ్మదిగా బల్ల మీద పడేటట్టు పెట్టి తలుపు దగ్గరికి వేసి కళ్ళు ఒక రెండు నిమిషాలు మూసుకున్నాడు. కళ్ళు తెరిచి చూసేసరికి బల్ల మీద డబ్బులు లేవు. కుర్చీలో కూర్చున్న అతని దెయ్యం తండ్రి కూడా కనపడలేదు అయోమయపు అప్పలకొండకి. 


అంతే. ఆనందంగా తన ఫ్రెండ్ కొరివి దెయ్యాలరావు కు ఆ విషయం చెప్పి దెయ్యం తండ్రి పీడ విరగడయి నందుకు ఆనందించి ఎగిరి గంతులు వేశాడు.. మూడో సారి.. అయోమయపు అప్పలకొండ. 


అయితే కొరివి దెయ్యాలరావు అతి తెలివిగా కాజేసిన ఆ పదివేల రూపాయలు తన జేబులో సర్దుకుంటూ భ్రమ.. భ్రాంతి నుంచి బయటకు వచ్చిన తన అయోమయపు ఫ్రెండ్ అయోమయపు అప్పలకొండ వైపు చూసి నవ్వుకుంటూ.. తెగనవ్వుకుంటూ.. '' వస్తాను ఫ్రెండ్''.. అంటూ వెళ్లిపోయాడు. 


**

నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page