top of page

బ్యాడ్ లక్


'Bad Luck' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 08/10/2023

'బ్యాడ్ లక్' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


ఒకసారి నేను అర్జెంటు గా మా ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ట్రైన్స్ ఏవీ దొరకలేదు. తప్పక...బస్సు లో ప్రయాణం చెయ్యాలని.. డిసైడ్ చేసుకుని..టికెట్ తీసుకోవడానికి బస్సు స్టేషన్ కు పరిగెత్తుకుని వెళ్ళాను.


నాన్ స్టాప్ కౌంటర్ దగ్గరకు వెళ్ళి నిల్చున్నాను...అక్కడ లైన్ లో ఆల్రెడీ చాలా మంది ఉండడం తో, ఆడవారి లైన్ లో టికెట్స్ కోసం రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. అందులో ఒక ఆమె ను ఎక్కడో చూసినట్టు గా అనిపించింది...దగ్గరకు వెళ్ళి...నాకు ఒక టికెట్ తీయమని అడిగాను. తనకే నాలుగు టికెట్స్ కావాలని...అర్జెంటు గా వెళ్ళాలని 'నో' చెప్పేసింది...


తప్పక...నేను మళ్ళీ పాత లైన్ లో చివర నిల్చున్నాను. బాగా ఆలోచించగా...ఆమె ఎవరో గుర్తుకు వచ్చింది...


*****


కాలేజీ బోర్డు ఎగ్జామ్స్ లో జంబ్లింగ్ విధానం ఉండేది..ఆ రోజు మ్యాథ్స్ ఎగ్జామ్‌..ఆమె పక్కనే నేను కూర్చున్నాను...బెంచ్ కు ఒక చివర. పక్కనే ఉన్న నేను..ఫ్యాన్ కింద కూర్చున్న ఆమెకి అంత చెమటలు పట్టడం ఆశ్చర్యంగా అనిపించింది...అందులో సమ్మర్ టైం కుడా కాదు...


"ఏమండీ! ఎనీ ప్రాబ్లమ్? చెప్పండి...నేను ఏమైనా హెల్ప్ చేయగలనా?"

"ఏమీ లేదండి! " అంది ఆమె

"పర్వాలేదు! చెప్పండి మిస్!"

"మ్యాథ్స్ ఎగ్జామ్‌ అంటే నాకు భయం...పేపర్ చాలా కష్టంగా ఉంది..ఫెయిల్ అయిపోతానేమో నని చాలా భయంగా ఉంది. ఫెయిల్ అయితే.. మా నాన్న నన్ను తిడతారు..పెళ్ళి చేసేస్తానంటారు.. నాకేమో..ఇంజనీరింగ్ లో మంచి ర్యాంక్ వస్తుందని నమ్మకం...కానీ ఇంటర్ లో ఫెయిల్ అయితే...నేను తట్టుకోలేను..ఆత్మహత్యే శరణ్యం.."

"అంత మాటనకండి మిస్..."

"నా పేరు కావ్య"

"నేను హెల్ప్ చేస్తాను కావ్య గారు! ప్లీజ్ అలాగ అనకండి..మ్యాథ్స్.. నా ఫేవరెట్ సబ్జెక్టు...మన ఇన్విజిలేటర్..పక్క రూమ్ లో ఇన్విజిలేటర్ తో అసుకు కొడుతున్నారు...ఇలాంటి టైం లో...నా పేపర్ తీసుకొని రాసుకోండి! భయపడకండి!"

"థాంక్స్ అండీ! మీ పేరు?"

"నా పేరు కమల్!"

"కమల్!..చాలా థాంక్స్"


ఇన్విజిలేటర్ లేని టైం లో...కావ్య కు హెల్ప్ చేసాడు కమల్...ఎగ్జామ్‌ హాల్ లో తక్కువ మంది ఉండడం...చాలా దూరంగా ఉండడం చేత.. నేను చాలా ఈజీ గా హెల్ప్ చేయగలిగాను.

ఎగ్జామ్‌ పాస్ అవుతానని నమ్మకం తో.. చిరునవ్వుతో.. హాల్ నుంచి బయటకు వెళ్లిపోయింది కావ్య...


****


ఆమె బస్సు టికెట్ తీసుకుని, బస్సు ఎక్కి.. విండో సీట్ లో కూర్చుంది...నేను ఆమె వైపే చుస్తూ ఉన్నాను...అప్పటికన్నా...కొంచం వొళ్ళు చేసింది అంతే..నా వైపు చూస్తుందేమో, గుర్తు పడుతుందేమో నని చాలా వెయిట్ చేశాను...ఈలోపు తన బస్సు స్టార్ట్ అయి బయల్దేరింది...


నా బ్యాడ్ లక్...ఆమె నన్ను మర్చిపోయింది అనుకున్నాను..


ఈలోపు మొబైల్ లో టైం కోసం చూస్తే, నా ముఖానికి మాస్క్ ఉన్నట్టు గమనించాను...అందుకే గుర్తు పట్టలేదని అర్ధమైంది...నిజంగానే చాలా బ్యాడ్ లక్...


********

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ


44 views0 comments

Comments


bottom of page